premature babies
-
Health Tips: గర్భవతులకు నోటి పరిశుభ్రత అత్యవసరం... ఎందుకంటే...
Importance Of Oral Health During Pregnancy: గర్భవతి తన నోటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడం ఎంతో అవసరం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. గర్భవతుల్లో సాధారణంగా ‘ప్రెగ్నెన్సీ జింజివైటిస్’ అనే చిగుర్ల వ్యాధి వస్తుంటుంది. ఇది గర్భధారణ జరిగిన రెండో నెలలో కనిపిస్తుంటుంది. ఒకవేళ ఆ మహిళకు ముందే చిగుర్ల సమస్య ఉంటే అది గర్భధారణ తర్వాత మరింత తీవ్రమవుతుంది. ఇలాంటి సమయాల్లో నోటి శుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే చిగుర్లలో వాపురావడం లేదా నోటిలో కణుతులు, నాన్ ఇన్ఫ్లమేటరీ, నాన్ క్యాన్సరస్ వంటి గడ్డలు పెరగవచ్చు. అంతేకాదు... గర్భధారణ సమయంలో నోటి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోకపోతే నిర్ణీత వ్యవధి కంటే చాలా ముందుగానే ప్రసవం కావడం (నెల తక్కువ బిడ్డలు పుట్టడం), చాలా తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం వంటి సమస్యలు రావచ్చు. నోటిశుభ్రత పరంగా దీనికి కారణాలూ ఉన్నాయి. నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా రక్త ప్రవాహంతో పాటు కలిసిపోయి గర్భసంచి (యుటెరస్)కి చేరి, ప్రోస్టాగ్లాండిన్ వంటి రసాయనాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అదే గర్భధారణ వ్యవధికి ముందే ప్రసవానికి (ప్రీ–మెచ్యుర్ లేబర్‌కు) దారితీసే అవకాశం ఉంది. అందుకే గర్భవతులు నోటి ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను (ఓరల్ హైజీన్‌ను) ఎంత బాగా పాటిస్తే... కాబోయే తల్లికే కాదు... పుట్టబోయే బిడ్డకూ మేలు చేస్తుంది. ఇదే విషయాన్ని ఇటీవలి కొన్ని పరిశోధన ఫలితాలూ వెల్లడిస్తున్నాయి. చదవండి: Tamarind Leaves: చింత చిగురుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. -
యమున కన్నీరు ఆగేనా? బోసి నవ్వులు విరిసేనా?
యమునా, మోహన్లది అన్యోన్య దాంపత్యం. ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోయినా ఆ జంట సంతోషంగానే జీవిస్తున్నారు. అయితే వారికి ఉన్న ఒకే ఒక్క లోటు సంతానం. గతంలో యమునా ఓసారి ప్రసవించినా.. ఈ బిడ్డకు నూరేళ్లు నిండకుండానే దేవుడు తీసుకెళ్లిపోయారు. చాన్నాళ్ల తర్వాత యమున మరోసారి నెల తప్పింది. మరి వాళ్లింట్లో బోసి నవ్వులు వినిపించాయా ? పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో యుమనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. భరించలేని నొప్పిని పంటి బిగువన భరిస్తూనే ఉంది యమున. కాసేపటికి నర్సుల వచ్చి ‘నీకు డబుల్ కంగ్రాట్స్’ అని చెప్పారు. కవలలు పుట్టారని, వాళ్లలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి అంటూ తీపి కబురు అందించారు. పిల్లలు లేరంటూ ఇన్నాళ్లు పడుతున్న వేదనంతా ఒక్కసారిగా దూదిపింజంలా ఎగిరిపోయినట్టు అనిపించింది యమనకి. గంటల గడుస్తున్న డాక్టర్లు పసి బిడ్డలను నాకు చూపించడం లేదు. ఏమైందంటూ నర్సులను అడిగితే ‘ నెలలలు నిండకుండానే ప్రసవం జరగం వల్ల ఇద్దరి ఆరోగ్యం బాగా లేదని, ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం’ అని చెప్పారు. కానీ నెల రోజుల తర్వాత యమున గుండె బద్దలయ్యే వార్త డాక్టర్లు చెప్పారు. ఆరోగ్యం మెరుగుపడక పోడంతో మగ శిశువు మరణించాడని తెలిపారు. అంతేకాదు ఆడ శిశువు సైతం ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతోందంటూ చెప్పారు. నెల రోజుల వయస్సున్న చిన్నారి శరరీం నిండా వైద్య పరికరాలే అమర్చి ఉన్నాయి. ఊపిరి తీసుకునేందుకు బిడ్డ అవస్థలు పడుతోంది. 