అమ్మాయిలదే అల్లరెక్కువ
వాషింగ్టన్: తరగతి గదిలో బాలుర కంటే బాలికలే ఎక్కువ అల్లరి చేస్తారని తాజా అధ్యయనంలో తేలింది. అల్లరి విషయంలో హైస్కూల్, కాలేజీ స్థాయిలో అబ్బాయిలదే పైచేయిగా కనిపించినా ప్రాథమికస్థాయిలో మాత్రం అమ్మాయిలదే అల్లరి ఎక్కువగా వినిపిస్తుందట. నాలుగైదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు ఒకేరకమైన భావోద్వేగాలు కలిగి ఉంటారని, అయితే వయసు పెరిగేకొద్దీ వారిలో కలిగే మార్పుల వల్ల అల్లరి స్థాయి పెరగడం, తగ్గడం జరుగుతుందని యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జయంతి ఓన్స్ అన్నారు.
ఇక చదువులో రాణించడం, రాణించకపోవడం వెనుక ఆరోగ్యం, లింగవివక్ష ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. 59.4 శాతం విద్యాఫలితాలకు లింగవివక్షే కారణమవుతోందని, ఇది అనుకూలంగా, ప్రతికూలంగా ఉంటోందని జయంతి తెలిపారు.