pre planned
-
పథకం ప్రకారమే డ్రాగన్ దాడి!
బీజింగ్: చైనా పక్కా పథకం ప్రకారమే గల్వాన్ సరిహద్దుల్లో భారత్‌పై కయ్యానికి కాలు దువ్వినట్టుగా తెలుస్తోంది. జూన్ 15 రాత్రి ఘర్షణలకి ముందే కరాటే, కుంగ్‌ఫూ వంటి యుద్ధ కళల్లో ఆరితేరిన మార్షల్ యోధులు, ఎవరెస్టు వంటి పర్వత శ్రేణుల్ని అలవోకగా ఎక్కగలిగే నైపుణ్యం కలిగిన వీరుల్ని చైనా సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని ఆ దేశ జాతీయ మీడియానే స్వయంగా వెల్లడించింది. సరిహద్దుల్లో తనిఖీల పేరుతో చైనాకు చెందిన అయిదు మిలటరీ బృందాలు జూన్ 15న టిబెట్ రాజధాని లాసాకు చేరుకున్నాయి. ఈ బృందాల్లో మౌంట్ ఎవరెస్ట్ ఒలంపిక్ టార్చ్ రిలే బృందానికి చెందిన మాజీ సభ్యులు, మార్షల్ ఆర్ట్స్ క్లబ్‌కి చెందిన సభ్యులు ఉన్నట్టు చైనా అధికారిక మిలటరీ పత్రిక చైనా నేషనల్ డిఫెన్స్ న్యూస్ ఒక కథనాన్ని ప్రచురించింది. లాసాలో భారీగా కొత్త సైనిక దళాలు మోహరించి ఉన్న దృశ్యాలను చైనా టీవీ ప్రసారం చేసింది. సరిహద్దుల్ని బలోపేతం చేయడానికి, టిబెట్‌లో సుస్థిర పరిస్థితులు నెలకొల్పడానికి మార్షల్ యోధులు, పర్వతారోహకుల్ని మోహరించినట్టు చైనా పత్రిక రాసుకొచ్చింది. దాడికి పాల్పడింది వారేనా? గల్వాన్ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఈ మార్షల్ యోధులే భారత సైనికులపై దాడి చేశారా లేదా అన్నది చైనా అధికారికంగా స్పష్టంగా చెప్పడం లేదు. అసలు వారి వైపు ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారో ఇంతవరకు వెల్లడించలేదు. వీరినే గల్వాన్ ప్రాంతానికి తరలించాలో లేదో ఇంకా తెలియాల్సి ఉందని టిబెట్ కమాండర్ వాంగ్ హీజియాంగ్ పేర్కొన్నారు. కానీ లాసా నుంచే వీరిని గల్వాన్ లోయకి పంపినట్టుగా అనుమానాలైతే ఉన్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లో అడపాదడపా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ గత 50 ఏళ్లలో ఈ స్థాయిలో హింసాత్మక ఘర్షణలు చెలరేగడం ఇదే మొట్టమొదటిసారి అన్న విషయం తెలిసిందే. చైనా నిర్మాణాలు 33 రోజుల్లో భారత్‌లోని లద్దాఖ్‌లో గల్వాన్ లోయ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా 33 రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేసినట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది. మే 22 నుంచి జూన్ 26 వరకు ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే చైనా ఏ స్థాయిలో నిర్మాణాలు చేస్తోందో అర్థమవుతుంది. చైనా ఆర్మీ మన దేశ భూభాగంలోకి 137 మీటర్ల మేర చొచ్చుకు వచ్చిన చిత్రాలను చూపిస్తూ జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. మేలో కనిపించని కొన్ని నిర్మాణాలు జూన్‌లో తీసిన చిత్రాల్లో స్పష్టంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గల్వాన్ నదీ తీర ప్రాంతంలో రాతితో నిర్మించిన గట్టు. ఈ నిర్మాణం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 50 మంది సైనికులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ రాతి గట్టు సమీపంలో నాలుగు శిబిరాలను కూడా నిర్మించారు. గులాబీ రంగులో నిర్మించిన టెంట్లు చాలా స్పష్టంగా చిత్రాల్లో కనిపిస్తున్నాయి. జూన్ 15 రాత్రి చైనా, భారత్ మధ్య ఘర్షణల సందర్భంగా బయటకు వచ్చిన ఛాయాచిత్రాలు, వీడియోల్లో రాతి గట్టుకి సంబంధించిన నిర్మాణాలు స్పష్టంగా కనిపించలేదు. కానీ జూన్ 22 నుంచి 26 మధ్య తీసిన ఛాయా చిత్రాల్లో రాతి నిర్మాణం, పింక్ టెంట్లు కనిపిస్తున్నాయి. చర్చలకు కట్టుబడి సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ఆ దేశం చెబుతున్నవన్నీ అబద్ధాలేననటానికి ఇవే సాక్ష్యం. -