12 వారాల పాటు చికిత్స అందిస్తే బిడ్డ ప్రాణాలు నిలబడతాయని డాక్టర్లు చెప్పారు. దాని కోసం రూ. 6 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. కానీ అప్పటికే రెండు నెలలుగా ఆస్పత్రికి అయిన ఖర్చులతో మోహన్, యమునల వద్ద డబ్బులు పూర్తిగా అయిపోయాయి. దీంతో కన్నీరు కార్చడం తప్ప యమునకు మరో దారి లేని స్థితిలో ఉండిపోయింది. వైద్యానికి చేతిలో చిల్లగవ్వ లేని పరిస్థితుల్లో కొండంత వేదనలో యుమన, మోహన్‌లు ఉండగా వారికి మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. యమున మోహన్ల బిడ్డను కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వగలరు. సాయం చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేయండి -
కవలలు పుట్టారన్న ఆనందం.. కానీ అంతలోనే..
నా పేరు సఫీరా.. నా భర్త సేల్స్‌మ్యాన్‌గా పని చేసేవాడు. మాకు ఓ ముద్దుల కూతురు కూడా ఉంది. కానీ కరోనా సంక్షోభం కారణంగా నా భర్త ఉద్యోగం పోయింది. ఈ బాధలో ఉన్న మాకు నేను రెండో సారి గర్భవతిని అయ్యానంటూ ఓ తీపి కబురు అందింది. ఆ వార్త వినగానే కష్టాల వెంటనే సంతోషాలు ఉంటాయనే మాటను నమ్మాకు. కానీ అంతలోనే ఊహించనది జరిగింది ? అబార్షన్ తప్పదు ? ప్రెగ్నెంట్ కావడంతో ప్రతీ నెల చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లవాడు నా భర్త. కొంతకాలం తర్వాత నన్ను పరీక్షించిన డాక్టరు నాకో చేదు నిజం చెప్పారు. కడుపులో కవలలు ఉన్నారని, అయితే వారి పరిస్థితి బాగాలేదని అబార్షన్ చేయించుకోకుంటే తల్లి, బిడ్డలకు ప్రమాదమంటూ సూచించారు. పొత్తిళ్లలోనే పసికందులను చిదిమేయాలా లేక అల్లాపై దయ ఉంచి ముందుకు వెళ్లాలా అని మదనపడిపోయాను. చివరకు కష్టాల వెంటే సంతోషాలు ఉంటాయని నమ్ముతూ.. ఆ అల్లాపై భారంపై భారం వేసి అబార్షన్‌కి ఒప్పుకోలేదు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి గండం గడిచింది డాక్టర్లు భయపడినట్టు కాన్పు సందర్భంగా నాకేమీ కాలేదు. కవలలుగా మగ పిల్లలు జన్మించారు. వారిద్దరి బోసి నవ్వులు మాలో మరోసారి సంతోషం నింపాయి. తన తమ్ముళ్లతో ఆడుకునేందుకు వాళ్ల అక్క కూడా ఆస్పత్రికి వచ్చింది. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకునే తరుణంలో మరోసారి కష్టాలు వెంటాడాయి, సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ డాక్టర్లు సూచించిన దాని కంటే చాలా ముందుగా కవలలు ఇద్దరు నెలలు నిండకుండానే పుట్టారు. దీంతో సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు శ్వాస తీసుకునేందుకు ఇద్దరు పసి పాపాయిలు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది వారికి ఉన్న సమస్యని రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని చెప్పారు. ప్రస్తుతం వాళ్లని ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి బిడ్డల ఆరోగ్యం మెరుగవ్వాలంటే కనీసం రెండు నెలలు ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందివ్వాలని డాక్టర్లు చెప్పారు. అందుకు రూ.10 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి చిన్నారుల కోసం ఆ చిన్నారులు ఈ లోకాన్ని చూడాలంటే వైద్య చికిత్సలు చేయించాలి. ఇప్పటికే ఉద్యోగం పోగొట్టుకున్న నా భర్త అంత డబ్బు సర్థుబాటు చేయలేడు. అందుకే మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టోని సంప్రదించాం. ఊపిరి తీసుకునేందుకు పోరాడుతున్న ఆ చిన్నారులకు సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. -
నెలలు నిండకముందే పుట్టే బిడ్డలను ముందుగానే పసిగట్టవచ్చు!
