Prison officials
-
రచ్చ రేపిన కొత్త మరణ దండన
ప్రపంచదేశాల్లో ఇప్పటి వరకూ మరణ శిక్ష... ఉరి, విద్యుత్ కుర్చీ, విషపు ఇంజెక్షన్స్, తుపాకీ కాల్పులు వంటి పద్ధతుల ద్వారా ఎక్కువగా అమలవుతూ వస్తోంది. కానీ ప్రపంచంలోనే తొలి సారిగా అమెరికాలో ఓ 58 ఏళ్ల హంతకుడికి నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్ష విధించారు. దీనిపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి, ఐరోపా సమాఖ్య సహా పలు సంస్థలు, వ్యక్తుల నుంచి ఈ తరహా మరణశిక్ష అమలు అనాగరికమంటూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రమైన అల బామాలో ఇటీవలే ప్రయోగాత్మకంగా స్మిత్ అనే ఖైదీకి మాస్క్ తగిలించి అందులో నైట్రోజన్ గ్యాస్ పంపడం ద్వారా అతన్ని అపస్మారక స్థితి లోకి తీసుకెళ్లి మరణశిక్షను విజయవంతంగా అమలు చేశారు. అంతే కాదు ఈ మరణశిక్ష అమ లును వీక్షించేందుకు కెన్నెత్ స్మిత్ కుటుంబీకులు, బాధిత కుటుంబ సభ్యులు, లాయర్లను కూడా పరిమిత సంఖ్యలో అనుమతించారు. చాలా సులువుగా కేవలం 22 నిమిషాల వ్యవధిలో కెన్నెత్ స్మిత్ ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఇప్పుడు దీన్ని అమలు చేసిన అమెరికా మాత్రం ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబడింది. స్వదేశంలోనే ఈ మరణదండనపై తీవ్ర నిరస నలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి, ఐరోపా దేశాల సమాఖ్య (ఈయూ)లు అమెరికా తీరును ఖండించాయి. ఈ ఖండనలు, నిరసనలు ఏ స్థాయిలో ఉన్నా యంటే స్వయంగా వైట్ హౌస్ ఈ నైట్రోజన్ గ్యాస్ మరణ శిక్ష తమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందనీ, ఇది క్రూరంగానే ఉందనీ అంగీకరించింది. అమెరికాలో తాజాగా రెండు మరణశిక్షలు ఇంజెక్షన్ ద్వారా అమలు చేశారు. ప్రస్తుతం నైట్రోజన్ మరణశిక్షను అమలు చేసిన అల బా మాతో పాటు మరో రెండు రాష్ట్రాలు ఓక్లహోమా, మిస్సిసిపీలు ఈ తరహా మరణ శిక్ష అమలును ఆమోదించాయి. తాజాగా జరిగిన నైట్రోజన్ మరణశిక్ష అమలును అలబామా అటార్నీ జన రల్ స్టీవ్ మార్షల్ సమర్థించుకున్నారు. ఇది పూర్తిగా ప్రొఫెషనల్ పద్ధతిలో జరిగిందన్నారు. కెన్నెత్ యూజీన్ స్మిత్‌కు ప్రాణాంతకమైన మందులతో మరణశిక్ష అమలు చేయాలని 2022 నవంబర్‌లో నిర్ణయించారు. జైలు సిబ్బంది ఒక ఇంట్రావీనస్ లైన్‌ను చొప్పించారు. అయితే ప్రాణాంతక ఇంజెక్షన్‌ను ఇవ్వడానికి రెండు లైన్లు అవసరం. రెండవ లైను చొప్పించడానికి వారు ఒక గంట పాటు పోరాడిన తర్వాత, ఉరిశిక్ష రద్దు చేశారు. కానీ స్మిత్ 1988లో ఒక బోధకుని భార్యను కిరాయికి చంపిన కేసులో ఇటీవల దోషిగా తేలడంతో మరణ శిక్ష విధించింది కోర్టు. ఈ శిక్షను నైట్రోజన్ వాయువును ఉపయోగించి అమలు చేశారు. అమెరికా రాష్ట్రాలు కొన్ని ఇప్పటికీ ఉరి, ఫైరింగ్ స్క్వాడ్ లేదా ఎలక్ట్రిక్ కుర్చీ ద్వారా మరణ దండన విధానాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్ర న్యాయస్థానాలు మాత్రం పలు రకాల మరణశిక్ష పద్ధతులను నిషేధించాయి. అయితే, గత కొన్ని దశాబ్దాల కాలంలో చాలా రాష్ట్రాలు ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్షను అమలు చేయడానికి అంగీకరించాయి. స్మిత్‌కు మునుపటి ఉరిశిక్ష అమలుకు చాలా నెలల ముందు, అలబామా అధికారులు మరో ఖైదీ అలాన్ మిల్లర్‌కు ఐవీ సూదిని చొప్పించడంలో ఇబ్బందుల కారణంగా మరణశిక్ష అమలు చేయడంలో విఫలమయ్యారు. అలాగే ఇతర ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా కూడా మరణశిక్ష అమలు కాలేదు. అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాలు