Shankar Banerjee
-
'డబ్బుల కోసం రాహుల్ వేధించాడు'
న్యూఢిల్లీ: హిందీ సీరియల్స్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుని నెల రోజులు గడచినప్పటికీ వివాదాలు సద్దుమణగలేదు. ఈ కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ను పోలీసులు ప్రశ్నించి, అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రత్యూష తల్లిదండ్రులు సోమా, శంకర్ బెనర్జీ, న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. తమకున్న ఒక్కగానొక్క కూతురిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతికి రాహుల్ సింగే కారణమని, అతడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రాధేయపడ్డారు. అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బుల కోసం తమను రాహుల్ వేధించాడని లేఖలో పేర్కొన్నారు. గత ఆగస్టులో ప్రత్యూష పుట్టినరోజు సందర్భంగా రూ. 2 లక్షలు డిమాండ్ చేశాడని వెల్లడించారు. -
'ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్‌ను ఉరితీయాలి'
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్ను ఉరితీయాలని ఆమె తండ్రి శంకర్ బెనర్జీ డిమాండ్ చేశాడు. 'రాహుల్ నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. ఆమెకు న్యాయం జరగాలి. రాహుల్‌కు ఉరి వేయాలి లేదా జీవితాంతం జైల్లో పెట్టాలి' అని శంకర్ చెప్పాడు. ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్‌లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రత్యూష మృతిపై కుటుంబ సభ్యులు, సన్నిహితులు సందేహాలు వ్యక్తం చేశారు. ముంబై పోలీసులు రాహుల్‌పై కేసు నమోదు చేసి విచారించారు. మంగళవారం ముంబైలోని గుర్ద్వారాలో ప్రత్యూషకు సంతాపసభ ఏర్పాటు చేశారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ప్రత్యూష తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. 'ప్రత్యూష మరణించాక మేం మీడియా ముందుకు రాలేదు. చేయాల్సిన కార్యక్రమాలు పూర్తయ్యేంతవరకు మాట్లాడకూడదని భావించాం. మేం మా కూతుర్ని కోల్పోయాం. ఆమె ఎదుర్కొన్న సమస్యల గురించి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాం' అని ప్రత్యూష తండ్రి చెప్పాడు. రాహుల్‌ను కఠినంగా శిక్షించాలని ప్రత్యూష తల్లి, స్నేహితులు డిమాండ్ చేశారు.