preists
-
అర్చకులకు గుడ్ న్యూస్
-
అర్చక పరంపరకు నీరాజనం
-
అర్చకులకు శఠగోపం
షేక్సి్పయర్ రాసిన హేమ్లెట్ నాటకంలో హేమ్లెట్ తన తల్లిని గురించి తలుచుకుంటూ బలహీనత రూపం స్త్రీ అని వ్యాఖ్యానిస్తారు. ఈమధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో గ్రామీణ అర్చకుల దారుణ పరిస్థితి ఆయన హృదయాన్ని కలిచివేసింది అన్న ట్వీట్ చూసిపై వ్యాఖ్యానం గుర్తుకొచ్చి ‘కపటత్వమా నీ పేరు బాబు గారు’ అనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న దేవాలయాల అర్చకుల పరిస్థితి అతి దారుణంగా ఉందనేది నిర్వివాదాంశమైన విషయం. ఏమి చేస్తే ఆ పరిస్థితులు బాగుపడతాయనే దానికి కూడా ఒక స్పష్టమైన ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందు గత ఐదు సంవత్సరాల నుంచి నలుగుతూనే ఉంది. దానిమీద ఎటువంటి చర్య తీసుకోకుండా ప్రాథమికంగా ఇచ్చిన జీవో 76ను ఆమోదిస్తూ తుది ప్రకటన చెయ్యకుండా ఈరోజు ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల అర్చకుల పరిస్థితి చూస్తే నా హృదయం కలత చెందుతోంది అని ముఖ్యమంత్రి ప్రకటిస్తే నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇక ప్రధాన సమస్యను అవతల పెట్టి కంటితుడుపు చర్యగా 5,000 పారితోషకాన్ని 8,000కు పెంచుతామని, 10,000 నుంచి 12,500 చేస్తామని ప్రకటించారు. ఈ కేటగిరీ కింద వచ్చే అర్చకుల సంఖ్య పదిహేను వందలకు మించి లేదు. 16 కోట్లు దీనికోసం టీటీడీ నుంచి వస్తుందని ప్రకటించారు. వాస్తవానికి 5 సంవత్సరాల క్రితం అర్చక సంక్షేమానికి టీటీడీ 100 కోట్లు ప్రకటించి మొదటి 2 సంవత్సరాలు 25 కోట్ల చొప్పున 50 కోట్లు ఇచ్చి గత రెండు సంవత్సరాల నుంచి మిగిలిన 50 కోట్లు ఇవ్వకుండా నిలుపుదల చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించిన 16 కోట్లు ఆ 50 కోట్ల లోనివే. అదనంగా ఇచ్చింది ఏమీలేదు. ఈ హామీ అమలు చేయాలన్న టీటీడీ మిగిలిన పెద్ద ఆలయాల నుంచి ఒక వంద కోట్ల తో మూల నిధి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దానిని గురించి కార్యాచరణ గానీ, ఆలోచన గానీ లేదు. కానీ అసలు సమస్య 5 వేల కన్నా తక్కువ పారితో షికాన్ని పొందుతూ గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులది. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయ వ్యవస్థ ఒక ప్రత్యేక రీతిలో రూపుదిద్దుకుంది. దేవాలయాల మనుగడకు నిర్వహణకు ఆనాటి పాలకులు భూములు ఇచ్చారు. వాటిని దేవాలయ ఈనాము అంటారు. అదేవిధంగా అర్చకత్వం, భజంత్రీలు మొదలైన కార్యక్రమాలు నిర్వ హించేవారి భుక్తి కోసం ప్రత్యేకంగా సర్వీసు ఈనాములు కేటాయించడం జరిగింది. ఈ విధంగా పాలకుల ప్రాపకంతోను స్థానిక సమాజం మద్దతు తోనే దేవాలయాలు స్వయంప్రతిపత్తి కలిగిన ఆధ్యాత్మిక సామాజిక కేంద్రాలుగా పరిణతి చెందాయి. ఈ విధానాన్ని 1987 దేవాదాయ చట్టం మార్పుల ద్వారా సవరించి ఈ చిన్న దేవాలయాలు అన్నింటిని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొని రావటం జరిగింది. అసలే ఆదాయం లేక అంతంతమాత్రంగా నడుస్తున్న దేవాలయాలు, ఈ దేవాదాయ శాఖ అధికారుల జీతభత్యాలు కూడా మోయాల్సి రావటంతో వాటి అస్తిత్వం పూర్తిగా దెబ్బతింది. ఈరోజు అర్చకుల ప్రధాన అభ్యర్థన, ఆదాయం లేని 25వేల దేవాలయాలను దేవాదాయ శాఖ పరిధి నుంచి తప్పించి స్థానిక సమాజం సహకారంతో అర్చకుడు నిర్వహించే విధంగా మార్చమని. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి అర్చకుడి కి నెలకు కనీస వేతనం 10,000 వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడానికి కూడా వారికి ఎటువంటి అభ్యంతరం లేదు.ఈ రెండిట్లో ఏదో ఒకటి అమలు చేయాల్సింది పోయి, 1,500 మందికి కొద్దిగా సహాయపడే చిన్న కార్యక్రమాన్ని ప్రకటించి ఏదో అర్చకుల అందరికీ ఈ ప్రభుత్వం మేలు చేసిందన్న స్థాయిలో రాజకీయ లబ్ది కోసం ప్రకటన ఇచ్చుకున్నారు. సమస్యపై అవగాహన, చిత్తశుద్ధి ఉంటే సమస్యకు పరిష్కారాలు లభిస్తాయి. దీనికి తెలంగాణ ప్రభుత్వ చర్యలే నిదర్శనం. ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి వారి సిఫార్సుల మేరకు అర్చకులకు 10,000 కనీస పారితోషికం ఇచ్చే విధంగా రూపొందించి, ఒక మూలనిధిని ఏర్పాటుచేసి ఆ నిధికి రాష్ట్ర బడ్జెట్ నుంచి గ్రాంట్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకత్వం ఈ విషయంపై అవగాహన లేకుండా సమస్యకు సరైన పరిష్కారాలు ఆలోచించకుండా ఐదు సంవత్సరాలు కాలం వెళ్లదీసి, ఇప్పుడు కూడా ప్రధాన సమస్యలు పక్కనపెట్టి అసలు సమస్యలకు పరిష్కారం కనుక్కోకుండా రాజకీయ లబ్ధికోసం ప్రచార ఆర్భాటానికి పరిమితం అవుతున్నది. వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
దేవుడి సేవపై రాజకీయ నిర్ణయం
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అర్చకుల గరిష్ట వయో పరిమితిని 65 ఏళ్లుగా నిర్ణయించి నలుగురు ప్రధాన అర్చకులను తొలగించడం వివాదంగా మారింది. ఉద్యోగుల మాదిరిగా కాకుండా హైందవ సంప్రదాయాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి వంశపారంపర్యంగా దేవుడి సేవ విధుల్లో పాల్గొంటున్న వారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వం ద్వారా నియమితులైన టీటీడీ పాలకమండలికి ఉందా అన్న చర్చ ప్రారంభమైంది. వంశపారంపర్యంగా అర్చకులు తమకు సంబంధించిన దేవాలయాల్లో ఎంతో పవిత్రతతో ఆగమ శాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలు నిర్వహిస్తుంటారని.. అలాంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం, అధికారులు మితిమీరిన జోక్యం చేసుకోవడం వంటివి రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ దేశానికే అరిష్టమని పండితులు, పీఠాధిపతులు పేర్కొంటున్నారు. ఆలయాల్లో ప్రభుత్వ జోక్యాన్ని ప్రశ్నిస్తే.. హిందూ సంప్రదాయాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం వెనుకాడడం లేదని అర్చక సంఘాలు విమర్శిస్తున్నాయి. అర్చకులకు పదవీ విరమణ వర్తిస్తుందా? తొలినాళ్లలో ఆలయాల్లో పనిచేసే అర్చకులకు నియమాకాలు గానీ, పదవీ విరమణలు అన్నవే లేవు. ఏ ఆలయంలోనైనా అక్కడి అర్చక కుటుంబాలు వంశపారంపర్యంగా దేవుడి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆలయానికి వచ్చే భక్తుల కానుకలతోనే జీవన భృతిని పొందేవారు. 1966లో చేసిన చట్టంలో ఈ మేరకే నిబంధనలు ఉన్నాయి. 1987లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అలయాల అర్చకుల విషయంలో అనేక మార్పులతో ఏపీ దేవాదాయ చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిపై అర్చక కుటుంబాలు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అర్చకుల ప్రత్యేకత దృష్ట్యా 1987 నాటి చట్టానికి సవరణలు చేసుకోవాలంటూ 1997లో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా సూచించింది. ఆ తీర్పును అనుసరించి రాష్ట్రంలోని హిందూ దేవాలయాల్లో రెండు రకాల నిబంధనల మేరకు అర్చకులు పనిచేస్తున్నారని అర్చక సంఘాలు పేర్కొంటున్నాయి. కొన్ని దేవాలయాల్లో అర్చకులు వంశపారంపర్యంగా పనిచేస్తున్నారు. నియామకం ద్వారా అర్చకత్వంలో ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాల మాదిరి బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏతోపాటు పదవీ విరమణ వంటివి ఉంటాయని.. వంశపారంపర్య అర్చకులకు డీఏ, ఇంటి అలవెన్స్‌లేవీ ఉండవని వారు తెలుపుతున్నారు. అయితే, ఆలయ ఆదాయం నుంచి వంశపారంపర్య అర్చకులకూ కొంత వేతనం చెల్లిస్తారు. వీరికి పదవీ విరమణ అంటూ ఉండదు. విధుల్లో ఉన్న వారు స్వచ్చందంగా వైదొలిగితే ఆ కుటుంబంలో మరొకరు ఆ విధుల్లో పాల్గొంటారు. 1966 చట్టం ద్వారా.. అప్పటికి అర్చక విధుల్లో ఉన్న వారి కుటుంబీకులందరినీ వంశపారంపర్యంగా కొనసాగించాలని 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చట్ట సవరణ చేశారు. ఈ తర్వాత ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలపగా.. ధర్మాసనం అంగీకారం తెలిపింది. దాని ప్రకారం తిరుమలలో వంశపారంపర్య అర్చకత్వం నిర్వహణకు ఆమోదం తెలుపుతూ 2010లో అప్పటి టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. తదనంతరం రాష్ట్ర హిందూ మత పెద్దలతో ఏర్పాటు అయిన ధార్మిక పరిషత్ దానికి ఆమోదం తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సుప్రీంకోర్టుకు తెలియజేయకుండా వంశపారంపర్య అర్చకుల విషయాల్లో విధానాలు మార్చుకునే వెసులుబాటు లేదని అర్చక సంఘాలు పేర్కొంటున్నాయి. వేల కోట్ల కోసమేనా ఈ నిర్ణయాలు? 2014 ఎన్నికల సమయంలో దేవదాయ శాఖ పరిధిలోగానీ, టీటీడీలో గానీ వంశపారంపర్యంగా అర్చకత్వ విధుల్లో కొనసాగుతున్న వారిలో ఒక్కరిని తమ ప్రభుత్వం వస్తే తొలగించే నిర్ణయం తీసుకోబోమని చంద్రబాబు హామీ ఇచ్చారని అర్చక సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు ఆలయాల్లో పనిచేసే వంశపారంపర్య అర్చకులకు రక్షణ కల్పించకపోగా, టీటీడీలో అంతకు ముందు ప్రభుత్వాలు అమలు చేసిన దానిని రద్దు చేయాలని నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆయా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
జూలై 15 నుంచి కృష్ణా హారతి
- నిర్వహణ బాధ్యతలు డీవీఆర్ ఫౌండేషన్‌కు - విరాళాలిచ్చిన వారి పేరుతో హారతి పూజలు సాక్షి, హైదరాబాద్: గంగా, గోదావరి హారతి తరహాలోనే ఈ ఏడాది జులై 15వ తేదీ నుంచి విజయవాడ కేంద్రంగా కృష్ణా హారతి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజూ సూర్యస్తమయ సమయంలో నది ఒడ్డు నుంచి వేద పండితులు హారతి ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హారతి కార్యక్రమ నిర్వహణకు జలవనరుల శాఖ ప్రత్యేకంగా రెండు పంట్లను ఏర్పాటు చేస్తోంది. విజయవాడ నగరానికి చెందిన డీవీఆర్ పౌండేషన్‌కు హారతి కార్యక్రమ నిర్వహణ బాద్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అయ్యే ఖర్చులో 75 శాతం డబ్బులను దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయ నిధులను ఖర్చు చేస్తారు. మిగిలిన 25 శాతం ఖర్చులను డీవీఆర్ ఫౌండేషన్ భరిస్తోంది. కాగా, దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ అధికారులు హారతి కార్యక్రమ నిర్వహణకు భక్తులను విరాళాల సేకరణకు దేవాదాయ శాఖ అనుమతి తెలిపింది. విరాళాల అందజేసే వారి పేరిట హారతి సమయంలో గోత్ర నామాలతో పూజా నిర్వహించడంతో పాటు దాతలకు హారతి వేదిక వద్దే వేదపండితులు ఆశ్వీరవచనం అందజేస్తారు. సాధారణ రోజుల్లో హారతి నిర్వహణకు వెయ్యి రూపాయలు, పండుగ రోజుల్లో రెండు వేల రూపాయలు, శాశ్వత నిత్య హారతి కార్యక్రమ నిర్వహణకు రూ. 25 వేల విరాళం అందజేయాల్సి ఉంటుంది. కార్తీక మాసంలో దాతల పేరిట హారతి నిర్వహణకు రూ. 25 వేలు విరాళం అందజేయాల్సి ఉంటుంది. -
పురాతన విగ్రహం కోసం తవ్వకాలు
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లిలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూరాతన విగ్రహం కోసం సోమవారం ఉదయం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఈ తాత్కాలిక ఆలయ భూగర్భంలో ఓ పురాతన విగ్రహం ఉండేదని గ్రామస్తుల నమ్మకం. దీంతో అక్కడ తవ్వకాలు జరిపి విగ్రహం బయటపడితే శాశ్వత ఆలయం నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం తాత్కాలిక ఆలయంలోని స్వామి విగ్రహాన్ని తీసి ఆలయం పక్కనే మరోచోట ప్రతిష్టాపన చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో తవ్వకాలు మొదలయ్యాయి. రాతి విగ్రహానికి సంబంధించిన ఓ భాగం బయటపడింది. తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.