మరో వివాదంలో ప్రత్యూష మాజీ బాయ్ఫ్రెండ్ | Pratyusha Banerjee's Former Boyfriend Rahul Raj Singh Booked For Molestation | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో ప్రత్యూష మాజీ బాయ్ఫ్రెండ్

Published Wed, Sep 14 2016 7:40 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

మరో వివాదంలో ప్రత్యూష మాజీ బాయ్ఫ్రెండ్ - Sakshi

మరో వివాదంలో ప్రత్యూష మాజీ బాయ్ఫ్రెండ్

ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆమె మాజీ బాయ్ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. 21 ఏళ్ల మోడల్ను లైంగికంగా వేధించినట్టు రాహుల్పై అంబోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

మంగళవారం అర్ధరాత్రి అంధేరిలోని ఓ పబ్ బయట రాహుల్.. మోడల్ పట్ల అనుచితంగా ప్రవర్తించి, ఆమె బాయ్ఫ్రెండ్తో గొడవపడ్డాడు. రాహుల్ తన గాళ్ఫ్రెండ్తో కలసి పార్టీకి వెళ్లగా, మోడల్ తన ఫ్రెండ్ అయిన నిర్మాతతో కలిసి వచ్చింది. ఇరు వర్గాల మధ్య పాత శత్రుత్వం ఉందని, గొడవకు ఇదే కారణమని పోలీసులు చెప్పారు. కాగా తనపై ఫిర్యాదు చేసినవారిపై రాహుల్ కూడా ఫిర్యాదు చేశాడు. రాహుల్, అతని గాళ్ ఫ్రెండ్.. మోడల్, ఆమె బాయ్ఫ్రెండ్ దూషించుకోవడంతో పాటు కొట్టుకున్నారు.

ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు, సన్నిహితులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతికి రాహులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాహుల్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం అతను బెయిల్పై విడుదలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement