pregnency lady
-
కడుపులో బిడ్డకూ కూలి
పాలకులు వస్తుంటారు.. పోతుంటారు. వారి పాలనాకాలంలో ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన మంచి కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. అవుకును పాలించిన తిమ్మరాజు.. కూలి పనులకు వచ్చే గర్భిణులకు ఒకటిన్నర కూలి ఇవ్వాలని శాసనం చేశారు. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. సాక్షి, కొలిమిగుండ్ల: అవుకు రాజ్యంలో నంద్యాల, తాడిపత్రి, గండికోట, గుత్తి వరకు సరిహద్దులు ఉండేవి. ఈ రాజ్యంలో 15వ శతాబ్దకాలంలో కరువు కాటకాలు ఏర్పడి పంటలు పండక, పశువులకు సైతం మేత దొరక్క కొండల నుంచి ఆకులు కోసుకొచ్చేవాళ్లు. అరకొర పంటలతో జనం జీవనం సాగించేవాళ్లు. తన రాజ్యం పరిధిలోని ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలనే కోరుకున్నాడు నంద్యాల తిమ్మరాజు. అవుకు సమీపంలో క్రీ.శ 1538లో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో చెరువును తవి్వంచాడు. వందలాది మంది కూలీలతో ఆరోజుల్లోనే ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని మించేలా సీసంతో పోతపోసి పునాదులు బలంగా ఉండేలా నిర్మించారు. ప్రస్తుతం ఈ చెరువు రిజర్వాయర్‌గా అభివృద్ధి చెంది వేలాది ఎకరాలకు సాగు నీరు అందుతోంది. తిమ్మరాజు ధర్మ శాసనం రైతు సంక్షేమం కోసం నిర్మించిన చెరువు ద్వారా పారే నీటితో పంటలు పండించే రైతులు వరి కోతల కాలంలో పనులకు వచ్చే గర్భిణులకు ఒకటిన్నర కూలి ఇవ్వాలని నియమం పెట్టారు. ఈ నియమం పాటించే వారి పాదాలు ఎల్లప్పుడూ తన శిరస్సుపై ఉంటాయని తిమ్మరాజు ధర్మశాసనం చేశాడు. ఇప్పటికీ అవుకు ప్రజలు రాజు శాసనాన్ని తూ.చ. తప్పక పాటిస్తున్నారు. గర్భిణులు వరి కోతల పనులు చేయడమంటే అంత సులువుగా కాదు..ఆమెతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ సైతం పరోక్షంగా పనిలో పాల్గొన్నట్లేనని రాజు భావించాడు. అప్పట్లో వరి కోతలకు మహిళలే అధికంగా వెళ్లేవాళ్లు. పని ముగిశాక నగదు రూపంలో కూలి కాకుండా ఒక్కొక్కరికి నాలుగు పల్లు వడ్లు ఇచ్చేవాళ్లు. నంద్యాల తిమ్మరాజు విగ్రహం గర్భిణులకు అయితే నాలుగు పల్లతో పాటు అదనంగా ఒకటిన్నర పడి వడ్లు అదనంగా ఇచ్చేవాళ్లు. రైతు తమ కోసం అదనంగా ఇచ్చాడనే ఉద్దేశంతో మళ్లీ మూడు పిడికెళ్ల వడ్లను తిరిగి ఇచ్చేవాళ్లు. తెల్లవారు జామున 3గంటలకు పనిలోకి వెళ్లి.. కోత కోసి.. పంట నూర్పిళ్లు చేసి.. వరి గడ్డిని కట్టలు కట్టి మోసుకొచ్చేవాళ్లు. చాలా మంది గర్భిణులు.. రెండు మూడు రోజులు కాన్పు అయ్యే సమయం వరకు కోత పనులకు వెళ్లేవాళ్లు. కొంత మంది పనులు చేసి ఇంటికి వచ్చిన కొద్ది సేపట్లోనే కాన్పు అయిన సంఘటనలు ఉన్నాయని గతంలో పనులకు వెళ్లిన వృద్ధులు చెప్పారు. పనులకు గుంపుగా వెళ్లిన మహిళలు.. గర్భిణులకు దగ్గరుండి అరకూలీ అదనంగా ఇప్పించేవారు. పొరుగు గ్రామాల