ప్రాఫిట్ బుకింగ్తో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. నిన్నటి సెషన్ లో 521 పాయింట్ల లాభంతోముగిసిన మార్కెట్లు ప్రారంభంలోనే అప్రమత్తతను సూచించాయి. దీంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఈ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 100 పాయింట్లకు పైగా క్షీణించిన సెన్సెక్స్ చివరికి 66 పాయింట్ల నష్టంతో 27,984 వద్ద కీలకమైన మద్దతు స్థాయి 28వేల పాయింట్ల మైలురాయి దిగువన స్థిరపడింది. నిఫ్టీ కూడా 19 పాయింట్ల నష్టంతో 87 వేలకు దిగువకు దిగజారి 8659 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో.రియల్టీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫార్మా, ఐటీ, మెటల్ సెక్టార్ లాభపడగా, ఎఫ్ఎంసీజీ నష్టపోయింది. దీంట్లో ఐటీసీ హెచ్యూఎల్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఐసీఐసీఐ, హీరో మోటో, హెచ్డీఎఫ్సీ క్షీణించగా, ఐడియా, భెల్, టాటా పవర్, విప్రో, లుపిన్, గెయల్, అదానీ పోర్ట్స్ పుంజుకున్నాయి.
అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయి 6 పైసలు బలపడి 66.67 వద్ద ఉంది. మరోవైపు డాలర్ బలహీనత నేపథ్యంలో బులియన్ మార్కెట్టో బంగారం ధరలు బలపడ్డాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లోపదా గ్రా. పసిడి 134రూపాయల లాభంతో 29,920 వద్ద ఉంది.