ఇటీవల ప్రాణాంతక ఇంజెక్షన్ మందులను పొందడంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఔషధ తయారీదారులు యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ యూనియన్లు 2011లో ఇటువంటి ప్రాణాంతక ఇంజె క్షన్ల ఎగుమతులను నిషేధించాయి. దీంతో ఔషధ తయారీ కంపెనీలు వాటి తయారీని నిలిపివేశాయి. ఈ కారణంగా మరణ శిక్షను అమలు చేయడానికి రాష్ట్రాలుఇతర మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. అందులో ఒకటి నైట్రోజన్ వాయువును అందించి ప్రాణాలు తీయడం. దోషి కెన్నెత్ స్మిత్ ముఖానికి మాస్క్ కట్టి, స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును జైలు అధికారులు అందించారు. వాయువు విషపూరితమైనది కాదు. భూ వాతావరణంలో మూడు వంతుల కంటే ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది. కానీ స్వచ్ఛమైన సాంద్రీకృత రూపంలో ఉన్న ఈ గ్యాస్‌ను పీల్చడం వల్ల మెదడుకు ప్రసారం అయ్యే ఆక్సిజన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అల బామా స్టేట్ అటార్నీ జనరల్ స్టీవ్ మార్షల్ మాట్లాడుతూ... నైట్రోజన్ వాయువును ఉప యోగించి, మరణశిక్షను అమలు చేయడం అత్యంత మానవీయమైన పద్ధతి’ అని పేర్కొ నడం గమనార్హం. – వి.వి. వెంకటేశ్వరరావు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 63008 66637 -
అంతా నిరుపేద కుటుంబాల వారే...
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం కేసులో అరెస్టు అయిన 45 మంది నిందితుల్లో దాదాపు అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని జైలు అధికారులు చెప్తున్నారు. సోమవారం 28 మంది నిందితుల తల్లిదండ్రులు చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చి ములాఖత్ ద్వారా తమ కుమారులను కలిశారు. నిందితుల్లో ఒకరు సింగరేణి ఉద్యోగి కుమారుడు కాగా, మరొకరు ఆర్టీసీ ఉద్యోగి కుమారుడని గుర్తించారు. ఈ ఇద్దరూ మినహా మిగిలిన 26 మంది నిందితులూ బెయిల్ కోసం న్యాయవాదుల ఖర్చులు కూడా భరించలేరని పేద కుటుంబాలకు చెందిన వారని అంటున్నారు. తమ కుమారులు ఇలాంటి ఆందోళన, విధ్వంసం చేయడానికి సికింద్రాబాద్ వెళ్తున్నట్లు తమకు చెప్పలేదని, కోచింగ్ కోసం వెళ్తున్నట్లు చెప్పారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అమాయకులను అరెస్టు చేశారు శుక్రవారం గణేష్ ఎక్కడకు వెళ్లాడో మాకు తెలీదు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. రాత్రి 11 గంటలకు ఎస్సై ఫోన్ చేసి బాబు మా దగ్గర ఉన్నాడని, అతడి ఆధార్ నంబర్ పంపమని చెప్పారు. ఎక్కడ ఉన్నాడని అడిగితే సికింద్రాబాద్ కేసులో పట్టుకున్నామన్నారు. మా బాబు రైల్వేస్టేషన్ గోడ అవతలే ఉన్నాడు. అయినప్పటికీ పోలీసులు పట్టుకున్నారు. అసలు నిందితులు దొరక్కపోవడంతో వాళ్ల ఉద్యోగాల కోసం పోలీసులు అమాయకుల్ని అరెస్టు చేశారు. ములాఖత్‌లో కలిసినప్పుడు మా అబ్బా యి ఇదే చెప్తున్నాడు. మేము స్టేషన్లోకి వెళ్లలేదు... స్టేషన్ గోడ అవతలే పట్టుకుని అరెస్టు చేశారని ఏడుస్తున్నాడు. – అంజయ్య కసారాం, నిందితుడు గణేష్ తండ్రి, సంగారెడ్డి జిల్లా లాయర్ని మాట్లాడుకోవడానికి డబ్బుల్లేవ్ మా పిల్లలు చేయని నేరానికి జైలు పాలయ్యారు. లాయర్ని మాట్లాడుకోవడానికీ డబ్బులు లేవు. దయచేసి మా పిల్లల్ని బెయిల్ మీద బయటకు తీసుకురావాలని చేతులెత్తి మొక్కుతున్నా. మా పిల్లలను కాపాడాలని కేసీఆర్, కేటీఆర్‌లకు విన్నవించుకుంటున్నా. ఇప్పటికే జైలు పాలైన వారి జీవితం