స్క్రిప్ట్ ప్రకారమే జయరాంరెడ్డి ఆత్మహత్యాయత్నం
సాక్షి, రాయదుర్గం : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీడీపీకి మైండ్‌బ్లాక్ అయ్యింది. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ జనరంజక పాలనతో దూసుకుపోవడంతో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా తమ పార్టీని బతికించుకునేందుకు నాయకులు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇంటి స్థల సమస్యను సాకుగా చూపి వైఎస్సార్సీపీ నాయకులకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు టీడీపీ కార్యకర్త ద్వారా ఆత్మహత్యాయత్నం డ్రామాకు తెరలేపారు. గుమ్మఘట్ట మండలం బీటీపీ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త జయరామిరెడ్డి తనకు మంజూరు చేసిన ఇంటి పట్టాకు సంబంధించి అధికారులు స్థలం చూపలేదంటూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేసిన ఆత్మహత్యాయత్నం డ్రామా అని తేలింది. నీటితో నింపిన పురుగుమందు డబ్బాను వెంట తెచ్చుకుని గుటగుటా తాగేయగా.. భార్య పల్లవి సెల్ఫోన్లో వీడియో తీస్తూ డ్రామాను రక్తి కట్టించింది. రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం సమస్యకు కారణం వైఎస్సార్సీపీ నాయకులే అంటూ పేర్లు చెప్పడానికి ప్రాధాన్యత ఇచి్చంది. భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తుంటే కనీసం వెంట కూడా పోకుండా కార్యాలయం ముందే కూర్చోవడం, కంటిలో నీరు కూడా రాకపోవడం అక్కడున్న వారు చూసి ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని చర్చించుకోవడం కనిపించింది. టీడీపీ నాయకుడి అత్యుత్సాహం టీడీపీ మండల నాయకుడు రాఘవరెడ్డి కుట్ర రాజకీయాలకు తెరలేపినట్లు తెలిసింది. టీడీపీ హయాంలో జరిగిన తప్పిదాన్ని వైఎస్సార్సీపీపై నెట్టాలని కుయుక్తులు పన్నాడు. ఆ కుట్రల్లో భాగంగా సంఘటన జరగడానికి గంట ముందే తనకు కావాల్సిన మీడియా వారికి ఫోన్ చేసి ‘గుమ్మఘట్ట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లండి, జయరామిరెడ్డి అనే వ్యక్తి హత్యాయత్నం చేస్తున్నాడం’టూ సమాచారమందించాడు. అంతటితో ఆగ కుండా వైఎస్సార్సీపీ నాయకుల పేర్లు చెప్పాలం టే రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిలో బాధితులకు సూచించడం అక్కడున్నవారందరూ గుర్తించారు. అడ్డు తగులుతున్న మాజీ మంత్రి బీటీపీకి చెందిన జయరామిరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అనుచరుడు. టీడీపీ కార్యకర్తకు స్థలం ఇప్పించడంలో కూడా మంత్రి కాలవ శ్రీనివాసులు అడ్డు తగులుతున్నాడని 2018 ఏప్రిల్, మే నెలల్లో గ్రామాల పర్యటనలో భాగంగా ఆరోపణలు గుప్పించాడు. చివరకు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఒత్తిడి మేరకు 2018 జూన్‌లో జయరామిరెడ్డికి పట్టా ఇప్పించారు. అయితే ఆ పట్టాలో చెక్కుబందీ సరిగా పొందుపరచలేదు. స్థలం చూపాలంటూ జయరామిరెడ్డి పలుమార్లు ప్రయతి్నస్తే అప్పటి మంత్రి కాలవ, జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు అడ్డుపడ్డారు. అప్పటి నుంచి జయరామిరెడ్డి సమస్య సమస్యగానే మిగిలిపోయింది. -
మంద్సౌర్ కేసు: దిగ్భ్రాంతికర అంశాలు
