నిలలు తిరక్కుండానే పుట్టే పిల్లలు ఎక్కువ కాలం బతకరనేది మనకు తెల్సిందే. అలాంటి వారిని బతికించడం కోసం వైద్యులు వారిని ఇంక్యుబేటర్లలో పెట్టి కుస్తీ పట్టాల్సి వస్తుంది. అయినప్పటికీ కొన్నిసార్లు ఇంక్యుబేటర్లలో పెట్టిన పిల్లలు కూడా మత్యువాత పడతారు. ఇంక్యుబేటర్లలో నెలలు నిండని పసికందులను పెట్టి చికిత్స చేయడం కూడా ఖర్చుతో కూడిన వ్యవహారమే. ప్రపంచ మొత్తంగా పురిట్లోనే మరణిస్తున్న ఇలాంటి శిశువుల సంఖ్యలో ఒక్క భారత దేశంలోనే 35 శాతం మంది మరణిస్తున్నారు.