నుంచి సైతం అవుకులో పని చేసేందుకు అప్పట్లో వచ్చేవాళ్లు. కొనసాగుతున్న ఆచారం ఎన్నో ఏళ్ల క్రితం తిమ్మరాజు చేసిన శాసనం ఇప్పటికీ అవుకులో కొనసాగుతోంది. కాలక్రమేణ మార్పులు చోటు చేసుకొని సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చాక వరికోతలకు దాదాపు పదేళ్ల నుంచి యంత్రాలు ఉపయోగించి కోత కొస్తున్నారు. తగ్గు ప్రాంతాల్లో యంత్రాలు దిగని వరిమళ్లలో కూలీల సాయంతోనే కోత కొస్తుంటారు. ప్రస్తుతం కూడా గర్భిణులు పనులకు వెళితే ఆనాటి ఆచారం ప్రకారం అర కూలి అదనంగా ఇస్తున్నారు. అర కూలి ఎక్కువగా ఇచ్చేవాళ్లు తిమ్మరాజు చెప్పిన ప్రకారం గర్భిణులు వరి కోతలకు వెళితే మామూలుగా ఇచ్చే నాలుగు పళ్ల ఒడ్లతో పాటు అదనంగా అర కూలి చొప్పున ఇచ్చేవాళ్లు. కడుపులో పెరిగే బిడ్డ కష్టపడుతుందనే ఉద్దేశంతో కూలి ఎక్కువ ఇచ్చేవాళ్లు. గర్భం దాలి్చనప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు నేను పనులకు వెళ్లాను. –లక్ష్మమ్మ సంప్రదాయం కొనసాగుతోంది రాజు కాలంలో ఆచారం ఇప్పటికీ ఊర్లో కొనసాగుతోంది. గర్భవతిగా ఉన్నా కూడా వరి కోతకు వెళ్లేదాన్ని. పగలు పనికి వెళ్లి రాత్రి ఇంటికొచ్చాక కాన్పు అయిన మహిళలు ఉన్నారు. ఇప్పుడు మిషన్లు రావడంతో కూలీల సంఖ్య తగ్గిపోయింది. – లక్ష్మీనరసమ్మ బరువు పని చేసే వాళ్లం గర్భవతులు ఉన్నా వరి మళ్లలో బరువైన పనులు చేసేవాళ్లం. గడ్డిమోపులను మోసుకెళ్లే వాళ్లం. కాన్పు అయ్యే వరకు కోత పనులకు పోయేదాన్ని. అదనంగా అరకూలి ఇచ్చేవాళ్లు. మెట్టుపల్లెతో పాటు చుట్టు పక్కల ఊర్ల నుంచి మహిళలు పనులకు వచ్చేవాళ్లు. –వెంకట లక్ష్మమ్మ తరతరాల నుంచి పాటిస్తున్నారు మా వంశంలోని పూరీ్వకుడు తిమ్మరాజు పరిపాలన కాలంలో అమలు చేసిన పద్ధతిని తరతరాల నుంచి రైతులు పాటిస్తూ వచ్చారు. గర్భంతో ఉన్న తల్లితో పాటు లోపల ఉన్న బిడ్డకు కూలి ఇవ్వాలన్న ఉద్దేశంతో అర కూలి ఏర్పాటు చేశారు. రైతులు సంతోషంగా ఇస్తూ వచ్చారు. ఈ పద్ధతి బహుశా ఎక్కడా ఉండక పోవచ్చు. –రామకృష్ణరాజు, తిమ్మరాజు వారసుడు -
నిండు గర్భిణి.. ఏడు కిలోమీటర్లు
వాంకిడి(ఆసిఫాబాద్): అసలే గర్భిణి.. ఆపై పురిటినొప్పులు.. ఆదుకోవాల్సిన 108 అందుబాటులో లేదు. దిక్కుతోచని స్థితిలో ఓ భర్త ప్రసవవేదనకు గురవుతున్న తన భార్యను బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటన ఆదివారం కుమురంభీం జిల్లా వాంకిడి మండలం సోనాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భీంబాయికి నొప్పులు వచ్చాయి. 108 వాహనం లేకపోవడంతో నిండు గర్భిణి అయిన ఆమెను భర్త భీంరావు బైక్‌పై కూర్చోబెట్టుకుని 7 కిలోమీటర్ల దూరంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. సమయానికి చేరుకోవడంతో వైద్యులు ప్రసవం చేశారు. భీంబాయి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. -
గర్భవతులకు నడక మంచి వ్యాయామం!