నాశనమైంది. మహేందర్ అరెస్టు విషయం తెలిసి మూడు రోజుల క్రితం ఊరి నుంచి రూ.2 వేలు తెచ్చా. ఇప్పుడు ఖర్చులకూ డబ్బుల్లేవు. దీంతో బస్టాండులో పడుకుంటున్నా. ఆర్మీలో చేరాలనేది మా వాడి ఐదేళ్ల కల. ఇప్పుడు అది కలగానే మిగిలిపోయింది. విద్యార్థుల వల్లే వచ్చిన తెలంగాణలో వాళ్లే జైలు పాలవుతారని అనుకోలేదు. మా పిల్లలు ఆర్మీ అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని చెప్తున్నారు. – సాయప్ప, నిందితుడు మహేందర్ మామ, రాంపూర్ గ్రామం, తాండూరు -
జైల్లో ఘర్షణ.. 68 మంది ఖైదీలు మృతి
క్విటో: ఈక్వెడార్‌లోని జైలులో రెండు ముఠాల మధ్య భీకరస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 68 మంది ఖైదీలు మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. కోస్తా తీర నగరం గుయాక్విల్‌లో ఈ దారుణం జరిగినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధం ఉన్న రెండు గ్యాంగుల నడుమ దాదాపు 8 గంటలపాటు ఈ ఘర్షణ జరిగింది. తుపాకులతో కాల్పులు జరుపుకున్నట్లు తెలిసింది. జైలు అధికారులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!) -
అనుబంధాలకు ‘కఠిన కారాగార’ శిక్ష
‘మా కుటుంబ సభ్యులు వచ్చి పలకరిస్తే కొంత బాధ తీరేది. మనోధైర్యం వచ్చేది. మళ్లీ వాళ్లెప్పుడు వస్తారా? అని ఎదురు చూసేవాడిని. కరోనా వల్ల మా కుటుంబ సభ్యులను చూడలేని పరిస్థితిలో ఉన్నా. మూడు నెలలుగా ఎవరినీ చూడలేదనే బాధ, బెంగ ఎక్కువయ్యాయి. బయటి వారిని జైలులో కలవకుండా కట్టడి చేయడం మా మేలు కోసమే అని సరిపెట్టుకుంటున్నాం. జైలు అధికారులు మా వాళ్లతో ఫోన్లో మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నారు. అది కొంత ఊరట’ – ఇది రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోని ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీగా ఉన్న గుంటూరుకు చెందిన పి.సాంబ శివరావు ఆవేదన సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి అనుబంధాలకు ‘కఠిన కారాగార శిక్ష’ విధించింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలోనూ అయిన వారిని చూసేందుకు, నేరుగా మాట్లాడేందుకు వీలు లేక ఖైదీలకు ఎదురు చూపులు తప్పని పరిస్థితి నెలకొంది. అయిన వారికి దూరంగా జైలు జీవితం గడుపుతున్న వారంతా వారానికో, నెలకో తమ వారి పలకరింపుతో పరవశించిపోయేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేక జైలు జీవితం అ త్యంత భారంగా గడుస్తోందని వాపోతున్నారు. ఖైదీల్లో మానసిక వేదన తగ్గించేందుకు ప్రభుత్వ ఆ దేశాల మేరకు జైలు అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. ► రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, నెల్లూరు, వైఎస్సార్ కడపలలోని నాలుగు కేంద్ర కారాగారాలు (సెంట్రల్ జైళ్లు)తోపాటు ఏడు జిల్లా జైళ్లు, 11 ప్రత్యేక సబ్ జైళ్లు, రెండు మహిళా జైళ్లు, 82 సబ్‌జైళ్లు, బోస్టన్ జైలు, అగ్రికల్చర్ కాలనీ జైలు, రెండు ఓపెన్ జైళ్లు ఉన్నాయి. ► కరోనా నేపథ్యంలో జైళ్లల్లో రద్దీని తగ్గించేందుకు కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 463 మందిని మధ్యం తర బెయిల్‌పై ఇళ్లకు పంపించారు. బెయిల్ గడువు తీరిన వెంటనే వారు జైలుకు రావాల్సి ఉంటుంది. ► ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 110 జైళ్లలో దాదాపు 6,150 మంది ఖైదీలకు కరోనా ఇబ్బంది రాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు జైలు అధికారులు కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ► జైలులో