prior
-
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని చంద్రుని ఉపరితలం..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. రోవర్ ప్రగ్యాన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందని ఇస్రో తెలిపింది. అన్ని ప్రక్రియలు అనుకున్న ప్రకారమే షెడ్యూల్లో పూర్తి అయ్యాయని స్పష్టం చేసింది. రోవర్ కదలికలు ప్రారంభమయ్యాయని తెలిపింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగేప్పుడు చివరి క్షణంలో తీసిన జాబిల్లి వీడియోను షేర్ చేసింది. Chandrayaan-3 Mission: All activities are on schedule. All systems are normal. 🔸Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today. 🔸Rover mobility operations have commenced. 🔸SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday. — ISRO (@isro) August 24, 2023 దక్షిణ ధృవంపైనే ఎందుకు..? చంద్రయాన్ 3 దిగ్విజయంగా జాబిల్లిపై కాలు మోపింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. దక్షిణ ధృవాన్ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నపై ఇస్రో చీఫ్ సోమనాథ్ సమాధానమిచ్చారు. 'చంద్రుని దక్షిణ ధృవంపై సూర్మరశ్మి పడే అవకాశాలు లేవు. నీరు, ఖనిజాలకు సంబంధించిన వివరాలు లభించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా చంద్రుని నివాసానికి సంబంధించిన వివరాలు కూడా దక్షిణ ధృవం వద్ద లభిస్తాయి. అందుకే ఈ ధృవం వైపే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడానికి పలు దేశాలు ప్రయత్నించాయి' అని తెలిపారు. 'చంద్రయాన్ 2 ప్రయత్నంలో విఫలమైన తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమయ్యాం. ఓ ఏడాది చంద్రయాన్ 2లో జరిగిన తప్పిదాలపైనే అధ్యయనం చేశాం. మరో ఏడాది ఆ తప్పులను సరిచేయడంపైనే పనిచేశాం. మరో ఏడాది వాటిని పరీక్షించి చూసుకున్నాం. చివరగా నాలుగేళ్లకు చంద్రయాన్ 3ని ప్రయోగించాం.' అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై ల్యాండ్ అయింది. ఇప్పటికే ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. మరో 14 రోజులపాటు చంద్రునిపై పనిచేయనుంది. ఇదీ చదవండి: జాబిల్లిపై మూడు సింహాల అడుగులు.. రోవర్‌కు సారనాథ్ అశోక చిహ్నం.. -
‘ముందస్తు’ కాదు... ఇక అరెస్టులే!
♦ అడ్డగోలు ధర్నారాయుళ్ళపై కఠిన చర్యలు ♦ కంప్యూటరైజ్డ్ డేటాబేస్ సిద్ధం చేస్తున్న కాప్స్ ♦ పబ్లిక్ న్యూసెన్స్ కేసులపైనా ప్రత్యేక దృష్టి సాక్షి, సిటీబ్యూరో: రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్స్‌కు కారణమవటంతో పాటు సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతున్న నిరసనలపై నగర పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇప్పటి వరకు ఈ తరహా ఆందోళనకారులను ముందస్తు అరెస్టు చేసి వదిలిపెడుతున్నారు. ఈ రకంగా పదేపదే రోడ్లపైకి వచ్చే ధర్నారాయుళ్ళను ఇకపై అరెస్టు చేసి, జైలుకు పంపాలని నిర్ణయించారు. దీంతోపాటు మరికొన్ని పబ్లిక్ న్యూసెన్సుల్నీ తీవ్రంగా పరిగణించాలని భావిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కంప్యూటరైజ్డ్ డేటాబేస్ రూపొందిస్తున్నారు. కొత్త ఏడాది నుంచి ఇది అన్ని పోలీసుస్టేషన్లకూ అనుసంధానించి పని చేయనుంది. చెప్పేదొకటి... చేసేదొకటి... ప్రభుత్వ నిర్ణయాలతో పాటు అనేక అంశాలపై నిరసన తెలపడానికి సమాయత్తమవుతున్న ఆందోళనకారులు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో సామాన్యులకు, ట్రాఫిక్‌కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. వీటికి సంబంధించి పోలీసు అధికారులు సైతం కొన్ని షరతులు విధిస్తున్నారు. అనుమతి వచ్చిన తరవాత చేపట్టే ఈ నిరసనలు ఒక్కోసారి నిర్వాహకులు చేతులు దాటిపోతున్నాయి. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు చేయడం, రహదారులపైకి వచ్చి వాహనాలు, సామాన్యులకు ఇబ్బంది కలిగించడం, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విధ్వంసాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కలెక్టరేట్లతో పాటు మరికొన్ని సున్నిత, కీలక ప్రాంతాల్లో ఈ అపశృతులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడికక్కడే... నగరంలో పదేపదే ఆందోళనలకు దిగే నిరసనకారులు కొందరు ఉన్నట్లు పోలీసు అధికారులు చెప్తున్నారు. వీరు ఒక్కో సందర్భంలో ఒక్కో ప్రాంతంలో నిరసనలకు దిగుతున్నారు. అప్పుడు ముందస్తు అరెస్టులు చేస్తున్న స్థానిక పోలీసులు ఠాణాలకు తరలించి, సొంత పూచీకత్తుపై