భోపాల్ : సంచలనం సృష్టించిన మంద్సౌర్ గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసులు దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడించారు. ఈ దారుణం ముందుగానే అనుకుని.. ప్లాన్ ప్రకారం జరగలేదని, అప్పటికప్పుడు దుష్టుల బుర్రలో పుట్టిన ఆలోచన అని పోలీసులు అధికారులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఆసిఫ్(24), ఇర్ఫాన్(20) పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. జరిగిన దారుణం గురించి ఇచ్చిన నిందితుడు ఇర్ఫాన్ నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. ‘ఈ సంఘటన జరిగిన రోజున బాలిక పాఠశాల ఆవరణలో ఒంటరిగా నిల్చుని ఉంది. ఆ సమయంలో ఇర్ఫాన్ అక్కడి నుంచే వెళ్లాడు. అక్కడ ఒంటరిగా ఉన్న బాలికను చూశాడు. మరో పది నిమిషాల తర్వాత ఇర్ఫాన్ అక్కడికి వచ్చేటప్పటికి కూడా ఆ బాలిక ఇంకా అక్కడే ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. దాంతో ఇర్ఫాన్ ఆ బాలిక దగ్గరకు వెళ్లి మిఠాయిలు కొనిపిస్తానని నమ్మబలికి చిన్నారిని తనతో తీసుకెళ్లాడు. బాలికను తీసుకెళ్తున్న సమయంలో ఎవరైనా ఈ విషయం గురించి అడిగితే స్కూల్ అయిపోయినా బాలికను తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదని.. అందుకే తాను బాలికను ఇంటికి తీసుకెళ్తున్నాను చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం బాలికను పాఠశాల వెనక ఉన్న పాడుబడిన లక్ష్మీదర్వాజ అనే బిల్డింగ్‌కు తీసుకెళ్లాడు. తర్వాత తన స్నేహితుడు ఆసిఫ్‌కు ఫోన్ చేశాడు. అనంతరం వారు దారుణంగా ఆ చిన్నారిని అత్యాచారం చేసి గొంతు కోశార’ని పోలీసులు తెలిపారు. అయితే ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని తెలపగా, నిందితులు మాత్రం తాము ఇద్దరమే అని చెప్పారు. -
చర్చకు బదులు రచ్చ చేశారు : అవినాష్ రెడ్డి
సాక్షి, పులివెందుల : తెలుగుదేశం నేతలు చర్చకు బదులు రచ్చ చేశారని వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. చర్చ జరగాలన్న ఉద్దేశం సతీష్ రెడ్డికి లేదని అందుకే చర్చ పేరుతో రచ్చ చేశారని అన్నారు. టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పపడినా తాను, తమ పార్టీ కార్యకర్తలు చట్టాన్ని గౌరవించి సంయమనం పాటించామని తెలిపారు. అంతేకాకుండా పోలీసుల వైఖరిని అవినాష్ రెడ్డి తప్పుపట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు వందలాది మంది పోలీసులను మొహరించారని, కానీ తెలుగుదేశం కార్యాలయం వద్ద ఎందుకు పోలీసులను పెట్టలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలు ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడ్డారని, అధికారం అండతో రాళ్లతో జరిపిన దాడుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు, ఓ ఎస్ఐకి కుడా గాయాలయ్యాయని తెలిపారు. తమ అధినేత, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ ఓర్వలేక పోతున్నారని అందుకే పులివెందులలో రచ్చ చేయాలని టీడీపీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. రాళ్లతో, కర్రలతో దాడులకు దిగిన తెలుగుదేశం నేతలు వైఎస్ఆర్సీపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాము తెలుగుదేశం నేతల్లా కాదని, చట్టాలపై గౌరవం ఉందని, పార్టీ నేతల కార్యకర్తలు చట్టాన్ని గౌరవిస్తారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ తమ దగ్గరకు వచ్చి శాంతియుత వాతావరణ నెలకొల్పేందుకు సహకరించమని కోరితే వెంటనే అంగీకరించామని తెలిపారు. పులివెందుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పులివెందులకు వైఎస్సార్ ఏం చేశారో చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. కుంటి సాకులు చెప్పకుండా టీడీపీ నాయకులు ఏం చేశారో చర్చకు రావాలన్నారు. ఫలప్రదమైన చర్చ జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. -
పక్కా స్కెచ్!
– ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ల మాయంపై విచారణ – బ్యాంక్ అధికారులు, చిట్ నిర్వాహకుడి కుమ్మక్కు! – ఫోర్జరీ సంతకంతో నగదుగా మార్చుకున్న వైనం – చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై శాఖాపర చర్యలు? – ఘటనపై వివరాలు సేకరించిన రిజిస్ట్రేషన్స్ డీఐజీ అనంతపురం టౌన్ : జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.20 లక్షలు విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ల చోరీ వెనుక పక్కా స్కెచ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. చిట్ నిర్వాహకుడు, బ్యాంక్ అధికారులు కుమ్మక్కు కావడంతో పని సులువైందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్‌శాఖ డీఐజీ అబ్రహాం పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ ఘటనపై నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనా.. అధికారుల నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సూపరింటెండెంట్ నాగభూషణంతో కలిసి ఆయన రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. బాండ్లు ఎలా మాయమయ్యాయో అడిగి తెలుసుకున్నారు. అసలేం జరిగిందంటే.. అనంతపురంలోని సాయినగర్‌లో ఉన్న శివకామేశ్వరి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను బండి నాగరాజు నిర్వహిస్తున్నాడు. నిబంధనల ప్రకారం కొత్తగా చిట్ ప్రారంభిస్తే దాని విలువ మొత్తాన్ని ఏదైనా బ్యాంక్‌లో డిపాజిట్ చేసి సంబంధిత బాండ్లను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉంచాలి. ఈ విధంగా బండి నాగరాజు 2012లో రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, 2014లో రూ.5 లక్షల విలువైన బాండ్లను అశోక్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి తీసుకుని అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉంచాడు. దీని కార్యకలాపాలను చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సి.కుమారస్వామిరెడ్డి చూస్తున్నారు. ఈ నెల 9న సాయంత్రం మూడు బాండ్లు బీరువాలో లేని విషయాన్ని ఆయన గుర్తించారు. వెంటనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులను సంప్రదించగా బండి నాగరాజు వాటిని నగదుగా మార్చుకున్నట్లు తెలిపారు. దీంతో అతడే ఫోర్జరీ సంతకం చేసి బాండ్లను అపహరించినట్లు నిర్ధారించుకున్నారు. ఆ వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి ఆ తర్వాత నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కుమారస్వామిరెడ్డి జిల్లా రిజిస్ట్రార్ ఆంజనేయులునాయక్‌కు రిపోర్ట్ ఇచ్చారు. ఆయన రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ అబ్రహాంకు నివేదికను పంపగా శుక్రవారం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విచారణ జరిగింది. బ్యాంక్ అధికారులే కీలకం బాండ్లు నగదుగా మార్చే విషయంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బాండ్ల గడువు ముగియకముందు వాటిని నగదుగా మార్చుకునేందుకు వీలుండదు. ఒక వేళ అలా మార్చాల్సి వస్తే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సంప్రదించారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. పైగా ఫోర్జరీ సంతకంతో తీసుకెళ్లిన బాండ్లను ఎలాంటి ఆలోచన చేయకుండా నగదుగా మార్చిచ్చేశారు. ఈ విషయాన్ని చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కుమారస్వామిరెడ్డి ఉన్నతాధికారులకు పంపిన నివేదికతో పాటు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బండి నాగరాజు సదరు బ్యాంక్‌లో రుణం తీసుకుని ఈఎంఐ కట్టలేదని తెలుస్తోంది. అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో పక్కా ప్లాన్‌తోనే బాండ్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఇందులో బ్యాంక్‌కు సంబంధించిన ఓ కీలక ఉద్యోగి పాత్ర ఉన్నట్లు రిజిస్ట్రేషన్‌శాఖ వర్గాలు భావిస్తున్నాయి. పోలీసులు ఆ దిశగా విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. కాగా పోలీసులకు ఫిర్యాదు వచ్చిన తర్వాత వారు బండి నాగరాజు ఇంట్లో సోదాలు చేయగా ఈ బాండ్లకు సంబంధించి కలర్ జిరాక్స్ ప్రతులు బయటపడ్డాయి. ఒరిజినల్ బాండ్లను తస్కరించిన నాగరాజు మరోసారి రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి కలర్ జిరాక్స్ బాండ్లను అదే బీరువాలో ఉంచాలని ప్రణాళిక రచించినట్లు స్పష్టమవుతోంది. చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై చర్యలు బాండ్లు చోరీకి గురైన ఘటనను డీఐజీ అబ్రహాం తీవ్రంగా పరిగణించారు. మొత్తం నివేదికను ఆ శాఖ ఐజీకి పంపనున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కుమారస్వామిరెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
పథకం ప్రకారమే జయశ్రీ హత్య
భర్తను కఠినంగా శిక్షించాలి పిల్లలకు న్యాయం చేయాలి మృతురాలి తల్లి, సోదరి డిమాండ్ అనంతపురం సెంట్రల్ : తన వివాహేతర సంబంధానికి తరచూ అడ్డు తగులుతున్నందునే ఉపాధ్యాయురాలు జయశ్రీని భర్త జనార్ధన్ పథకం ప్రకారం హత్య చేశాడని ఆమె తల్లి లక్ష్మిదేవి, అక్క, మాజీ కార్పొరేటర్ పావురాల కిష్ట భార్య పూర్ణమ్మ ఆరోపించారు. నగరంలోని నీరుగంటివీధిలో గల తమ నివాసంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనార్ధన్ పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని జయశ్రీకి నరకం చూపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దిచెప్పాలని చూసిన తమను కూడా ఇష్టానుసారం దూషించేవాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పటికైనా మారుతాడులే అని భావించామని, కానీ ఇంతటి దారుణానికి ఒడిగడుతాడని ఊహించలేకపోయామని అన్నారు. జయశ్రీకి భర్త అంటే ఎంతో ప్రాణమన్నారు. భర్త వేధింపులకు ఫిర్యాదు చేద్దామంటే వద్దనేదని గుర్తు చేసుకున్నారు. ముందే పోలీసులను ఆశ్రయించి ఉన్నా ఆమె ప్రాణాలతో దక్కేదని వాపోయారు. అన్యాయంగా జయశ్రీని పొట్టన పెట్టుకున్న జనార్ధన్‌కు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. తల్లిని కోల్పోయిన ప్రగతిశ్రీ, వివేక్ శబరీష్‌లకు న్యాయం చేయాలని ఎస్పీ రాజశేఖర్‌బాబుకు విజ్ఞప్తి చేశారు. ఆస్తిపాస్తులు, ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ పిల్లలకు వర్తింపజేయాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ముందుకు వచ్చి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే ఎస్పీని కలుస్తామన్నారు. -
ఆ టూర్ ముందు అనుకున్నదే