న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టు మైదానంలో నిరాశాజనక ఫలితాలు సాధిస్తున్నప్పటికీ... కోచ్‌గా ఐగర్ స్టిమాక్ కొనసాగనున్నారు. 2026 ఫిఫా ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో అఫ్గానిస్తాన్‌లాంటి చిన్న జట్టుతో ఓటమి పాలవడం ఆయన కోచ్ పదవికి ఎసరు తెచ్చింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) సాంకేతిక కమిటీ కూడా హెడ్ కోచ్‌ను తప్పించాలనే సిఫార్సు చేసింది.
అయితే ఒప్పంద నిబంధనలు ఆయన్ని ఉన్నపళంగా తప్పిస్తే భారీ మూల్యం చెల్లించేలా ఉన్నాయి. దీంతో వేటు కంటే కొనసాగించడమే మేలని ఏఐఎఫ్‌ఎఫ్ భావిస్తోంది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టిమాక్ ఇన్‌చార్జ్‌గా జూన్ వరకు జట్టుతో కలిసి పనిచేస్తారు’ అని ఏఐఎఫ్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. జూన్‌లో ఆసియా క్వాలిఫయర్స్‌కు సంబంధించిన రెండు మ్యాచ్‌లు ఉన్నాయి.
గ్రూప్ ‘ఎ’లో భారత్... కువైట్, ఖతర్‌లతో తలపడాల్సివుంటుంది. ఈ ఫలితాలను బట్టే తదుపరి మూడో రౌండ్‌కు అర్హత సాధించేది లేనిది తేలుతుంది. అఫ్గానిస్తాన్‌తో ఇంటా బయటా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ నిరాశపరిచింది. అఫ్గాన్‌కు సంబంధించిన హోమ్ మ్యాచ్ సౌదీలో జరగ్గా భారత్ డ్రా చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment