prisoner death
-
రిమాండ్ ఖైదీ మృతిపై మెజిస్టీరియల్ విచారణ
టెక్కలి: వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలికి చెందిన మాదిన వల్లభరావు పాతపట్నం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ మృతి చెందిన ఘటనకు సంబంధించి మంగళవారం టెక్కలి ఆర్డీఓ బి.దయానిధి కార్యాలయంలో మెజిస్టీరియల్ విచారణ చేపట్టారు. వల్లభరావు పాతపట్నం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ గత ఏడాది నవంబర్‌లో శ్రీకాకుళం రిమ్స్‌లో మృతి చెందాడు. ఈయన మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య లక్ష్మి, తమ్ముడు లక్ష్మణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. దీంతో శ్రీకాకుళం ఆర్డీఓ సమక్షంలో సబ్ జైలు సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసరావు, వార్డెన్లు ఎం.అప్పారావు, పి.రామారావుతో పాటు మెళియాపుట్టి పోలీస్ సిబ్బంది ఎం.ఉమామహేశ్వరరావులను విచారించి వివరాలు సేకరించారు. ఈ నెల 25న జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయంలో తదుపరి విచారణ ఉంటుందని ఆర్డీఓ తెలిపారు. -
గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
నెల్లూరు(క్రైమ్): గుండెపోటుకు గురై జీజిహెచ్‌లో చికిత్స పొందుతూ రిమాండ్ ఖైదీ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. పోలీసుల సమాచారం మేరకు.. రాపూరు మండలం గండురుపల్లికి చెందిన ఎం. శ్రీహరి (40) గూడూరురూరల్, కలువాయి పోలీసుస్టేషన్ల పరిధిలో మోటార్ల దొంగతనాల కేసుల్లో నిందితుడు. ఈ కేసుల్లో గతేడాది నవంబర్ 7వ తేదీ నుంచి జిల్లా కేంద్ర కారాగారంలో రిమాం డ్ అనుభవిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం శ్రీహరికి విపరీతమైన కడుపునొప్పి, గుండెనొప్పి వచ్చింది. దీంతో జైలు అధికారులు అతన్ని చికిత్స నిమి త్తం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి (జీజీహెచ్)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. జైలర్ ఎ.కాంతరాజు రిమాండ్ ఖైదీ మృతి ఘటనపై ఐదోనగర పోలీసులకు సమాచారం అందించారు. ఐదోనగర ఎస్సై సీహెచ్ కొండయ్య కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించి, బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జీజీహెచ్‌లో ఆదివారం మృతదేహానికి ఆర్డీఓ హరిత సమక్షంలో శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అనారోగ్యంతో రిమాండ్ ఖైదీ మృతి
రాజమహేంద్రవరం క్రైం: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో అనారోగ్యంతో ఒక రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అముదాలపల్లి గ్రామానికి చెందిన కట్టా రాజేష్ (38) ఈ ఏడాది జూలై 11వ తేదీన అత్యాచారం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా వచ్చాడు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న రాజేష్ శుక్రవారం సాయత్రం అపస్మారక స్థితిలో రిమాండ్ బ్లాక్‌లో పడిఉండగా తోటి ఖైదీలు జైలు సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు హుటాహుటిన జైలుకు చెందిన అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.