సాధారణంగా బిడ్డలంతా తమ తల్లిగర్భంలో నవమాసాలూ ఉంటారన్నది తెలిసిందే. అంటే పూర్తిగా 36 వారాలన్నమాట. అయితే కొందరు చిన్నారులు పూర్తిగా నెలలు నిండకముందే పుడుతుండటం మనకు తెలిసిందే. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలను (ప్రీమెచ్యుర్ బేబీస్) అంటే ప్రసవానికి కనీసం పది వారాల ముందుగానే పసిగట్టవచ్చంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. ఇటీవలే ఇంగ్లాండ్‌లోని లండన్ ‘కింగ్స్ కాలేజీ’కి చెందిన శాస్త్రవేత్తలు తాము నిర్వహిస్తున్న అధ్యయనాల్లో భాగంగా కొందరు కాబోయే తల్లుల మెడ భాగంలో కొన్ని బ్యాక్టీరియాతోపాటు ప్రత్యేకంగా ఉన్న కొన్ని మాలెక్యూల్స్ కనుగొన్నారు. వీటి ఆధారంగా పూర్తిగా నెలలు నిండటానికి ముందే ఈలోకంలోకి వచ్చేందుకు తొందరపడే బిడ్డలను పసిగట్టేందుకు ఆస్కారముందంటున్నారు. దాంతో ముందుగానే ఏయే శిశువులు పుట్టబోతున్నారన్న విషయం తెలుస్తుంది కాబట్టి... బిడ్డను పూర్తికాలం తల్లిగర్భంలోనే ఉంచడానికి ఏమైనా ప్రత్యేక ప్రక్రియలు లేదా చికిత్సలను రూపొందించవచ్చా అనే దిశలో ఇప్పుడు ప్రయత్నాలు జరిపేందుకు ఆస్కారం ఉందంటున్నారా శాస్త్రవేత్తలు. ఒకవేళ అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినప్పటికీ... పుట్టబోయేదెవరో తెలిసిపోతుంది కాబట్టి... అలాంటి శిశువుల విషయంలో... ఆ మేరకు అవసరమైన ‘ఇంక్యుబేషన్’ వంటి పలు జాగ్రత్తలను తీసుకునేందుకు వీలుంటుందని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. -
పుట్టిన మూడు రోజులకే, ఒళ్లంతా గాయాలు..