విడిచిపెడుతున్నారు. ఎవరెవరిని ముందస్తు అరెస్టు చేశారనేది ఆ పోలీసుస్టేషన్ రికార్డులకే పరిమితమవుతోంది. కంట్రోల్‌రూమ్‌తో పాటు ఉన్నతాధికారులకు కేవలం సంఖ్య మాత్రమే తెలియజేస్తున్నారు. దీంతో పదేపదే నిరసనలకు దిగే ఆందోళనకారులు చెలరేగిపోతున్నా, ఎన్నిసార్లు ముందస్తు అరెస్టులు అవుతున్నా కఠిన చర్యలు కరువయ్యాయి. దీంతో పాటు నగరంలో పోలీసు కమిషనర్ తరచు నిషేధాజ్ఞలు విధిస్తుంటారు. వీటి ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీలులేదు. అయినప్పటికీ కొందరు వీటిని బేఖాతరు చేస్తూ రోడ్లెక్కినా ముందస్తు అరెస్టులతో సరిపెట్టాల్సి వస్తోంది. పదేపదే చిక్కితే జైలుకే... ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నగర పోలీసు విభాగం ప్రత్యేక అప్లికేషన్ తయారు చేస్తోం ది. ఇది ఇంట్రానెట్ ద్వారా అన్ని పోలీసుస్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాలతో పాటు ఉన్నతాధికారుల ఆఫీసులకూ అనుసంధానించి ఉంటుం ది. నిరసనలు, నిషేధాజ్ఞల ఉల్లంఘనలతో పాటు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ పట్టుబడి, ముందస్తు అరెస్టు అయిన వారి పూర్తి వివరాలు, ఆధార్ నెంబర్, వేలి ముద్రల్ని పోలీ సులు కచ్చితంగా సేకరిస్తారు. వీటిని కంప్యూటర్లో నిక్షిప్తమై ఉండే అప్లికేషన్లో పొందుపరుస్తారు. ఈ డేటాబేస్ అన్ని ఠాణాలకు అనుసంధానించి ఉన్న నేపథ్యంలో ఓ వ్యక్తి, కొందరు వ్యక్తులు పదేపదే ఆందోళనలకు దిగితే ఆ విషయాన్ని గుర్తించే అప్లికేషన్ అధికారులకు తెలియజేస్తుంది. దీని ఆధారంగా వారిని ఆధారాలతో సహా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. -
పోరాడుతున్న ఇంగ్లండ్
పెర్త్: యాషెస్ సిరీస్‌ను గెలుచుకునే దిశగా ఆస్ట్రేలియా మరింత చేరువైంది. 504 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ సోమవారం నాలుగో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (96 బంతుల్లో 72 బ్యాటింగ్; 12 ఫోర్లు) జట్టును రక్షించేందుకు పోరాడుతుండగా... కీపర్ ప్రయర్ (7 బ్యాటింగ్) అతనితో పాటు క్రీజ్‌లో ఉన్నాడు. ఆఖరి రోజు విజయానికి అవసరమైన మరో 253 పరుగులను ఇంగ్లండ్ సాధించడం దాదాపు అసాధ్యమే! వరుసగా మూడు యాషెస్‌లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఈసారి ‘బూడిద’ గెలుచుకునేందుకు మరో ఐదు వికెట్ల దూరంలో ఉంది. గాయం కారణంగా బ్రాడ్ బ్యాటింగ్‌కు దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దాంతో నాలుగు వికెట్లు తీయగలిగితే సిరీస్ ఆసీస్ వశమవుతుంది. వాట్సన్ సెంచరీ... అంతకుముందు 235/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 369 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 504 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక జట్టు వరుసగా మూడు టెస్టుల్లో 500కు పైగా లక్ష్యాన్ని ముందుంచడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. సోమవారం ఆటలో వాట్సన్ సెంచరీ, బెయిలీ మెరుపు ఇన్నింగ్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. క్రీజ్‌లో రాగానే తొలి ఓవర్ నుంచి వాట్సన్ దూకుడు ప్రదర్శించాడు. మరోవైపు బెయిలీ అండర్సన్ ఓవర్‌ను చితక్కొట్టడంతో జట్టు ఓవరాల్ ఆధిక్యం 500 పరుగులు దాటింది. పాపం కుక్... కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్కు ఈ మ్యాచ్ పీడకలగా మారింది. హారిస్ వేసిన రెండో ఇన్నింగ్స్ తొలి బంతికే కుక్ (0) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. కుక్ ఇలా అవుట్ కావడం ఇదే తొలిసారి. వందో టెస్టులో తొలి బంతికే డకౌట్ అయిన మొదటి బ్యాట్స్‌మన్‌గా కూడా కుక్ నిలిచాడు. ఆ తర్వాత కార్‌బెరీ (31), రూట్ (19), పీటర్సన్ (45), బెల్ (60)ల అవుట్‌తో జట్టు కష్టాలు మరింత పెరిగాయి. ఒకే ఓవర్లో 28 పరుగుల ప్రపంచ రికార్డు సమం చేసిన బెయిలీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ జార్జ్ బెయిలీ ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ వేసిన ఓవర్లో బెయిలీ 28 పరుగులు చేశాడు. సరిగ్గా పదేళ్ల క్రితం (14/12/03) విండీస్ బ్యాట్స్‌మన్ లారా (4,6,6,4,4,4) ఈ ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ పీటర్సన్ బౌలింగ్‌లో లారా ఈ స్కోరు చేశాడు. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 87వ ఓవర్లో బెయిలీ ఈ ఘనత సాధించాడు. అతను వరుసగా 4,6,2,4,6,6 పరుగులు చేశాడు. అప్పటి వరకు 24 బంతుల్లో 11 పరుగులు చేసిన బెయిలీ ఈ ఓవర్ తర్వాత 30 బంతుల్లో 39 పరుగులకు చేరాడు.