ఉండే ఖైదీలు.. కుటుంబ సభ్యు లు, బంధుమిత్రులతో కలిసి మాట్లాడే వీలు లేకుండా మూడు నెలలుగా ములా ఖత్లు పూర్తిగా రద్దు చేశారు. వేర్వేరు ప్రాంతాల నుంచి జైలుకు వచ్చి ఖైదీలను చూసి మాట్లాడే అవకాశం ఇస్తే కరోనా వైరస్ ఖైదీలకు సోకే ప్రమాదం ఉన్నందునే రద్దు చేశారు. ► ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో వారానికి రెండు పర్యాయాలు ఫోన్ సౌకర్యం కల్పిస్తే ఇప్పుడు నాలుగు పర్యాయాలు పదేసి నిముషాల చొప్పున తమ వారితో ఫోన్ మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు. ► జైలు పరిసరాల్లోకి కొత్త వ్యక్తులను ఎవరినీ అనుమతించడంలేదు. జైలు పరిసరాల్లో శానిటైజ్ చేస్తున్నారు. ► జైలులోని ఖైదీలకు థర్మల్ స్క్రీనింగ్ చేయడం, మాస్క్‌లు, గ్లౌజులు అందించడంతోపాటు వారు వ్యక్తిగత దూరం (ఫిజికల్ డిస్టెన్స్) పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ► జైలు బ్యారక్‌లలో తక్కువ మందిని ఉంచడం, ఉదయం అల్పాహారం, మద్యాహ్నం, సాయంత్రం భోజనం సమయంలో వారందరినీ ఒకేసారి వదలకుం డా పది మంది చొప్పున జైలు ఆవరణలో విడిచిపెడుతున్నారు. బ్యారక్ లోపల, జైలు ఆవరణలోను ఖైదీలు భౌ తిక దూరం పాటించేలా చూస్తున్నారు. ► రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఖైదీలకు అవసరమైన మాస్కులను జైళ్లలోనే తయారు చేస్తున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, నెల్లూరు, వైఎస్సార్ కడప సెంట్రల్ జైళ్లతోపాటు విజయవాడ, ఒంగోలు డిస్ట్రిక్ట్ జైళ్లలో మాస్కులు తయారు చేస్తున్నారు. ఖైదీలు తయారు చేసే మాస్కులు, శానిటైజర్లు, చేతి గ్లౌజులను అన్ని జైళ్లలోని ఖైదీలు ఉపయోగించుకోగా మిగిలిన వాటిని స్థానికంగా ఉండే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొత్తగా జైలుకు వస్తే 21 రోజులు ఐసోలేషన్ వార్డులోనే.. ఇప్పటి వరకు రాష్ట్రంలోని రాజమహేంద్రవరం, నెల్లూరు, కడప, అనంతపురం జైళ్లలో ఐదుగురు ఖైదీలకు కరోనా సోకింది. వారంతా జైలుకు కొత్తగా వచ్చిన వారే కావడం గమనార్హం. ఖైదీలను జైలుకు తీసుకొచ్చే ముందే కోవిడ్ పరీక్ష చేయిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన కొత్త ఖైదీలను తీసుకొచ్చిన వెంటనే వారిని 21 రోజలపాటు ఐసోలేషన్ వార్డులో ఉంచి తర్వాత పాత ఖైదీలు ఉండే బ్యారక్‌కు తరలిస్తున్నారు. పాత ఖైదీలకు ఎవరికి పాజిటివ్ రాలేదు. ఖైదీల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఖైదీల పట్ల ప్రత్యేక శ్రధ్ద తీసుకుంటున్నాం. రిమాండ్‌కు వచ్చే వారికి కరోనా టెస్ట్‌లు నిర్వహించి, సింగిల్ లాకప్‌కు పరిమితం చేస్తున్నాం. నెగిటివ్ వచ్చిన తరువాతే మెయిన్ బ్లాక్‌లోకి పంపుతున్నాం. పాజిటివ్ అని తేలితే జైలుకు వచ్చిన వ్యక్తిని ఐసోలేషన్ వార్డుకు పంపుతున్నాం. నిత్యం ఉదయం, సాయంత్రం థర్మల్ లేజర్‌గన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నాం. దగ్గు, జలుబు, జ్వరం వంటివి వస్తే జిల్లా జైలు డాక్టర్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. పూర్తిస్ధాయిలో చర్యలు తీసుకుని, కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు పాటిస్తున్నాం. – గుంటూరు ఈస్ట్ జైలు సూపరిటెండెంట్ హంస పాల్ -
మారడోనాతో మళ్లీ వస్తా..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘ఫైవ్ స్టార్ సౌకర్యాల జీవన శైలి కలిగిన నేను.. కటిక నేలపై నిద్రించా.. సాధారణ ఖైదీలకు అందించే రొట్టె, పప్పు మాత్రమే నాకూ అందించారు. దోమలు కుట్టినా, జైలు సిబ్బంది అందించిన కంబలి, ఖైదీలు వేసుకునే దుస్తులు సౌకర్య వంతంగానే ఉన్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గడపడం వింత అనుభూతినిచ్చింది’ అని కేరళకు చెందిన వ్యాపార దిగ్గజం బాబీ చెమ్మనూరు తన ‘ఫీల్ ది జైల్’ అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. కేరళ త్రిసూరుకు చెందిన చెమ్మనూరు ఇంటర్నేషనల్ జ్యువెలర్స్ చైర్మన్ బాబీ చెమ్మనూరు సంగారెడ్డి ‘హెరిటేజ్ జైలు మ్యూజియం’ ఆవరణలో జైళ్ల శాఖ నిర్వహిస్తున్న ‘ఫీల్ ది జైల్’లో భాగంగా ఒక రోజు పాటు జైలులో గడిపారు. సోమవారం ముగ్గురు మిత్రులతో కలసి సంగారెడ్డి పాత జైలుకు వచ్చిన ఆయన రూ.500 చొప్పున నలుగురికి రూ.2 వేలు రుసుము చెల్లించారు. జైలు నిబంధనల మేరకు సాధారణ ఖైదీల తరహా లో చెమ్మనూరు బృందం ఒక రోజు జైలు జీవితాన్ని అనుభవించి మంగళవారం విడుదలయ్యారు. 24 గంటల పాటు తాను అనుభవించిన జైలు జీవితంపై ‘సాక్షి’తో మాట్లాడారు. తన వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మార డోనా త్వరలో కేరళ పర్యటనకు వస్తున్నారని, ఆయనతో పాటు మరోసారి వచ్చి సంగారెడ్డిలో ‘ఫీల్ ది జైల్’ను అనుభూతి చెందాలనుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా, గల్ఫ్, మలేసియా తదితర దేశాల్లో ‘జైలు టూరిజం’ను ప్రోత్సహించేలా ప్రచారం నిర్వహిస్తానన్నారు. సంగారెడ్డి జైలు మ్యూజియాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సహకారం అందిస్తానన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక చెమ్మనూరు తన మిత్ర బృందంతో కలసి సాధారణ వ్యక్తిలా ఆటోలో తాను బస చేసిన హోటల్‌కు వెళ్లారు. ఫీల్ ది జైలుకు ఆదరణ పెరుగుతోందని జిల్లా జైలు సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్, జైలు అధికారులు వెంకటేశ్, గణేశ్ తెలిపారు. -
జైల్లో ‘అగ్రిగోల్డ్’ దర్జా..!
-
జైల్లో ‘అగ్రిగోల్డ్’ దర్జా..!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చేతులు కట్టుకుని మరీ సేవలందించే సిబ్బంది, కోరుకున్న భోజనం, తాగేందుకు మినరల్ వాటర్, మెత్తటి పరుపులపై పడక, కాలక్షేపానికి దినపత్రికలు. ఒక్కటేమిటి ఏది కోరుకుంటే అది నిమిషాల్లో సిద్ధం. ఇవన్నీ.. దేశవ్యాప్తంగా 32 లక్షల మందికి పైగా ప్రజలకు రూ.6 వేల కోట్లకు పైగా టోకరా వేసిప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా జైల్లో ఉన్న అగ్రిగోల్డ్ డైరెక్టర్లు పొందుతున్న రాచమర్యాదలంటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. కానీ పచ్చి నిజం. కోర్టు కాదన్నా.. జైల్లో సైతం ఇలా విలాసవంతంగా గడిపేందుకు ఒక్కొక్కరు నెలకు రూ.50 వేల చొప్పున జైలు అధికారులకు ముట్టజెబుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే.. పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ డైరెక్టర్లు జామీను చూపించకుండా జైల్లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరామారావుతో పాటు మరో 8 మంది డైరెక్టర్లు రెండేళ్లుగా ఏలూరు సబ్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి సంబంధించిన ప్రక్రియ తెరపైకి వచ్చినందున వేరే జైలులో ఉన్న మరో ఇద్దరిని కూడా ఏలూరు జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే జైల్లో ఉన్న చైర్మన్ సహా అగ్రిగోల్డ్ డైరెక్టర్లు సకల సౌకర్యాలూ అనుభవిస్తున్నారని, అధికారులు సాధారణ బ్యారక్‌ను వీఐపీ బ్యారక్లా మార్చేశారనే సమాచారం నేపథ్యంలో.. ‘సాక్షి’ బృందం గత కొంతకాలంగా ఈ వ్యవహారంపై నిఘా వేసింది. ఈ క్రమంలో పలు వీడియోలు సాక్షికి చిక్కాయి. కోర్టు కుదరదన్నా..