కడుపులో బిడ్డం అడ్డం తిరగడంతో బాధ భరించలేకపోతోంది పుష్ప. ఆమెను వెంటనే ఆస్పతత్రికి తీసుకెళ్తున్నాడు ఆమె భర్త శరవణన్. ఆ దంపతులకు ఇంతకు ముందే ఓ బిడ్డ ఉన్నా పుట్టుకతోనే ఒకే కిడ్నీకి కలిగి ఉంది. దీంతో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండి దినదిన గండంగా ఆ బిడ్డ బతుకుతుంది. ఇప్పుడో రెండో బిడ్డ భూమి మీదకు రాకుండానే తల్లి కడుపులో ఆపసోపాలు పడుతోంది. మరోవైపు పుట్టబోయే బిడ్డకు ఏమీ కావొద్దని దేవుళ్లను మొక్కుకుంటున్నాడు శరవణన్. ఇంతలో ఆస్పత్రి వచ్చేసింది. పుష్సను పరిశీలించిన డాక్టర్లకు పరిస్థితి అర్థమైంది. ఏ మాత్రం ఆలస్యం చేసినా తల్లిబిడ్డల ప్రాణాలకు ప్రమాదమని గ్రహించారు. వెంటనే సీ సెక్షన్ చేసి పుష్పకు పురుడు పోశారు. పుష్ప, శరవణన్ దంపతులకు మలి కాన్పులో ఆడపిల్ల కలిగింది. అయితే వారికి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఆ పసిపాప శరీరం పెలుసుగా మారుతూ నీలి రంగులోకి మారడం మొదలైంది, కంగారు పడిన తల్లిదండడ్రులు డాక్టర్లను పిలిచారు. డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి నెలలు నిండకుండానే పుట్టినందు వల్ల పుష్ప కూతురికి అరుదైన పెరినాటల్ ఆస్ఫైక్సియా అనే వ్యాధి వచ్చినట్టు డాక్టర్లు తేల్చారు. దీంతో పాప శరీరం వెనువెంటనే పెలుసుగా మారిపోతుంది. ఒళ్లంతా గాయాలు అయినట్టుగా నొప్పి పెడుతోంది. ఆ బాధ భరించలేక చిన్నారి గుక్క పట్టి ఏడవని క్షణం లేదు. ఆ బిడ్డను కష్టాన్ని చూసి పుష్ప, శరవణన్‌లకు కన్నీరే మిగిలింది. డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి పాపాను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పాప ఆరోగ్యం బాగయ్యే వరకు చికిత్స అందివ్వాలంటే ఎనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న శరవణన్ ఆ డబ్బు సర్థుబాటు చేయలేనని తెలుసు. మరోవైపు కన్న కూతురి బాధను చూసి ఉండలేకపోతున్నారు శవరణన్, పుష్పలు. దీంతో పాప ఆరోగ్య ఖర్చుల కొరకు ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టోను సంప్రదించారు. పుష్ప, శరవణన్‌ల చిన్నారి పాప తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలంటే మీ వంతు సాయాన్ని కెట్టో ద్వారా అందివ్వగలరు. డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి -
తల్లిపాలే.. విషం! ఈ బిడ్డ బాధ వర్ణనాతీతం(స్పాన్సర్డ్)
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలే అమృతం... కానీ ఈ బిడ్డ విషయంలో తల్లిపాలు విషంలా మారుతున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డలకు సంక్రమించే అరుదైన వ్యాధి కారణంగా తల్లి పాలకు బిడ్డ దూరమవగా... బిడ్డకు పాలివ్వలేని దుస్థితిలో ఆ తల్లి చిక్కుకుంది. ప్రసవం జరిగినప్పటి నుంచి తన బిడ్డను కాపాడమంటూ తల్లి ఎలిజబెత్ నిత్యం దేవున్ని ప్రార్థిస్తూనే ఉంది. తమిళనాడులోని ఈరోడ్‌కి చెందిన ఎలిజబెత్ , శివకుమార్ దంపతులు ఈ ఏడాది మార్చిలో మూడో సంతానం కలిగింది. అయితే ఎలిజబెత్‌కి కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నెలలు నిండకుండానే బిడ్డను ప్రసవించింది ఎలిజబెత్. దీంతో పసిబిడ్డకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో పాటు మూత్ర పిండాల వైఫల్యం సమస్యలు తల్తెత్తాయి. ఎన్ఐసీయూ వార్డులో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. బాబుకి తల్లిపాలు పడటం లేదు. దీంతో ఐవీల ద్వారానే అవసరమైన మందులు అందిస్తున్నారు. బాబు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షలు రెడీ చేసుకోవాల్సందిగా వైద్యులు సూచించారు. కూలీ చేసుకునే శివకుమార్ నెల ఆదాయమే రూ. 5,500. అలాంటిది ఒక్కసారిగా పది లక్షల రూపాయలు సర్థుబాటు చేయాలంటూ వైద్యులు చెప్పేసరికి ఏం చేయాలో పాలుపోలేదు. మరోవైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొడుకు. దీంతో ఆన్లైన్లో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజ్ చేసే కెట్టోను సంప్రదించారు. ఎలిజబెత్, శివకుమార్‌ల బిడ్డను కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి. (అడ్వర్టోరియల్) -
పుట్టడానికెందుకురా తొందర!
