అందాల రాశి.. కొన్ని నిజాలు
మెరిసే అందమైన కళ్లు ఆమె సొంతం. ఆమె అలా చిరునవ్వు నవ్విందంటే వెయ్యి వాల్టుల వెలుగు. దశాబ్దాల తరబడి వేలాదిమంది రసజ్ఞుల గుండెల్లో గూడు కట్టుకున్న కలల రాణి. బ్యూటి విత్ టాలెంట్‌కు ఆమె నిలువెత్తు నిదర్శనం...ఆమే హాలీవుడ్ నటీమణి జూలియా రాబర్ట్స్. అక్టోబర్ 28 ఆమె పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆమెకు అభినందన నీరాజనాలు పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఆస్కార అవార్డు విజేత, అందాలరాశి జూలీకి సంబంధించిన కొన్ని ముచ్చట్లు..
1967 అక్టోబర్ 28న లౌ బ్రాడ్మస్,వాల్టర్ గ్రాడీ రాబర్ట్స్ దంపతులకు జూలియా రాబర్ట్స్ జన్మించింది. తల్లిదండ్రులు ఇద్దరూ నటులే బహుశా వారి వారసత్వమే జూలీకి వరంగా లభించినట్టుంది. జూలియాకు ఆరు భాషల్లో ప్రావీణ్యం వుంది. ఇంగ్లీషు, జర్మనీ, స్వీడిష్, ఐరిష్, స్కాటిష్ , వెల్స్ భాషలు ఆమెకు తెలుసు. అన్నట్టు జూలియాకి క్లారినెట్ వాయించడంలో ప్రవేశం వుంది. స్కూలుస్థాయి సంగీత ట్రూపులో ఆమె పనిచేసింది. దీంతోపాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజాన్ని అభ్యసించినా ఇప్పటికీ జర్నలిజం డిగ్రీని మాత్రం చేయలేకపోయింది. నటిగా హాలీవుడ్ లో స్థిరపడకముందు ఆమె స్థానిక టెలివిజన్ షోలో పనిచేసింది. 1986-88 లో ప్రసారమైన ఒక క్రైమ్ స్టోరీ సీరియల్లో తొలిసారిగా మేకప్ వేసుకుంది. అన్నట్టు కుట్లు అల్లికలంటే ఎక్కువ మక్కువ వున్న జూలియా పశువుల డాక్టర్ కావాలని కలలు కందట.
1987లో తన పందొమ్మిదేళ్ల వయసులో 35 ఏళ్ల లియామ్ నీసన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఓ ఏడాదికే ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత 2002 జూలైలో కెమెరామెన్ డానియల్ మోడెర్ను పెళ్లాడింది. బ్రూస్ లీ ఒక్కరే ఈ వివాహానికి అతిథి. ది మెక్సికన్ చిత్రీకరణ సమయంలో చూపులు కలిసి ఒక్కటైన వారిద్దరూ ఒక సంవత్సరం తర్వాత విడాకులు తీసుకున్నారు. తిరిగి జూలై 4, 2002న రాబర్ట్స్‌ను జూలియా వివాహం చేసుకుంది.
2004లో వారికి కవలలు కూతురు హాజెల్ ప్యాట్రిసియా మరియు కొడుకు ఫిన్నాయిస్ జన్మించారు. వారి మూడవ బిడ్డ, కొడుకు హెన్రీ డెనియల్ మోడెర్ లాస్ ఏంజిల్స్‌లో జూన్ 18, 2007న జన్మించాడు. బల్గేరియా తవ్వకాల్లో బయల్పడిన 9000 సంవత్సరానికి చెందిన ఒక స్కెలిటెన్ కు పురాతత్వ శాస్త్రవేత్తలు జూలియా రాబర్స్ట్ పేరుపెట్టారు. తాను హిందూ మతాన్ని ఆచరిస్తానని స్వయంగా జూలియా ఒక సందర్బంగా తెలిపింది.
హాలీవుడ్లోఅత్యధిక పారితోషికం తీసుకున్న తొలి నటీమణి జూలియా. ఇరిన్ బ్రాకో విక్ సినిమాకు గాను ఆమె 20 మిలియన్ల యూఎస్ డాలర్ల పారితోషికాన్ని అందుకుంది. ఈ సినిమానే ఆమెకు అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సాధించి పెట్టింది. వీటితో పాటు ఆమెకు లెక్కకుమించిన అవార్డులు, రివార్డులు.. ఆమె కెరియర్లో మైలురాళ్లుగా మిగిలాయి. రాబర్ట్స్, యూఎన్‌ఐసీఈఎఫ్, ఇతర స్వచ్ఛంద సంస్థలకు సమయంతో పాటు నిధులను వెచ్చిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.