కోహ్లి... వేరే లీగ్‌లతో సంబంధమేల!
న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి... ప్రీమియర్ ఫుట్‌సాల్ (ఫైవ్-ఎ-సైడ్) లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడాన్ని ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తప్పుబట్టారు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)తో ప్రమేయం ఉన్న వ్యక్తి వేరే లీగ్‌లతో ఎలా సంబంధం పెట్టుకుంటాడని విమర్శించారు.
కోహ్లిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఐఎస్‌ఎల్ మాదిరిగానే రూపుదిద్దుకుంటున్న ప్రీమియర్ ఫుట్‌సాల్‌కు పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ లూయిస్ ఫిగో నేతృత్వం వహిస్తున్నారు.