సాక్షి, హైదరాబాద్ : నెలలు నిండని శిశువులు భారత్‌లోనే ఎక్కువగా పుడుతున్నారు. ప్రపంచంలో మన దేశంలోనే ఆ సంఖ్య ఎక్కువుండటం ఆందోళన కలిగిస్తోంది. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్ని వివిధ అనారోగ్య సమస్యల బారి నుంచి కాపాడుకోవడం సవాల్‌గా మారింది. గర్భిణుల్లో ఇన్ఫెక్షన్, ఇతరత్రా అనారోగ్య సమస్యల వల్ల శిశువులు నెలలు నిండకుండా పుడతారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మంది పిల్లలు ఇలా నెలలు నిండకుండా పుడుతున్నారు. అందులో 35 లక్షల మంది భారత్‌లోనే పుడుతున్నారు. ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు, భారత్‌లో ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు ఇలా పుడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో 60% మంది దక్షిణాసియా, ఆఫ్రికాలోనే నెలలు నిండకుండా పుడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. నేడు (నవంబర్ 17, మంగళవారం) వరల్డ్ ప్రిమెచ్యూరిటీ డే. నెలలు నిండని పిల్లలు పుట్టకుండా, పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నదే ‘ఈ రోజు’ ముఖ్యోద్దేశం. 37 వారాల కంటే ముందే పుట్టడం సాధారణంగా గర్భధారణ సమయం 40 వారాలు. సరిగ్గా నెలలు పూర్తయి పుడితే సహజంగా అనారోగ్య సమస్యలుండవు. 37 వారాల కంటే ముందు పుడితే వారిని నెలలు నిండని శిశువు అంటారు. అలాంటి వారిలో అనారోగ్య సమస్యలుంటాయి. గర్భిణీకి ఇన్ఫెక్షన్ రావడం, కవలలు ఉండటం వల్ల గర్భాశయం ఇరుకుగా మారడం, అలాగే ముఖద్వారం వదులుగా ఉండటం వంటి కారణాలతో నెలలు నిండకుండా శిశువులు పుడతారు. గర్భిణుల్లో ప్రత్యేక కారణాల వల్ల బీపీ పెరగడం, కాలేయంలో సమస్యలు ఏర్పడటం వల్ల కూడా నెలలు నిండకుండానే ప్రసవమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కవల పిల్లల్లో 60 – 70 శాతం మంది నెలలు నిండని వారేనని వైద్య నిపుణులు అంటున్నారు. నెలలు నిండకుండా పుట్టేవారు కిలో కంటే తక్కువ బరువుంటే అతి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటాయి. 20 ఏళ్ల క్రితం దేశంలో కిలో కంటే తక్కువ బరువున్న నెలలు నిండని పిల్లల్లో 40 శాతం మాత్రమే బతికేవారు. ప్రస్తుతం అత్యాధునిక వైద్య వసతుల వల్ల అది 60 నుంచి 70 శాతానికి పెరిగింది. ఎయిమ్స్ వంటిచోట 65 శాతం, అంతర్జాతీయ ప్రమాణాలున్న ఆసుపత్రుల్లో 80 శాతం మంది బతుకుతున్నారు. అలాగే స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)ను కేంద్ర ప్రభుత్వం ప్రతీ జిల్లాలో ఏర్పాటుచేసింది. దీంతో నెలలు నిండనివారిని కాపాడుకోవడం సాధ్యమవుతోంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ►శిశువు కిలో కంటే తక్కువ బరువున్నట్టు భావిస్తే.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ►పుట్టగానే డెలివరీ రూమ్‌లోనే వారికి అవసరమైన సంరక్షణ చేయాలి. నెలలు నిండని శిశువులు చలికి తట్టుకోలేరు. కాబట్టి వార్మర్ పెట్టాలి. ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ శరీరానికి చుట్టాలి. ►అవసరం మేరకు ఆక్సిజన్ వాడాలి. శ్వాసపరమైన ఇబ్బంది ఉంటే ప్రత్యేకంగా సరఫరా చేయాలి. దీంతో వెంటిలేటర్‌పైకి వెళ్లకుండా ఆపొచ్చు. ►నెలలు నిండని శిశువుల్ని ఇంక్యుబేటర్‌లో పెట్టడం ద్వారా కాపాడుకోవచ్చు. ►తల్లిపాలు దివ్యౌషధం. జీర్ణవ్యవస్థ, పరిణితి చెందడానికి ఇవి సాయపడతాయి. ►ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవాలి. అవసరమైతేనే శిశువులను తాకాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ►ఒక బిడ్డ నుంచి ఇతర బిడ్డలకు ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవాలి. అవసరమైతే యాంటీ బయోటిక్స్ వాడాలి. ►చిన్నపిల్లలను చూసే యూనిట్లలో ఇంటెన్సివ్ కేర్ అందించాలి. రణగొణ ధ్వనులు ఉండకూడదు. అనవసరంగా లైట్లు వేయకూడదు. ►క్లస్టర్ కేర్ ద్వారా బిడ్డను సంరక్షించాలి. కొన్ని రకాల మందులివ్వాలి. తల్లికి పోషకాహారం ఇవ్వాలి నెలలు నిండకుండా శిశువులు పుట్టడాన్ని ఆపే వీలుంది. అందుకోసం ముందునుంచీ తల్లికి సరైన పోషకాహారమివ్వాలి. రక్తహీనత లేకుండా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ రాగానే డాక్టర్‌ను సంప్రదించాలి. ప్రతి నెలా పరీక్షలు చేయించుకోవాలి. గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉంటే కుట్లు వేయాలి. గతంలో నెలలు నిండని శిశువులను కని ఉంటే, మరోసారి అలా జరగకుండా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు ఇస్తారు. గర్భాశయ నిర్మాణంలో సమస్యలుంటే ముందే చికిత్స చేయించుకోవాలి. గర్భంలో కవల పిల్లలున్నట్లు గుర్తిస్తే ప్రతి నెలా డాక్టర్‌ను సంప్రదించాలి. ఇలా చేయడం వల్ల నెలలు నిండకుండానే శిశువులు పుట్టకుండా చాలా మేరకు ఆపొచ్చు. – డాక్టర్ విజయానంద్, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు, రెయిన్బో ఆస్పత్రి, హైదరాబాద్ -
300 గ్రాముల బరువుతో పుట్టాడు!
అవును నిజమే.. మూడు వందల గ్రాముల బరువుతో ఓ పిల్లాడు భూమ్మీదకు వచ్చాడు. మాములుగా ఈ బరువుతో పుట్టడం అసాధారణం. ఇలాంటివి అరుదుగా జరుగుతాయని వైద్యులు పేర్కొన్నారు. పుట్టినప్పుడు 11 ఔన్సుల( దాదాపుగా 300గ్రాములు) బరువుతో పుట్టాడని.. మన గుండె కంటే తక్కువ బరువు అని, సాధారణ సోడా క్యాన్ అంత బరువు అని వైద్యులు పేర్కొన్నారు. ఇంత తక్కువ బరువుతో పుట్టి.. బతకడమంటే మాములు విషయం కాదు. ఆ పసిబిడ్డ పుట్టినప్పుడు వాడి నాన్న అరచేతిలో సరిగ్గా సరిపోయాడని పేర్కొన్నారు. అయితే ఆ పసికందును మళ్లీ మామూలు స్థితికి తెచ్చేందుకు తల్లిదండ్రులు, వైద్యులు పడ్డ కష్టం ఓసారి చూద్దాం. న్యూయార్క్‌లో ఉంటున్న జామీ, జానీ ఫ్లోరియోలకు ఓ బిడ్డ జన్మించబోతోన్నారని ఆనందంతో ఉన్నారు. అయితే వైద్యులు పరీక్షించే సమయంలో అసలు నిజం బయటకు వచ్చింది. లోపల పెరుగుతున్న బిడ్డకు సరైన పోషకాలు అందడం లేదని సరైన ఎదుగుదల కనిపించడం లేదనే నిజం తెలిసింది. దీంతో వైద్యులు ఆపరేషన్ చేయాల్సిందేనని.. తమకు సాధ్యం అయినంత వరకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయితే బిడ్డ పుట్టినా.. అప్పటి నుంచే అసలు పరీక్ష మొదలైందని వైద్యులు పేర్కొన్నారు. మాములుగా పుట్టాల్సిన బరువు కంటే 11రెట్లు తక్కువ బరువుతో ఉన్నాడని.. ఆసుపత్రిలోనే ఉంచి పర్యవేక్షించాలని చెప్పారు. అయితే తల్లి మనసు బిడ్డ కోసం ఆరాటపడుతుందని తెలిసిందే కదా.. ఆసుపత్రిలో ఉన్న ప్రతిరోజు తన బిడ్డను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించేది. క్రిస్మస్ రోజు, వాలెంటైన్స్ డేను ఇలా ప్రతీ పండుగను కొత్తగా సెలబ్రేట్ చేస్తూ.. అలాంటి ప్రత్యేకమైన రోజున స్పెషల్‌గా రెడీ చేసేది. మొత్తానికి తొమ్మిది నెలల వైద్యుల కష్టం, తల్లిదండ్రుల ప్రేమతో బిడ్డలో మార్పు కనిపించింది. ఇంకా తమ బిడ్డ సాధారణ పరిస్థితికి వచ్చేంత వరకు శ్రమించాల్సి ఉందని, వస్తాడనే నమ్మకం ఉందని ఫ్లోరియో తెలిపారు. -
కృత్రిమ గర్భసంచులొస్తున్నాయ్!
న్యూయార్క్: నెలలు తిరక్కుండానే పుట్టే పిల్లలు ఎక్కువ కాలం బతకరనేది మనకు తెల్సిందే. అలాంటి వారిని బతికించడం కోసం వైద్యులు వారిని ఇంక్యుబేటర్లలో పెట్టి కుస్తీ పట్టాల్సి వస్తుంది. అయినప్పటికీ కొన్నిసార్లు ఇంక్యుబేటర్లలో పెట్టిన పిల్లలు కూడా మత్యువాత పడతారు. ఇంక్యుబేటర్లలో నెలలు నిండని పసికందులను పెట్టి చికిత్స చేయడం కూడా ఖర్చుతో కూడిన వ్యవహారమే. ప్రపంచం మొత్తంగా పురిట్లోనే మరణిస్తున్న ఇలాంటి శిశువుల సంఖ్యలో ఒక్క భారత దేశంలోనే 35 శాతం మంది మరణిస్తున్నారు. వైద్య విజ్ఞానం ఇంతగా విస్తరించిన నేటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి పరిస్థితికి పరిష్కారం లేదా? పురిట్లోనే పుట్టిన బిడ్డ చనిపోతే భరించలేని ఆ బాధ నుంచి తల్లులను రక్షించేందుకు మార్గం లేదా? మరో మూడేళ్లలో ఈ పరిస్థితికి తప్పకుండా పరిష్కారం లభిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఇటీవల గొర్రె పిల్లలపై నిర్వహించిన ప్రయోగం విజయవంతం అవడమే అందుకు కారణం. తల్లి గర్భంలో, అంటే ఇక్కడ గొర్రె గర్భసంచిలో ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా వైద్యులు ఓ పారదర్శక బ్యాగ్‌లో సష్టించారు. ఆ బ్యాగ్‌ను బయోబ్యాగ్ అని పిలుస్తున్నారు. నిర్దిష్ట కాలానికన్నా 105 నుంచి 120 రోజుల ముందు జన్మించిన ఓ ఎనిమిది గొర్రె పిల్లలను ఈ బయోబ్యాగుల్లో పెట్టి వైద్య పరిశోధకులు అధ్యయనం చేశారు. మెల్ల మెల్లగా ఆ గొర్రె పిల్లలు కదలడం, కాళ్లు, చేతులు ఆడించడం, కళ్లు తెరవడం చేశాయి. నాలుగు వారాల అనంతరం వాటిని బ్యాగుల్లో నుంచి తీసి సాధారణ వెంటి లేటర్లలో ఉంచారు. ఆ ఎనిమిది గొర్రె పిల్లలు బతకడం విశేషం. ఈ అధ్యయనం వివరాలను ‘ది వెర్జ్’ అనే సైన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ తరహాలోనే స్త్రీల గర్భంలో ఉండే వాతావరణాన్ని కత్రిమంగా సష్టించే మానవ బయోబ్యాగ్ను అభివద్ధి చేయవచ్చని వైద్యులు అభిప్రాయానికి వచ్చారు. ఈ బ్యాగులు అందుబాటులోకి రావడానికి మరో మూడేళ్లు పట్టవచ్చని వారు అంచనా వేస్తున్నారు. అలా అని స్త్రీల అవసరం లేకుండానే పిల్లలను కనవచ్చు అనుకోవడం అది సైన్స్ ఫిక్షన్ సినిమా అవుతుంది తప్ప, నిజం కాదని ఫిలడెల్ఫియా పిల్లల ఆస్పత్రిలో గర్భస్త్ర పిండాలకు చికిత్సచేసే డాక్టర్ అలెన్ ఫ్లేక్ వ్యాఖ్యానించారు. -
కత్రిమ గర్భసంచులొస్తున్నాయ్!