స్వాభావిక ప్రసవం (నాచురల్ డెలివరీ) కోసం అందరూ తాపత్రయపడతారు. మంచి శారీరక వ్యాయామం ఉన్నవారికి నాచురల్ డెలివరీ అయ్యే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు తేల్చాయి. వాకింగ్ వల తుంటి కండరాల్లో సాగే గుణం పెరుగుతుంది. ఈ అంశమే వారిలో సుఖంగా ప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది. అయితే గర్భవతులకు నడక చాలా మంచి వ్యాయామం అంటున్నారు నిపుణులు. గర్భం ధరించి ఉన్న మహిళలు వాకింగ్ చేయడం అంత మంచిది కాదనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. గర్భవతులకు వాకింగ్ కంటే మంచి వ్యాయామం మరొకటి లేనేలేదు. ఒక మహిళ తాను గర్భం దాల్చడానికి ముందు ఉన్న ఫిట్నెస్ను బట్టి తానెంతదూరం హాయిగా, శ్రమలేకుండా నడవగలన్న అంశాన్ని నిర్ణయించుకొని ఆ మేరకు నడవవచ్చు. ఇలా గర్భం దాల్చి ఉన్నప్పుడు నడక కొనసాగించడం అటు తల్లికీ, ఇటు కడుపులోని బిడ్డకూ ఇరువురికీమంచిది. అయితే గర్భవతులు నడక వ్యాయామాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు ఒకసారి తమ డాక్టర్‌ను సంప్రదించి, తన ఫిట్నెస్ ఎంత, ఎంతసేపు నడవాలి అనే అంశాలను తెలుసుకున్న తర్వాతే నడక కొనసాగించడం మంచిది. కాబోయే తల్లికీ, బిడ్డకూ నడక ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి. ♦ కాబోయే తల్లి నడక వ్యాయామాన్ని కొనసాగించడం వల్ల కడుపులోని బిడ్డ బరువు ఆరోగ్యకరమైన విధంగా పెరుగుతుంది. ప్రసవం సమయానికి ఎంత బరువు ఉండాలో అంతకు చేరుతుంది. అంతేకాదు... స్వాభావికమైన ప్రసవం (నేచురల్ డెలివరీ) అయ్యేందుకు నడక దోహదం చేస్తుంది. ♦ నడక వల్ల కాబోయే తల్లి బరువు అదుపులో ఉండటమే కాకుండా... ఆ సమయంలో సాధారణంగా మహిళల్లో కనిపించే జెస్టేషనల్ డయాబెటిస్‌ను నడక నివారిస్తుంది. ♦ గర్భవతుల్లో ఒత్తిడి అనేది చాలా సాధారణంగా కనిపించే అంశం. అన్ని వ్యాయామాల్లో లాగే నడక వల్ల కూడా ఒంట్లో ఆరోగ్యకరమైన ఎండార్ఫిన్లు, సంతోషాన్ని కలిగించే రసాయనాలు వెలువడి గర్భవతుల్లో ఒత్తిడిని తొలగించడంతో పాటు వారిని మరింత హాయిగా సంతోషంగా ఉండేలా చూస్తాయి. ♦ వాకింగ్ వల్ల వేవిళ్ల సయంలో కనిపించే వికారం తగ్గుతుంది. అలసట, కండరాలు పట్టేయడం (క్రాంప్స్) తగ్గుతాయి. మలబద్దకం రాదు. వేరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు నివారితమవుతాయి. గర్భవతుల్లో సహజంగా కనిపించే రాత్రివేళ నిద్రపట్టకపోవడం అనే లక్షణం నివారితమై, కంటినిండా నిద్రపడుతుంది. -
ఆటోలో మహిళ ప్రసవం
మలక్‌పేట: పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చి ఓ నిండు గర్భిణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆటోలోనే ప్రసవించిన సంఘటన మలక్‌పేట ఏరియా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తితే ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ జాఫర్ భార్య సబా ఫిర్ధోస్(28)కు పురిటి నొప్పులు రావడంతో జాఫర్ బుధవారం అర్ధరాత్రి ఆటోలో ఆమెను ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అయితే డ్యూటీలో ఉన్న వైద్యులు, సిబ్బం ది ఆమెకు తక్షణ వైద్యం అందించకుండా బయటే నిలబెట్టడంతో ఆమె ఆటోలోనే ప్రసవించింది. అయితే పుట్టిన