Princess Mako
-
యువరాణి పెళ్లికి ముహూర్తం ఫిక్స్
టోక్యో: జపాన్ యువరాణి మాకో తన చిరకాల ప్రేమికుడు కీయ్ కౌమురోను పెళ్లి చేసుకోబోతోంది. తన ప్రేమ కోసం తన వారసత్వ సంపదగా వచ్చే పెద్ద మొత్తాన్ని వదులు కోవడానికి సిద్ధపడి వార్తల్లో నిలిచిన మాకో ఎట్టకేలకు తన ప్రియుడిని మనువాడేందుకు సిద్ధమైంది. మాజీ కాలేజీ క్లాస్‌మేట్‌ను అక్టోబర్ 26 న వివాహం చేసుకోనుంది. పలు విమర్శలు, నిశిత పరిశీలన తర్వాత జపాన్ రాజకుటుంబ వ్యవహారాలు చూసే ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అయితే యువరాణి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడుతోందని, దాన్నుంచి కోలుకునేందుకు ఇంత సమయం పట్టిందని కూడా ప్రకటించింది. సంప్రదాయ వివాహం అనంతరం ఆమె రాజ కుటుంబాన్ని విడిచిపెడుతుందనీ, సాధారణ రాజ వివాహానికి సంబంధించిన వేడుకలేవీ జరగవని స్పష్టం చేసింది. జపనీస్ రాయల్ వెడ్డింగ్‌తో పాటు జరిగే అన్ని ఆచారాలకు విరుద్ధంగా ఈ వివాహం ఉంటుందని తెలిపింది. చక్రవర్తి అఖిహిటో ముని మనవరాలు, నరుహిటో మేనకోడలైన మాకో, కౌమురో ఎంగేజ్మెంట్ 2017లోనే జరిగింది. కానీ కౌమురో తల్లికి, ఆమె మాజీ ప్రియుడి మధ్య ఉన్న ఆర్థిక వివాదం కారణంగా 2018లో జరగాల్సిన వీరి పెళ్లి ఆలస్యమవుతూ వచ్చింది. వీరి ప్రేమ వార్త జపాన్ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పెద్ద చర్చకుదారి తీసింది. ఈ జంట తమ వివాహాన్ని స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో నమోదు చేసుకుంటారని యువరాణి 110 మిలియన్ జపనీస్ యెన్స్ లేదా 1.4 మిలియన్ డాలర్లను వదులుకుందని అధికారిక ప్రకటన తెలిపినట్టు స్థానికమీడియా నివేదించింది. యువరాణి.. సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వారికి రాయల్టీ కింద కొంత సొమ్మును ముట్టజెబుతారు. కానీ ప్రిన్సెస్ మాకో 1.4 మిలియన్ డాలర్లను రిజెక్ట్ చేసి మరీ పెళ్లి సిద్ధంగావడం విశేషంగా నిలిచింది. అలాగే కౌమురోతో పెళ్లి అనంతరం జపాన్ రాజకుటుంబ వారసత్వాన్ని కూడా ప్రిన్సెస్ మాకో కోల్పోనుంది. కియో కౌమురో పోనీటైల్‌తో దర్శనమిచ్చి మీడియాను ఆకర్షించాడు. కౌమురో ఈ సంవత్సరం ఫోర్డ్హామ్ లా స్కూల్లో చదువు పూర్తి చేయడంతోపాటు, లా ప్రాక్టీస్ కోసం బార్ ఎగ్జామ్ పూర్తి చేశాడు. తాజా మీడియా నివేదికల ప్రకారం, అతను అమెరికాలో ఒక లా ఆఫీసులో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఈ నేపథ్యంలో తన ప్రియుడు కౌమురోను పెళ్లి చేసుకొని అమెరికాకు షిఫ్ట్ కానుంది మాకో. కాగా డైలీ మైనీచి ఇటీవల నిర్వహించిన పోల్‌లో 38 శాతం మంది వీరి వివాహానికి మద్దతునివ్వగా, 35 శాతం మంది వ్యతిరేకించారు. 26 శాతం తటస్థంగా ఉండిపోయారు. -
ఓ సామాన్యుడితో పెళ్లి కోసం.. 13 లక్షల డాలర్లను వదులుకోనున్న యువరాణి
టోక్యో: జపాన్ యువరాణి మాకో ప్రేమించిన వ్యక్తి కోసం తన వారసత్వ సంపదగా వచ్చే పెద్ద మొత్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వానికి కూడా తెలిపింది. చక్రవర్తి అఖిహిటో ముని మనవరాలు 29 ఏళ్ల మాకో తన బాయ్‌ఫ్రెండ్ కీయ్ కౌమురోను పెళ్లి చేసుబోతోంది. కాగా వీరివురికి 2017లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కౌమురో తల్లికి, ఆమె మాజీ ప్రియుడి మధ్య ఉన్న ఆర్థిక వివాదం కారణంగా వీళ్ల పెళ్లి ఆలస్యమవుతూ వచ్చింది. అయితే యువరాణి మాకో వివాహం చేసుకోబోతున్న కౌమురో ఓ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. చట్టం ప్రకారం, రాజ కుటుంబంలోని మహిళా సభ్యులు ఒక సామాన్యుడిని వివాహం చేసుకోవడం ద్వారా వారి రాజ హోదాను కోల్పోవడమే కాక రాజకుటుంబంలో వారికి రావాల్సిన ఆడ ఇంటి భరణం కూడా ఇవ్వరు. రాజకుటుంబంలోని మహిళలకు రాజభరణం కింద 13 లక్షల డాలర్లు ఇస్తారు. అయితే మాకో సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని ఆమె వదులుకోవడానికి సిద్ధపడింది. ప్రిన్సెస్ మాకోకు డబ్బు ఇవ్వకపోతే, యుద్ధానంతర జపనీస్ చరిత్రలో అలాంటి చెల్లింపు జరగకపోవడం ఇదే మొదటిసారిగా కానుంది. యువరాణి వివాహం వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత యునైటెడ్ స్టేట్స్లో వారి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. చదవండి: అలా కాదు ఇలా.. ఇలా జారాలి.. జర్రుమని.. -
కాలేజ్ స్వీట్‌హార్ట్‌తో రాణెమ్మ పెళ్లి
ప్రేమ సింహాసనం మకో.. జపాన్ చక్రవర్తి అకిహిటో మనవరాలు! అవును. ఆమె రాకుమారి. ఈ అబ్బాయి.. కొమెరో సాధారణ పౌరుడు. ఒక రాకుమారికి, ఒక సాధారణ పౌరుడికి మధ్య స్నేహం ఉండకూడదు అని కాదు కానీ, ఆ స్నేహం ప్రేమగా మారింది! స్నేహం ప్రేమగా మారకూడదు అని కాదు కానీ, ఆ ప్రేమ.. పెళ్లిగా మారాలని మకో కోరుకుంటోంది. ప్రేమ పెళ్లిగా మారకూడదు అని కాదు కానీ.. జపాన్ రాజప్రాసాద చట్టం (ఇంపీరియల్ హౌస్ లా) ప్రకారం.. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని చేసుకుంటే ఇక ఈమె భర్తతో కలసి బయటికి వెళ్లిపోవలసిందే. అలాగైతే.. ‘వెళ్లిపోతాను’ అని చెప్పేసింది మకో! వలచినవాడి వెంట వెళ్లిపోతాను అని ఒక రాకుమారి ప్రకటించగానే జపాన్ అంతా ఆమె వలచిన కొమెరో వైపు ఎవరతడు అని చూసింది. ఏం చేస్తుంటాడో అని చూసింది. ప్రస్తుతానికైతే కొమెరో ఏమీ చేయడం లేదు! మకోను ప్రేమిస్తూ ఉన్నాడంతే. అదొక్కటే కాదు. స్కీయింగ్ చేస్తాడు. వయెలిన్ ప్లే చేస్తాడు. వంటకూడా బాగానే చేస్తాడు. కొన్నాళ్లు ఏదో లా కంపెనీలో చేశాడు. కొన్నాళ్లు బీచ్‌లో టూరిజం వర్కర్‌గా చేశాడు. చాలా చిన్న ప్రొఫైల్. అతడిని వెంటబెట్టుకొచ్చి అమ్మానాన్నకు పరిచయం చేసింది మకో. ‘‘ఎలా బతుకుతావ్.. ఆ కుర్రాడితో వెళ్లి’’.. కూతుర్ని ప్రేమగా, లాలనగా అడిగారు నాన్న అకిషినో, అమ్మ కికో. ‘‘తనంటే నాకిష్టం’’ అని చెప్పింది మకో. అంతే. ఎంగేజ్మెంట్కు ఏర్పాట్లు మొదలయ్యాయి. వచ్చే ఏడాది పెళ్లి! పెళ్లి కోసం ఒక రాకుమారి సింహాసనాన్ని వదిలేసిన సందర్భం జపాన్ రాజవంశంలో ఇదే మొదటిది కాదు. మకో ఆంటీ సయాకో కూడా ఇలాగే ఒక సామాన్యుడిని చేసుకుని బయటికి వెళ్లిపోయారు. ‘అయ్యో! ఇలా ఒకరొకరు అంతఃపుర ఆడపడుచులు వెళ్లిపోతుంటే రాజకుటుంబం చిన్నబోదా.. చిన్నదైపోదా’ అని జపాన్ పౌరులు బెంగ పెట్టుకుంటున్నారట. ప్రస్తుతం జపాన్ రాజకుటుంబానికి నలుగురే వారసులున్నారు. చక్రవర్తి అకిహిటో (83) నడివయసు కొడుకులు ఇద్దరు, చక్రవర్తి తమ్ముడు, చక్రవర్తిగారి చిన్న కొడుకుగారి కొడుకు హిసాహిటో(10). చక్రవర్తికి మొత్తం నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ ఉంటే.. వారిలో ముగ్గురు అమ్మాయిలే. ఆ అమ్మాయిల్లో మన లేటెస్ట్ హీరోయిన్ మకో ఒకరు. ఇంకొకరు ఆమె చెల్లి కకో. మూడో మనవరాలు పెద్ద కొడుకు నరుహిటో కూతురు ఎయికో. అకిహిటో తర్వాత నరుహిటోనే చక్రవర్తి అవుతాడు. అది కూడా ఏ క్షణమైనా కావచ్చు! రాజవిధుల నుంచి అకిహిటోకు విశ్రాంతి కల్పించే బిల్లుపై ఏకాభిప్రాయం కోసం నేడు జపాన్ క్యాబినెట్ సమావేశం అయ్యే సూచనలున్నాయి. ‘నేనిక చెయ్యలేనేమో’ అని గత ఆగస్టులోనే అకిహిటో చెప్పేశారు. రెండు శతాబ్దాల జపాన్ రాజవంశ చరిత్రలో ఇలా ఒక చక్రవర్తి తనకు తనే అధికారాలను బదలాయించాలని కోరడం ఇదే మొదటిసారి. ఆయన కోరికను సాకారం చేసే విషయంతో పాటు.. సామాన్యులను పెళ్లి చేసుకున్న రాణులను అంతఃపురంలోనే ఉండనిచ్చే అమెండ్మెంట్ బిల్లు ఒకదాన్ని కేబినెట్ పరిశీలించే అవకాశాలున్నాయా లేదా అనే అంశంపై స్పష్టత కోసం జపాన్ మీడియా రాజప్రాసాదం బయట టెంట్లు వేసుకుని కూర్చుంటోంది.