
వాంకిడి(ఆసిఫాబాద్): అసలే గర్భిణి.. ఆపై పురిటినొప్పులు.. ఆదుకోవాల్సిన 108 అందుబాటులో లేదు. దిక్కుతోచని స్థితిలో ఓ భర్త ప్రసవవేదనకు గురవుతున్న తన భార్యను బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటన ఆదివారం కుమురంభీం జిల్లా వాంకిడి మండలం సోనాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భీంబాయికి నొప్పులు వచ్చాయి. 108 వాహనం లేకపోవడంతో నిండు గర్భిణి అయిన ఆమెను భర్త భీంరావు బైక్‌పై కూర్చోబెట్టుకుని 7 కిలోమీటర్ల దూరంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. సమయానికి చేరుకోవడంతో వైద్యులు ప్రసవం చేశారు. భీంబాయి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment