టోక్యో: జపాన్ యువరాణి మాకో ప్రేమించిన వ్యక్తి కోసం తన వారసత్వ సంపదగా వచ్చే పెద్ద మొత్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వానికి కూడా తెలిపింది. చక్రవర్తి అఖిహిటో ముని మనవరాలు 29 ఏళ్ల మాకో తన బాయ్‌ఫ్రెండ్ కీయ్ కౌమురోను పెళ్లి చేసుబోతోంది. కాగా వీరివురికి 2017లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కౌమురో తల్లికి, ఆమె మాజీ ప్రియుడి మధ్య ఉన్న ఆర్థిక వివాదం కారణంగా వీళ్ల పెళ్లి ఆలస్యమవుతూ వచ్చింది.
అయితే యువరాణి మాకో వివాహం చేసుకోబోతున్న కౌమురో ఓ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. చట్టం ప్రకారం, రాజ కుటుంబంలోని మహిళా సభ్యులు ఒక సామాన్యుడిని వివాహం చేసుకోవడం ద్వారా వారి రాజ హోదాను కోల్పోవడమే కాక రాజకుటుంబంలో వారికి రావాల్సిన ఆడ ఇంటి భరణం కూడా ఇవ్వరు. రాజకుటుంబంలోని మహిళలకు రాజభరణం కింద 13 లక్షల డాలర్లు ఇస్తారు. అయితే మాకో సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని ఆమె వదులుకోవడానికి సిద్ధపడింది.
ప్రిన్సెస్ మాకోకు డబ్బు ఇవ్వకపోతే, యుద్ధానంతర జపనీస్ చరిత్రలో అలాంటి చెల్లింపు జరగకపోవడం ఇదే మొదటిసారిగా కానుంది. యువరాణి వివాహం వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత యునైటెడ్ స్టేట్స్‌లో వారి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు.
చదవండి: అలా కాదు ఇలా.. ఇలా జారాలి.. జర్రుమని..
Comments
Please login to add a commentAdd a comment