Preliminary written test job
-
ఆ 8 ప్రశ్నల పూర్తి వివరాలు సమర్పించండి
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో 8 ప్రశ్నలకు సరైన జవాబులను నిర్ణయించలేదని, ఈ వ్యవహారాన్ని నిపుణుల కమిటీకి నివేదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపిస్తూ... ప్రిలిమ్స్‌లో 8 ప్రశ్నలకు సరైన జవాబులను ఇవ్వనందున దీనిని నిపుణుల కమిటీకి పంపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 13 నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయని, వాటికి పిటిషనర్లను అనుమతించేలా అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలను తమ ముందుంచాలని రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 7కి వాయిదా వేశారు. -
రాత పరీక్షపై పీఆర్బీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్పీఆర్బీ) నేతృత్వంలో జరుగుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. దరఖాస్తులకు గడువు ఈ నెల 26వ తేదీతో ముగియనుండటంతో పరీక్ష తేదీని ఖరారు చేయడం, రాత పరీక్ష కోసం ఏర్పాటు చేయాల్సిన పరీక్ష కేంద్రాలు, ఇన్విజిలేటర్ల ఎంపిక తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. జూలై రెండు లేదా మూడో వారంలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసు ఉద్యోగాలకు ఇప్పటికే దాదాపు 13 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో చాలామంది రెండు నుంచి మూడు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంతో పెద్ద సంఖ్యలో రాత పరీక్ష కేంద్రాల ఎంపిక కత్తిమీద సాములా మారినట్టు తెలుస్తోంది. ముందుగా సబ్ ఇన్స్పెక్టర్, సమాన ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. దీనితో అభ్యర్థుల సంఖ్యకు తగ్గట్టుగా కాలేజీలు, స్కూళ్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పరీక్ష ఆదివారం రోజు నిర్వహించాల్సి ఉంటుందని భావిస్తున్న అధికారులు ఈ మేరకు యాజమాన్యాలతో చర్చిస్తున్నారు. ఆయా జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, కలెక్టర్లతో సంపద్రించి ఎన్ని కాలేజీలు, స్కూళ్లు సెంటర్లుగా ఏర్పాటు చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఒకే తేదీల్లో రాకుండా.. ఒకవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మరోవైపు టీఎస్పీఆర్బీ నిర్వహించే పరీక్షల తేదీలు ఒకేరోజు రాకుండా చూడటంపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రైల్వేతో పాటు వివిధ పోటీ పరీక్షలు సైతం జూన్, జూలైలో ఉండటంతో ఈ పరీక్షలు రాసే అభ్యర్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జూలై రెండో వారం లేదా మూడో వారంలో ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్పీఆర్బీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత జూన్ ఆఖరులో లేదా జూలై మొదటి వారంలో నిర్వహించాలని భావించినా, ప్రభుత్వం ఈ ఉద్యోగాలకు మరో రెండేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఇవ్వడంతో.. దరఖాస్తు దాఖలుకు గడువును కూడా పొడిగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు వారాలు ఆలస్యంగా రాత పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్టు బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. -
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ
కొత్తగూడెం (ఖమ్మం) : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్షల్లో సింగరేణి సేవా సమితి ద్వారా శిక్షణ పొందిన 946 మంది యువతీయువకులు ఉత్తీర్ణత సాధించారు. ఇందు లో 731 మంది యువకులు, 215 మంది యువతులు ఉన్నా రు. కాగా, ఫిజికల్ టెస్ట్‌కు అర్హత సాధించిన వారికి సింగరేణి పరిధిలోని 11 ఏరియాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. ఏరియాల వారీగా రాత పరీక్షలో అర్హత సాధించిన వారి వివరాలిలా ఉన్నాయి. ఏరియా యువకులు యువతులు మొత్తం కార్పొరేట్ 48 2 50 కొత్తగూడెం 39 2 41 ఇల్లందు 40 12 52 మణుగూరు 37 6 43 రామగుండం-1 84 66 150 రామగుండం-2 118 23 141 రామగుండం-3 - 50 50 భూపాలపల్లి 77 - 77 శ్రీరాంపూర్ 174 37 211 మందమర్రి 54 - 54 బెల్లంపల్లి 60 17 77 మొత్తం 731 215 946