ప్రత్యేక ఏర్పాట్లు అగ్రిగోల్డ్ డైరెక్టర్లకు జైల్లోని నాలుగో నంబర్ బ్యారక్‌ను కేటాయించారు. ఇది మిగతా అందరు రిమాండ్ ఖైదీలు ఉండే సాధారణ బ్యారక్ లాంటిదే. కానీ దాన్నిప్పుడు మిగతా ఖైదీలందరూ వీఐపీ బ్యారక్ అంటున్నారు. తమకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ డైరెక్టర్లు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో వారు జైలు అధికారులతో కుమ్మక్కయ్యారు. దీంతో మిగతా అందరు ఖైదీల్లా వీరు ఏ పనీ చేయరు. ఉదయాన్నే జైలు ఆవరణలో కుర్చీలు వేసుకుని కూర్చుని దినపత్రికలు చదువుతుంటారు. వార్డర్లు వారి ముందు చేతులు కట్టుకు నుంచుని వారు చెప్పేది వింటుంటారు. వారు ఏది అడిగితే అది క్షణాల్లో సమకూరుస్తారు. ఇక బ్యారక్‌లో వారికి కావాల్సిన అన్నిరకాల సామగ్రి అందుబాటులో ఉంది. కిచెన్ వార్డర్ వీరి కోసం ప్రత్యేకంగా భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకమైన వంట పాత్రల్లో ప్రత్యేకమైన మెనూతో వంటకాలు వండి వడ్డిస్తున్నారు. సన్న బియ్యంతో అన్నం వండుతున్నారు. ప్రత్యేకంగా వాటర్బబుల్స్ (20 లీటర్ల క్యాన్లు) ద్వారా మంచి నీటిని అందజేస్తున్నారు. ఆదివారం మాత్రం ఇంటి భోజనం వస్తుంది. అందుబాటులో అగ్రిగోల్డ్ ఉద్యోగి వీరికి కావాల్సినవి బయట నుంచి తెచ్చి ఇచ్చేందుకు, వారికి కావాల్సిన సేవలు అందించేందుకు శేషగిరిరావు అనే అగ్రిగోల్డ్ ఉద్యోగి ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు జైలు ప్రాంగణంలోనే ఉంటున్నారు. జైలు సిబ్బందికి అతను ప్రత్యేక అతిథి. కిచెన్ వార్డర్ డ్యూటీ జైలులో ఉన్న సిబ్బందికి షిఫ్ట్‌లలో వేయాల్సి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఒకే వ్యక్తి ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదివారం జైలులో ఎవరికీ ప్రత్యేక ఇంటర్వ్యూలు, ములాఖాత్‌లు ఉండవు. అయితే అగ్రిగోల్డ్ డైరెక్టర్లకు మాత్రం ఇక్కడ ప్రత్యేకం. డైరెక్టర్ల బంధువులు ఆదివారం మధ్యాహ్నం వాహనాల్లో జైలుకు వస్తారు. వీరితోపాటు వారు తెచ్చే లగేజీ, భోజనాలు అన్నింటినీ లోపలికి అనుమతిస్తున్నారు. రికార్డుల్లో ఎక్కడా ములాఖాత్‌కు అనుమతించినట్టు ఉండదు. ఇక వీరికి రోజూ రాత్రి పూట పడుకునేందుకు పరుపులు అందజేస్తున్నారు. జైలు సిబ్బంది ఇచ్చిన దుప్పట్లు కాకుండా సొంతంగా ఇంటి నుంచి తెచ్చిన దుప్పట్లు వినియోగిస్తున్నారు. సూపరింటెండెంట్ ఫోన్ నుంచే వ్యవహారాలు జిల్లా జైలు సూపరింటెండెంట్ బి.చంద్రశేఖర్ ఫోన్ నుంచే అగ్రిగోల్డ్ డైరెక్టర్లు అన్ని కార్యాలూ చక్కబెట్టుకుంటున్నారు. అవసరమైన వారితో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నారు. జైలులో ఉండే రిమాండ్ ఖైదీల కోసం వొడాఫోన్ బాక్స్ ఒకదానిని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఈ ఫోన్ నుంచే బయట వారితో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఈ ఫోన్‌ను అగ్రిగోల్డ్ డైరెక్టర్లు ఒక్కసారి కూడా ఉపయోగించిన దాఖలాల్లేవు. కార్యాలయమే బెడ్రూమ్ నాలుగు నెలల క్రితం అగ్రిగోల్డ్ చైర్మన్‌కు అనారోగ్యం కారణంగా నిమ్స్‌లో చికిత్స అందజేశారు. అక్కడ గుండెకు ఒక స్టంట్ వేసినట్లు సమాచారం. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత సుమారు వారం రోజులపాటు ఆయనకు జైలు సూపరింటెండెంట్ గది (ఏసీ గది)లోనే రాత్రి పూట నిద్రపోయే ఏర్పాట్లు చేశారంటే అక్కడ ఏ స్థాయిలో ప్రలోభాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సూపరింటెండెంట్‌తో పాటు సీనియర్ జైలర్, కిచెన్ వార్డర్, గేట్ కీపర్, సూపరింటెండెంట్ డ్రైవర్ తదితరులు అగ్రిగోల్డ్ డైరెక్టర్ల సేవలో తరిస్తున్నట్టు సమాచారం. సూపరింటెండెంట్ డ్రైవర్ విజయవాడ వెళ్లి డబ్బులు వసూలు చేసుకురావడం వంటి కార్యక్రమాలు సైతం చేస్తున్నట్టు తెలిసింది. -