వెంటనే శిశువు మృతి చెందింది. సరైన వైద్యం అందించనందునే శిశువు మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సిబ్బంది ఆమెను లోపలికి తీసుకెళ్లి వైద్యసేవలు అందించారు. దీనిపై సమాచారం అందడంతో చాదర్‌ఘాట్ పోలీసులు సంఘట పా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణం: : షేక్ జాఫర్, సబా ఫిర్ధోస్ భర్త నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని అర్థరాత్రి ఆసుపత్రికి తీసుకొచ్చినా వైద్యులు పట్టించుకోకపోవడంతో ఆమె ఆటోలోనే ప్రసవించింది. ఆసుపత్రి సిబ్బంది, నిర్లక్ష్యం కారణంగా శిశువు చనిపోయింది. కనీసం మందులు, ఇంజక్షన్ కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వైద్యుల నిర్లక్ష్యం లేదు: సూపరింటెండెంట్ డాక్టర్ బద్రినాథ్ సబా ఫిర్ధోస్ వైద్య పరీక్షల నిమిత్తం తరచూ ఆసుపత్రికి వస్తోంది. ఈనెల 16న కూడా చెకింగ్ కోసం ఆసుపత్రి రాగా బీపీ ఎక్కువగా ఉండటంతో పేట్లబురుజు ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది. 17న ఆమె ఆసుపత్రికి వచ్చింది. పేట్ల బురుజు ఆసుపత్రికి వెళ్లినా రద్దీ ఉన్నందున తిరిగి వచ్చినట్లు చెప్పింది. అయితే అదే రోజు అర్థరాత్రి నొప్పులు రావడంతో ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు, సిబ్బంది ఆమెకు చికిత్స అందించారు. నెలలు నిండక పోవడంతో శిశువు మృతి చెందాడు. ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం లేదు. మహిళకు ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నాం, ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆరోపణలు అవాస్తవం: ఆర్ఎంఓ మల్లికార్జునప్ప రాత్రి డ్యూటీలో ఉన్న డాక్టర్లు, సిబ్బంది పట్టించుకోలేదనడం పూర్తిగా అవాస్తవం. 16న ఓపీకి వచ్చినప్పుడు బేబీకి నెలలు నిండలేదని, బీపీ కూడా ఎక్కువగా ఉందని చెప్పాం. పేట్లబురుజు ఆసుపత్రిలో గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయని అక్కడికి వెళ్లాలని సూచించాం. -
108లో కవలలకు జన్మనిచ్చిన మహిళ
బి.కొత్తకోట: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని 108లో బి.కొత్తకోట ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆవాహనంలోనే కవలలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన బుధవారం లె ల్లవారుజామున జరిగింది. వివరాలు..పెద్దతిప్పసముద్రం మండలం కందుకూరుకు చెందిన చల్లా సుజాత(24)కు పీటీఎంకు చెందిన సురేష్‌బాబుతో వివాహమైంది. సుజాత నిండుగర్భిణి కావడంతో పుట్టినిల్లు కందుకూరుకు వెళ్లింది. బుధవారం తెల్లవారుజాము 3గంటల సమయంలో సుజాతకు నొప్పులు తీవ్రం కావడంతో స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో 108కు సమాచారం అందజేశారు. దీంతో ఆ వాహన ఈఎంటీ లోకేష్, పైలట్ ఎం.రాజులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి బి.కొత్తకోటకు తరలిస్తుండగా 4.20 గంటలకు మద్దయ్యగారిపల్లె సమీపంలోకి రాగానే సుజాత 108లోనే మగ కవలలకు జన్మనిచ్చింది. అనంతరం కవలలు, బాలింత సుజాతను బి.కొత్తకోట పీహెచ్సీలో చేర్పించారు. అక్కడ వైద్యులు పరీక్షించి కవలలు ఆరోగ్యంగా ఉన్నారని నిర్దారించారు.