-
ఇంక్యుబేటర్ బేబీ కష్టాలకు చెక్ చెప్పే 'యాప్'
తల్లి గర్భంలో ఉన్న పిల్లలు బయట నుంచి అమ్మ మాటలను, శబ్దాలను వింటూ హాయిగా బొజ్జుకుంటారట. ఆ మాటలు,శబ్దాలే గర్భంలో పెరిగే పిల్లలపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయట. భారతంలో అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలోనే పద్మవ్యూహం గురించి అవగాహన చేసుకున్నాడని వర్ణించారు కూడా. ఇలా పిల్లల మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఎదుగుదలకు తల్లి మాటలు ఎంతో సహాయపడతాయట. అయితే నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు ఆ మాటలు వినడానికి అవకాశముండదు. వారిని సంరక్షించడానికి ఎక్కువ కాలం ఇంక్యుబేటర్ లోనే ఉంచుతారు. అమ్మ మాటలు ఆలకించడానికి వారికి ఛాన్స్ కూడా ఉండదు. వీరి కోసమే కొత్తగా రూపొందింది వాయిస్ ఆఫ్ లైఫ్ యాప్. టెక్ దిగ్గజం సామ్ సంగ్ ఈ యాప్ ను ఆవిష్కరించింది. ఇంక్యుబేటర్ లో ఉన్న పిల్లలకు తల్లి మాటలను, హార్ట్ బీట్ ను వినిపించి, వారి బ్రెయిన్ ను డెవలప్ చేయడానికి ఈ యాప్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. తల్లి హార్ట్ బీట్ ను, మాటలను ఆ యాప్ లో రికార్డు చేసి, ఇంక్యుబేటర్ లో ఉన్న పిల్లలకు వినిపించేలా దీన్ని డెవలప్ చేశారు. ఒకవేళ రికార్డు అయిన శబ్దాలలో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే వాటిని ఈ యాప్ తొలగించి, ఇంక్యుబేటర్ లోపల ఉన్న పిల్లలకు వినిపించేలా సెట్ చేసింది సామ్ సంగ్ సంస్థ. దీనివల్ల నెలలు నిండక ముందు పుట్టిన బేబీలు కూడా తల్లి మాటల వినే అనుభూతిని పొందుతారని హర్వర్డ్ మెడికల్ స్కూల్ పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమిర్ లాహవ్ చెప్పారు. తల్లి గర్భానికి, ఇంక్యుబేటర్ వాతావరణం చాలా వేరుగా ఉంటుందని .. ఈ యాప్ ద్వారా పిల్లలు మెదడును ఆరోగ్యకరంగా రూపొందించవచ్చని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ అయి, తల్లి గర్బంలో నుంచి బయటికి వచ్చిన పిల్లలకు భయం, ఆందోళనలు ఎక్కువగా ఉంటాయని,ఈ యాప్ ద్వారా వాటిని అధిగమించవచ్చని పేర్కొన్నారు.గతేడాది నెలలు నిండక ముందు జన్మించిన పిల్లలు దాదాపు 150 లక్షల పైమాటేనని ఆయన చెప్పారు. ఈ యాప్ ను రూపొందించడంలో డాక్టర్ అమిర్ శ్యామ్ సంగ్ కు ఎంతో కృషిచేశారు.