ఖైదీకీ సమాచార హక్కు వర్తింపు
ఒక వ్యక్తి తాను జైల్లో ఎందుకున్నాడో కూడా తెలియకుండా పది రోజులపాటు కారాగారంలో గడపడం కొంత వేధింపు అయితే, తర్వాత ఏడాది పాటు తన అభ్యర్థనకు సమాచారాన్ని ఇవ్వకపోవడం మరో వేధింపు. దీనికి అతడికి పరిహారం చెల్లించాల్సిందేనని కమిషన్ తీర్పు ఇచ్చింది. ఆర్టీఐ కింద ఒక ఖైదీ అడిగినా సమాచారం ఇవ్వకపోవడం మరీ అన్యాయం. ఈ దేశంలో అనేక వింతలు జరుగుతూ ఉంటాయి. ఒక యువకుడు చదువుకోలేదు. పేదవాడు. ఒక వీధి కొట్లా టలో ఇరుక్కున్నాడు. తననే అరెస్టు చేసారు, తనతో తగాదా పడిన వారిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదో తెలియదు. కేసు తనపైనే ఉందని కూడా తెలియదు. ప్రథమ సమాచార నివేదిక తనపైనే, కేసు తనపైనే చివరకు శిక్ష పడింది కూడా తనకు మాత్రమే. జైల్లో ఉండాలన్నారు. మొత్తం వేయి రూపాయలు కూడా కట్టాలన్నారు. ఎందుకో తెలియదు. చెల్లించాడు. రసీదు తీసుకున్నాడు. జైలులో పదిరోజుల శిక్ష అనుభవించాడు. అందుకు చాలా అవమానంగా ఉంది. అతని చెల్లెలికి మరీ అవమానంగా తోచింది. అసలు ఎందుకు కేసు, దేనికి శిక్ష అర్థం కాలేదు. ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు. తనను ఏ సెక్షన్ కింద జైల్లో పెట్టారు తన దగ్గర వేయి రూపాయలు ఎందుకు వసూలు చేశారు? మళ్లీ ఆ డబ్బు వాపస్ ఇస్తారా లేదా అని ఆయన ప్రశ్నలు. తీహార్ రెండో జైలు అధికారికి ఆర్టీఐ దరఖాస్తును బదిలీ చేశాడు సమాచార అధికారి. కాని జవాబు లేదు. మొదట అప్పీలు అధికారి పది రోజుల్లో సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. కాని జైలు అధికారులు ఈ ఆదేశాన్ని పెడచెవిన పెట్టారు. రెండో అప్పీలు తప్పలేదు విడుదలైన ఖైదీ దరఖాస్తుదారు సంజయ్ అదృష్టం కొద్దీ జైలు అధికారులు రెండో అప్పీలు విచారణకు హాజ రైనారు. సంబంధిత ఫైళ్లు కూడా తెచ్చారు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 160 కింద చిల్లర తగాదా కేసులో అత నికి జైలు శిక్ష పడిందని దాంతో పాటు వేయిరూపాయల జరిమానా కూడా విధించారని, అతను చెల్లించిన సొమ్ము జరిమానాయే తప్ప, డిపాజిట్ కాదు కనుక, అతనికి ఆ డబ్బు వాపస్ ఇవ్వబోరని అధికారులు వివ రించారు. సంజయ్ చెల్లెలు చాలా కోపంగా అడిగింది, మా అన్ననే ఎందుకు ైజైలుకు పంపారు. మామీద దాడి చేసి కొట్టిన వారి మీద కేసు ఎందుకు పెట్టలేదు, జైలుకు ఎందుకు పంపలేదు. మా అన్నే దొరికాడా? అని నిల దీసింది. కాని జైలు అధికారులు ఈ ప్రశ్నలకు సమా ధానం చెప్పలేదు. ఆ విషయం ఆమెకు ఇప్పుడు చెప్పినా అర్థం కావడం లేదు. అన్యాయం జరిగిందనే భావనతో తలెత్తే ప్రశ్నలకు సమాచార హక్కుకింద సమాధానం దొరకడం సాధ్యం కాదు. అది సరే ఈ సమాచారం ముందే ఇవ్వవచ్చు కదా, ఎందుకింత ఆలస్యం చేసారు? ఎందుకు ఏడిపించారు? రెండో అప్పీలు దాకా ఎందుకు సాగదీసారు?. ఈ ప్రశ్నలకు అధికారుల సమాధానం ఏమంటే అడ్రస్‌లో పొరబాటు 34 అంకెకు ముందు 1 అనే నెంబర్ పడిందని, కనుక తాము పోస్ట్ చేసిన కవర్ తిరిగి వాపస్ వచ్చిందని. మళ్లీ ఎందుకు పంపలేదు అంటే జవాబు అదే. తప్పుడు అడ్రస్ కనుక మళ్లీ పంపినా ప్రయోజనం లేదని పంపలేదు. నిజానికి అరెస్టయినప్పుడే