Premier Futsal League
-
ఫుట్సాల్కు రంగం సిద్ధం
చెన్నై: భారత్‌లో జరుగనున్న కొత్త ఫుట్ బాల్ లీగ్ ప్రీమియర్ ఫుట్సాల్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నో లీగ్‌లకు వేదికైన భారత్‌లో మరో లీగ్ అభిమానుల్ని అలరించనుంది. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఈ లీగ్ లో పాల్గొనేందుకు పలువురు ఆటగాళ్లు భారత్ కు చేరుకుంటున్నారు. ఈ మేరకు బ్రెజిల్ సాకర్ ఆటగాడు రొనాల్డిన్హో భారత్ లో అడుగుపెట్టాడు. 'ఈ 5-ఎ సైడ్' అనే పేరుతో పిలవబడే ఈ లీగ్ జూలై 15వ తేదీ నుంచి 24 వ తేదీ వరకూ కొనసాగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం దాదాపు 21 దేశాలకు చెందిన 50 మంది ఆటగాళ్లు పాల్గొనున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ టోర్నీలోని మ్యాచ్‌లకు చెన్నై, గోవా నగరాలు ప్రధాన వేదిక కానున్నాయి. ఈ టోర్నీలో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. సాధారణంగా ఫుట్ బాల్ తుది జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటే, ఈ లీగ్ లో 12 మంది పాల్గొంటారు. ఇండోర్ స్టేడియాల్లో జరిగే ఒక్కో మ్యాచ్ కాల వ్యవధి 40 నిమిషాలు. ప్రీమియర్ ఫుట్సాల్కు పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ లూయిస్ ఫిగో నేతృత్వం వహిస్తుండగా, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిండర్ గా వ్యవహరిస్తున్నాడు. షెడ్యూల్ జూలై 15, 2016- చెన్నై వర్సెస్ ముంబై(గ్రూప్-ఎ), వేదిక-చెన్నై జూలై 15, 2016- గోవా వర్సెస్ కోల్ కతా(గ్రూప్-బి), వేదిక-చెన్నై జూలై16, 2016-ముంబై వర్సెస్ కొచ్చి(గ్రూప్-ఎ), వేదిక-చెన్నై జూలై16, 2016-బెంగళూరు వర్సెస్ గోవా(గ్రూప్-బి), వేదిక-చెన్నై జూల్ 17, 2016-కొచ్చి వర్సెస్ చెన్నై(గ్రూప్-ఎ), వేదిక-చెన్నై జూల్ 17, 2016-బెంగళూరు వర్సెస్ గోవా(గ్రూప్-బి), వేదిక- చెన్నై జూలై 18 విశ్రాంతి దినం జూలై19, 2016-కోల్ కతా వర్సెస్ గోవా(గ్రూప్-బి), వేదిక-గోవా జూలై19, 2016-ముంబై వర్సెస్ చెన్నై(గ్రూప్-ఎ), వేదిక-గోవా జూలై 20, 2016-బెంగళూరు వర్సెస్ కోల్ కతా(గ్రూప్-బి), వేదిక-గోవా జూలై 20, 2016-కొచ్చి వర్సెస్ ముంబై(గ్రూప్-ఎ),వేదిక-గోవా జూలై 21, 2016- గోవా వర్సెస్ బెంగళూరు(గ్రూప్-బి), వేదిక-గోవా జూలై 21, 2016- చెన్నై వర్సెస్ కొచ్చి(గ్రూప్-బి), వేదిక-గోవా జూలై 22 విశ్రాంతి దినం జూలై 23 , 2016-గ్రూప్ ఎ విన్నర్ వర్సెస్ గ్రూప్ బి రన్నరప్,వేదిక-గోవా జూలై 23 , 2016-గ్రూప్ బి విన్నర్ వర్సెస్ గ్రూప్ ఎ రన్నరప్, వేదిక-గోవా జూలై 24, 2016-ఫైనల్, టోర్నీ ముగింపు కార్యక్రమం -
విరాట్ అదిరేటి స్టెప్పులు!
న్యూఢిల్లీ: త్వరలో భారత్‌లో జరుగనున్న కొత్త ఫుట్ బాల్ లీగ్ ప్రీమియర్ ఫుట్సల్ కు అంబాసిడర్‌గా వ్యవరిస్తున్న టీమిండియా టెస్టు క్రికెటర్ విరాట్ కోహ్లి ఆట పాటలతో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఈ లీగ్‌కు సంబంధించి అధికారిక గీతాన్ని ఆలపించిన కోహ్లి.. ఇప్పుడు అదిరేటి స్టెప్పులతో ఆ పాటకు చిందులేశాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీతంలో రూపుదిద్దుకున్న ఆ పాటకు సంబంధించిన వీడియోను ఇటీవల విడుదల చేశారు. అందులో విరాట్ తన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఫుట్సల్ లీగ్ ప్రమోషన్లో భాగంగా రూపొందించిన ఆ వీడియోలో విరాట్ ఫుల్ జోష్‌లో స్టెప్పులేసి అలరించాడు. 'ఈ 5-ఎ సైడ్' అనే పేరుతో పిలవబడే ఈ లీగ్ జూలై 15 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకూ జరుగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 21 దేశాలకు చెందిన 50 మంది ఆటగాళ్లు పాల్గొనున్నారు. ఈ లీగ్‌కు సంబంధించిన అధికారిక గీతానికి విరాట్ తన గాత్ర దానం చేశాడు. దీంతో పాటు భారత్‌లో క్రీడాపరమైన లీగ్‌కు రెహ్మాన్ మ్యూజిక్ చేయడం కూడా ఇదే తొలిసారి. దీంతో తమ తమ రంగాల్లో ప్రత్యేకతను చాటుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన వీడియోకు విశేష ఆదరణ లభిస్తోంది. -
కోహ్లి... వేరే లీగ్‌లతో సంబంధమేల!
న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి... ప్రీమియర్ ఫుట్సాల్ (ఫైవ్-ఎ-సైడ్) లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడాన్ని ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తప్పుబట్టారు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)తో ప్రమేయం ఉన్న వ్యక్తి వేరే లీగ్‌లతో ఎలా సంబంధం పెట్టుకుంటాడని విమర్శించారు. కోహ్లిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఐఎస్ఎల్ మాదిరిగానే రూపుదిద్దుకుంటున్న ప్రీమియర్ ఫుట్సాల్కు పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ లూయిస్ ఫిగో నేతృత్వం వహిస్తున్నారు. -
సింగర్ కోహ్లి
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సింగర్ అవతారమెత్తాడు. ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన ప్రీమియర్ ఫుట్సల్ లీగ్ అధికారిక గీతాన్ని ఆలపించాడు. ‘నామ్ హై ఫుట్సల్’ పేరుతో రూపొందించిన ఈ ప్రచార గీతం వీడియో ఈనెల 20న విడుదల కానుంది. సోమవారం చెన్నైలో ఆడియో విడుదల చేశారు. కోహ్లి ఈ లీగ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.