private lodges
-
లాడ్జిపై షీ టీమ్స్ దాడులు, మహిళ మృతి
కర్నూలు : షీ టీమ్స్ నుంచి తప్పించుకునే క్రమంలో ఓ మహిళ కిందపడి మృతి చెందిన ఘటన ఆదివారం నగరంలోని కొత్తబస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆత్మకూరు పట్టణానికి చెందిన లక్ష్మి(40) భర్త చనిపోవడంతో లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది. లక్ష్మి రోజూ కర్నూలుకు వచ్చి మహిళలను ఆర్టీసీ కొత్త బస్టాండు సమీపంలోని లాడ్జికి తరలించి పడుపు వృత్తి చేయించేది. ఇందులో భాగంగా హసీనా అనే మహిళతో పాటు మరో మహిళను లాడ్జీలోకి పంపించి బయటే వేచి ఉంది. సమాచారం అందుకున్న షీటీమ్స్ ఆటోలో అక్కడికి చేరుకున్నారు. మహిళా పోలీసులను చూసిన లక్ష్మి పారిపోయేందుకు యత్నించింది. ఈ క్రమంలో కిందపడడంతో ముక్కు నుంచి రక్తస్రావమైంది. వెంటనే పోలీసులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్ఐ మహేశ్వరరెడ్డి, ఏఎస్ఐ ప్రకాష్ ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. -
ప్రైవేటు లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక దాడి
యాదగిరిగుట్ట పట్టణంలో ప్రైవేటు లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోన్న ఐదు జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఆలేరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ దాడుల్లో ట్రైనీ ఎస్ఐ విజయ కృష్ణ పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్రైవేటు లాడ్జీలపై దాడులు
యాదగిరిగుట్ట (నల్లగొండ) : ప్రైవేటు లాడ్జీలపై పోలీసులు దాడిచేసి 20 జంటలను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం యాదగిరిగుట్టలో జరిగింది. యాదాద్రిలో సుమారు 50కిపైగా ప్రైవేటు లాడ్జీలు ఉన్నాయి. వాటిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇవాళ పోలీసులు ఒకేసారి దాడి చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న 20 జంటలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ చేసి వదిలేశారు.