అతనికి అన్ని వివరాలు తెలియజేయడం బాధ్యత అని తెలుసుకోవడం అతని హక్కు అని రాజ్యాంగం తదితర చట్టాలు ఘోషిస్తు న్నాయి. ఎన్నో తీర్పులు కూడా ఉన్నాయి. కాని జరిగేది ఇది. తన అన్నను అన్నీ ఒప్పుకోమంటే ఒప్పుకున్నాడని కనుక శిక్ష పడిందని ఆమె వాదించింది. సంజయ్‌ని నేరం ఒప్పుకునే విధంగా సంతకాలు చేయించిన మహా నుభావుడెవరో ఎవరికీ తెలియదు. దాన్ని తెలుసుకో వడం సమాచార హక్కు ద్వారా సాధ్యం కాదు. మామూ లుగా నిందితుడి స్థాయిలో లేదా ఖైదీ స్థాయిలో కూడా తెలియవలసిన సమాచారాన్ని అతను ఆర్టీఐ ద్వారా అడిగే పరిస్థితి రావడం ఏమాత్రం న్యాయం కాదు. తన జరిమానాకు రసీదు కూడా సహజంగానే లభించాలి. మొత్తం కేసు కాగితాలు, జైలు శిక్ష వివరాలు, శిక్ష అను భవించిన పత్రాలు కూడా అతనికి ఇవ్వవలసి ఉంటుంది. ఒక ఖైదీగా అతనికి ఆ హక్కు ఉంది. సమా చార హక్కు కింద అడిగినా ఇవ్వకపోవడం మరీ అన్యాయం. ఏ మాటా చెప్పకుండా దరఖాస్తును బదిలీ చేయడం, మొదటి అప్పీలు అధికారి ఆదేశించినా పాటించకుండా సమాచారం నిరాకరించడం సమాచార హక్కు చట్టం ఉల్లంఘనే అవుతుంది. తీహార్ రెండో జైలు అధికారి వార్డ్ నెంబర్ 5కు సంబంధించిన అధికారులు మొత్తం రికార్డులను పరిశీ లించి, సంజయ్‌కు చెందిన కాగితాల ధృవీకృత ప్రతు లను తనకు ఉచితంగా నెలరోజుల్లో ఇవ్వాలని, ఎవరికీ బదిలీ చేయడం కుదరదని కమిషన్ ఆదేశించింది. సంజయ్ సొంతంగా మళ్లీ ఫిర్యాదు చేసే అవసరం లేకుండా జైలు అధికారి శ్రద్ధ తీసుకుని అతని పత్రాలన్నీ అందే వీలు కల్పించాలని కమిషన్ ఆదేశించింది. నెలరోజుల్లోగా సమాచారం ఇవ్వాలని చట్టం నిర్దే శించినా, అసలు ఏ జవాబూ ఇవ్వనందుకు, మొదటి అప్పీలు అధికారి ఆదేశాన్ని పాటించకుండా సంజయ్‌ని రెండో అప్పీలు చేసే పరిస్థితి కల్పించినందుకు, అడ్రస్ సరిగా ఉందో లేదో పరిశీలించకుండా పంపినందుకు, ఆ తరువాతైనా తప్పు సవరించనందుకు అతనికి నామ మాత్రంగా 1500 రూపాయల నష్టపరిహారం చెల్లించా లని కూడా కమిషన్ ఆదేశించింది. ఎందుకు జైల్లో ఉన్నాడో తెలియకుండా పది రోజులపాటు జైల్లో గడ పడం కొంత వేధింపు అయితే, తర్వాత ఏడాది పాటు తన అభ్యర్థనకు సమాచారాన్ని ఇవ్వకపోవడం మరో వేధింపు అనీ, కాబట్టి పరిహారం చెల్లించాల్సిందే అనీ కమిషన్ తీర్పు. (సంజయ్ వర్సెస్ తీహార్ జైల్ సీఐసీ నంబర్ ఎస్ఏఏ 2016, 001077 కేసులో 23 జూన్ 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ - మాడభూషి శ్రీధర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
వారంతే... మారరంతే!
కోటగుమ్మం(రాజమండ్రి) : అనారోగ్యంతో ఉన్న ఖైదీలను ఎస్కార్ట్ పోలీసుల సహాయంతో వ్యాన్‌లో తీసుకువెళ్లాలని నిబంధనలున్నా, జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి ఖైదీలు తప్పించుకున్న సందర్భాలూ అనేకం. తాజాగా ఈనెల 14వ తేదీ ఆదివారం అనారోగ్యంతో ఉన్న రిమాండ్ ఖైదీని రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా హాస్పిటల్లో బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి పరారైన సంగతి తెలిసిందే. సంఘటనలో ఎస్కార్ట్‌గా ఉన్న ఇద్దరు జైలు గార్డులు పి. సత్యనారాయణ, రమణలు సస్పెండ్ అయ్యారు. అయినా అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఈ చిత్రం. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఒకే సారి 12 మంది ఖైదీలను చేతులకు బేడీలు వేసి హాస్పిటల్‌కు తరలించారు. పకడ్బంధీగా పోలీసు వ్యాన్‌లో ఖైదీలనుతరలించవలసిన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు విమర్శలకు దారితీస్తోంది. **