Prem Sagar
-
ప్రాణం తీసిన ఒక్క రూపాయి
ఖిలా వరంగల్: వరంగల్‌లో దారుణం జరిగింది. ‘ఆ్రఫ్టాల్ నువ్వు ఒక ఆటోడ్రైవర్వు. ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివా’..? అంటూ ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ చివరికి ఒకరి ప్రాణం తీసింది. శనివారం వరంగల్ క్రిస్టియన్ కాలనీ గాం«దీనగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ మిల్స్‌కాలనీ గరీబ్‌నగర్ గొర్రెకుంటకు చెందిన ఇసంపెల్లి ప్రేమ్‌సాగర్ (38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేమ్‌సాగర్ గాందీనగర్‌లోని ‘నబీ రూ.59కే చికెన్ బిర్యానీ’సెంటర్‌కు వెళ్లాడు. ఆదే సమయంలో గాందీనగర్‌కు చెందిన జన్ను అరవింద్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు స్నేహితులే. ఈ క్రమంలో ప్రేమ్‌సాగర్ బిర్యానీ తీసుకుని రూ.59కి బదులు రూ.60 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. పక్కనే ఉన్న అరవింద్ దీనిపై స్పందించి.. ‘ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివి అయ్యావా’అంటూ ప్రేమ్‌సాగర్‌ను హేళన చేస్తూ మాట్లాడాడు. దీంతో ప్రేమ్‌సాగర్ ఒక్కసారిగా ఆవేశానికిలోనై ‘నేను ఏమైనా అడుక్కు తింటున్నానా.. ఏం మాట్లాడుతున్నావు’అంటూ అరవింద్‌ను నిలదీశాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాటలో అరవింద్, బలంగా ప్రేమ్‌సాగర్‌ను నెట్టివేయగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమై చిన్నమెదడు చిట్లి ముక్కు, చెవుల్లోనుంచి రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రేమ్‌సాగర్ తమ్ముడు విద్యాసాగర్‌తోపాటు అరవింద్ కలసి ఆటోలో ప్రేమ్‌సాగర్‌ను ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1 గంట సమయంలో ప్రేమ్‌సాగర్ మృతిచెందాడు. వెంటనే అరవింద్ ఎంజీఎం నుంచి నేరుగా మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. మృతుడి సోదరుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు శనివారం అరవింద్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపారు. -
‘హస్తం’లో కొత్త కోణం.. ఏళ్లుగా వైరం.. సేవ్ కాంగ్రెస్‌తో ఒక్కటైన వైనం
సాక్షి,ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నిన్న, మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డిలదే పైచేయి. నాలుగు జిల్లాల్లో అయితే ఆ వర్గం లేని పక్షంలో ఈ వర్గం అన్నట్లుగా పార్టీ వ్యవహారాలు సాగుతూ వచ్చాయి. ముఖ్య నాయకులంతా వారి అనుచర వర్గంగానే కొనసాగారు. ఏళ్లుగా ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వైరం కొనసాగుతూ వచ్చింది. తాజాగా సేవ్ కాంగ్రెస్ నినాదంతో రాష్ట్రంలోని కొంత మంది ముఖ్యనేతలు తిరుగు బావుటా ఎగరవేసిన సంగతి విధితమే. ఇందులో భాగంగా మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు ఒక్కటవడాన్ని పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలా ఉంటే వారి తీరును ఖండిస్తూ కొంత మంది నాయకులు వ్యతిరేకంగా కదలడం పార్టీలో ఇప్పుడు సంచనలం కలిగిస్తోంది. తద్వారా ఈ రెండు వర్గాలకు ధీటుగా మరో వర్గం కీలకంగా తయారవుతుందన్న చర్చ సాగుతోంది. ఇటీవల ఆదిలాబాద్‌లో మీడియా సమావేశంలో ఏఐసీసీ సభ్యులు నరేశ్‌జాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు కొత్త కమిటీల తరువాత.. ఇటీవల పార్టీ అధిష్టానం కొత్త కమిటీలను నియమించింది. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సాజిద్‌ఖాన్‌ను పూర్తి స్థాయిలో నియమించింది. గతంలో ఆయన ఇన్‌చార్జీగా కొనసాగారు. మహేశ్వర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలిగా మరోసారి ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి కె.సురేఖనే నియమించారు. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి అనుచరుడు ముత్యంరెడ్డికి అవకాశం కల్పించారు. కుమురం భీం ఆసిపాబాద్‌లో పెండింగ్‌లో పెట్టారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి టీపీసీసీ ఎగ్జిక్యూటీవ్ కమిటీలో మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డికి చోటు కల్పించారు. ప్రస్తుతం ఆయన వయోభారంతో కీలకంగా వ్యవహరించకపోయినా తనకంటూ ప్రత్యేక అనుచరగణం ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గండ్రత్ సుజాతతో పాటు ఉట్నూర్‌కు చెందిన వెడ్మ బొజ్జుకు చోటు కల్పించారు. ఆయన నేరుగా రేవంత్‌రెడ్డి అనుచరుడిగా పేరుంది. తాజా రాజకీయాల నేపథ్యంలో సుజాత సైలెంట్‌గా ఉండగా, బొజ్జు పార్టీలో పట్టుసాధించేందుకు గట్టి యత్నాలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు ఎగ్జిక్యూటీవ్ కమిటీతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగానూ నియమించారు. పార్టీ పరిస్థితులపై ప్రస్తుతం ఆయన స్తబ్దుగానే ఉన్నారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో కొంత మంది నాయకులకు రాష్ట్ర కమిటీల్లో చోటు దక్కింది. వారు ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులుగా ఉన్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర కమిటీల పరంగా ముఖ్య నేతల అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూనే కొత్త నాయకులకు పార్టీ అవకాశం కల్పించింది. చదవండి: కేసీఆర్ డ్రగ్ టెస్ట్ సవాల్‌పై బండి సంజయ్ కౌంటర్ నేతల తీరుపై ధ్వజం.. కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థాయిలో కొంత మంది ముఖ్య నేతలు సేవ్ కాంగ్రెస్ నినాదం అందుకోగా అందులో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యనేతలు ఉండటం, వారి తీరును ఖండిస్తూ ఆదిలాబాద్‌లో కొంత మంది కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తద్వారా రానున్న రోజుల్లో ఈ రెండు వర్గాలే కాకుండా వారికి వ్యతిరేకంగా మరో వర్గం తయారైందనేది స్పష్టం అవుతోంది. ఇది ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే సేవ్ కాంగ్రెస్ నినాదం పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
30 వరకు అరెస్టు చేయవద్దు
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీల ఆందోళన కేసులో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌ను ఈనెల 30 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు గురువారం మధ్యంతర ఆదేశాలను పొడిగించింది. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని ఆదివాసీలు చేసిన ఉద్యమానికి సహకరించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో తనపై 25కు పైగా అక్రమ కేసులు నమోదు చేశారని, తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ గతంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు అధికారి సేకరించిన వివరాల్లో ప్రేమ్‌సాగర్ ఆర్థిక సాయం చేస్తామని చెప్పినట్లు లేదని, ఇలాంటి కేసుల్లో అరెస్టు చేసి విచారించాల్సిన అవసరమేలేదని ఆయన తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను 30 వరకు పొడిగించింది. -
‘సీఎం వెళ్లగానే ఏసీ, సోఫాలు తీసుకెళ్లారు’
-
‘సీఎం వెళ్లగానే ఏసీ, సోఫాలు తీసుకెళ్లారు’
న్యూఢిల్లీ: అమర జవాను ఇంటికి అవమానం జరిగింది. ముఖ్యమంత్రి వస్తున్నారని చేసిన ఏర్పాట్లన్ని ఆయన వెళ్లిపోయిన మరుక్షణమే తీసుకొని వెళ్లిపోయారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ సేనలు చేసిన అక్రమ దాడుల్లో బీఎస్ఎఫ్ జవాను ప్రేమ్ సాగర్ వీరమరణం పొందాడు. దీంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వచ్చారు. అయితే, ఆయన రావడానికంటే ముందే, ఆ ఇంట్లోకి ఏసీలు, సోఫాలు, కర్టన్లు, కార్పెట్లు, కుర్చీలు తీసుకొచ్చి ఇంటినిండా నింపారు. దీంతో ఆ వస్తువులన్నీ వారికి తీసుకొచ్చారని ఆ గ్రామస్తులతోపాటు ఇంటివారు కూడా అనుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి వెళ్లిపోగానే చిన్నవస్తువుతో సహా ప్రతి ఒక్కటి అధికారులు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర నిరాశలోకి కూరుకుపోవడమే కాకుండా అవమానభారంలోకి జారుకుంది. ‘ఏసీ, సోఫా సెట్లు, కార్పెట్, కుర్చీలు ముఖ్యమంత్రి వస్తున్నారని తీసుకొచ్చి ఇంటినిండా పెట్టారు. సీఎం వెళ్లిపోగానే మొత్తం తీసుకెళ్లారు’ అని జవాను సోదరుడు దయాశంకర్ అన్నారు. ఈ చర్య తమను తీవ్రంగా అవమానించినట్లుగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
సబ్బితం జలపాతం వద్ద రక్షణ
రూ.2లక్షల వ్యయంతో కంచె నిర్మాణం అటవీశాఖాధికారి ప్రేంసాగర్ రూ.2లక్షల వ్యయంతో కంచె నిర్మాణం అటవీశాఖాధికారి ప్రేంసాగర్ పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి మండలం సబ్బితం పంచాయతీ పరిధిలోని గౌరీగుండాల జలపాతం అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పెద్దపల్లి డివిజన్ అటవీశాఖాధికారి ప్రేంసాగర్ తెలిపారు. జలపాతం వద్దకు వచ్చే పర్యాటకుల్లో ఎక్కువమంది యువకులే ఉంటున్నారని, వారంత పైనుంచి నీళ్లు వచ్చే ప్రాంతానికి చేరుకుంటుండడంతో అదుపుతప్పి పడి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారన్నారు. ఇప్పటికే ముగ్గురు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని వివరించారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రమాదాలను నియంత్రించేందుకు స్టీల్ పైప్‌లు, పెన్సింగ్ వైర్లతో కంచెను నిర్మించే పనులు చేపడుతున్నట్లు వివరించారు. రూ.2కోట్లతో రోడ్డు నిర్మాణం పెద్దపల్లి–మంథని మార్గంలో ఉన్న సబ్బితం గ్రామంనుంచి జలపాతం ఉన్న గట్టుసింగారం వరకు గల మూడుకిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను ఇంజినీరింగ్ అధికారులు సిద్ధం చేశారు. ఇటీవల జలపాతం వద్దకు వచ్చిన మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి స్థానిక యువకులు, ప్రజాప్రతినిధులు రహదారి అభివృద్ధి పనులను చేపట్టాలని కోరారు. ఈ క్రమంలోనే అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రభుత్వానికి పంపించారని సమాచారం. -
NRI వైద్యుడు ప్రేమ్‌సాగర్ లక్ష డాలర్ల విరాళం