Preparatory meeting
-
సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక భేటీ
సాక్షి, హైదరాబాద్: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం, సభ నిర్వహణకు సంబంధించి గురువారం శాసనసభ కమిటీ హాల్లో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈనెల 12 వరకు అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో 13న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. జన సమీకరణకు సంబంధించి 13న జరిగే సమావేశాల్లో ప్రణాళిక రూపొందించుకోవా లని సూచించారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అవసరమైన జన సమీకరణను పర్యవేక్షించేందుకు ఇతర జిల్లాలకు చెందిన సీనియ ర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గ్రేటర్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమించాలని నిర్ణయించారు. ఇన్చార్జిలుగా నియమితులయ్యే నేతలు ఈ నెల 13 నుంచి 17 వరకు తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారు. బహిరంగసభకు ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 10 వేల మందితో జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో అన్ని నియోజక వర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు కేటీఆర్ సూచించారు. -
విశాఖలో పెట్టుబడులకు ఆహ్వానం: సీఎం జగన్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో పెట్టుబడులు పెట్టిన వాళ్లందరికీ కృతజ్ఞతలని, పరిశ్రమలకు స్థాపనకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమని ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. మార్చి నెలలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో ఇందుకు సంబంధించిన సన్నాహక సదస్సు జరగ్గా.. అందులో పాల్గొని ఇన్వెస్టర్లను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాం. ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టడానికి మీ సహకారం మాకు అవసరం. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్లుగా నెంబర్ వన్‌గా ఉంటోందని సీఎం జగన్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను ఆయన ఇన్వెస్టర్లకు తెలియజేశారు. పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే మేం నెంబర్ వన్‌గా ఉన్నాం. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రీయల్ కారిడార్‌లో.. మూడు ఏపీకే రావడం శుభపరిణామం. సింగిల్ డెస్క్ సిస్టమ్ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందని, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. విశాఖ రాజధానిలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్న సీఎం జగన్.. మీతో పాటు ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా తీసుకొచ్చి ఏపీలో అభివృద్ధిని చూపించాలని ఇన్వెస్టర్లను కోరారు. -
నేటి నుంచి టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు
-
సమస్యల సాధనకు పోరాటాలే శరణ్యం
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచిపోయినా జర్నలిస్టుల సమస్యలు అలాగే ఉండిపోయాయని, వాటి పరిష్కారానికి ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ తెలిపారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్ హెచ్‌యూజే ఆధ్వర్యంలో ఈ నెల 22న చేపట్టే ‘చలో కలెక్టరేట్’ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార రాజకీయ పక్షం జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎన్నికల ప్రణాళికలో ఉంచినా ఏ ఒక్కటీ అమ లు పరచటం లేదన్నారు. అందుకే ఓపిక నశించి ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సోదరులందరూ చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు అందే విధంగా జీఓ 239 సవరించి, తక్షణమే కొత్త రాష్ట్రం అక్రెడిటేషన్లు జారీ చేయాలన్నారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్పొరేట్ ఆస్పత్రిలో హెల్త్ స్కీము అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లాల్లో వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామన్న సీఎం హామీని తక్షణం అమలు చేయాలని కోరారు. ఐజేయూ జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సబ్ ఎడిటర్లకు వెంటనే అక్రిడిటేషన్ కార్డులు జారీ చే యాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇంకా ఆంధ్రా అక్రెడిటేషన్లే కొనసాగుతున్నాయని చెప్పారు. అనంతరం ప్రచార కరపత్రాలను విరాహత్ అలీ విడుదల చేశారు. హెచ్‌యూజే ప్రధాన కార్యదర్శి వి. చంద్రశేఖర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, హెచ్‌యూజే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. శంకర్ గౌడ్, సహయ కార్యదర్శి కోన సుధాకర్ రెడ్డి నాయకులు సంపత్, గౌస్, అక్తర్ తదితరులు పాల్గొన్నారు.