'ప్రత్యూష బాయ్ఫ్రెండ్ను ఉరితీయాలి' | Rahul should be hanged, says Pratyusha Banerjees Father | Sakshi
Sakshi News home page

'ప్రత్యూష బాయ్ఫ్రెండ్ను ఉరితీయాలి'

Published Wed, Apr 6 2016 9:40 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

'ప్రత్యూష బాయ్ఫ్రెండ్ను ఉరితీయాలి'

'ప్రత్యూష బాయ్ఫ్రెండ్ను ఉరితీయాలి'

ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ బాయ్ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్ను ఉరితీయాలని ఆమె తండ్రి శంకర్ బెనర్జీ డిమాండ్ చేశాడు. 'రాహుల్ నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. ఆమెకు న్యాయం జరగాలి. రాహుల్కు ఉరి వేయాలి లేదా జీవితాంతం జైల్లో పెట్టాలి'  అని శంకర్ చెప్పాడు.

ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రత్యూష మృతిపై కుటుంబ సభ్యులు, సన్నిహితులు సందేహాలు వ్యక్తం చేశారు. ముంబై పోలీసులు రాహుల్పై కేసు నమోదు చేసి విచారించారు. మంగళవారం ముంబైలోని గుర్ద్వారాలో ప్రత్యూషకు సంతాపసభ ఏర్పాటు చేశారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ప్రత్యూష తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. 'ప్రత్యూష మరణించాక మేం మీడియా ముందుకు రాలేదు. చేయాల్సిన కార్యక్రమాలు పూర్తయ్యేంతవరకు మాట్లాడకూడదని భావించాం. మేం మా కూతుర్ని కోల్పోయాం. ఆమె ఎదుర్కొన్న సమస్యల గురించి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాం' అని ప్రత్యూష తండ్రి చెప్పాడు. రాహుల్ను కఠినంగా శిక్షించాలని ప్రత్యూష తల్లి, స్నేహితులు డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement