private offices
-
ఆ మూడ్రోజులు ‘ఢిల్లీ’కి సెలవు..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జి–20 శిఖరాగ్ర సదస్సుకు సమాయత్తమవుతోంది. సెపె్టంబర్ 8, 9, 10వ తేదీల్లో జరిగే ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. సదస్సు దృష్ట్యా వచ్చే నెల 8 నుంచి మూడ్రోజుల పాటు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సుకు హాజరవుతున్న భాగస్వామ్య దేశాల నేతల భద్రత దృష్ట్యా ఆ మూడు రోజులూ లుటియన్స్ ఢిల్లీలోని అన్ని మాల్స్, మార్కెట్లను మూసి ఉంచాలన్న పోలీసు శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా ఆమోదం తెలిపారు. అంతేకాకుండా, రాజధానిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, దుకాణాలు, వాణిజ్య వ్యాపార సంస్థలను మూసివేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సుప్రీంకోర్టు, సెంట్రల్ సెక్రటేరియట్ సహా కొన్ని మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రభుత్వ బస్సుల రాకపోకలను గణనీయంగా తగ్గించనున్నారు. సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది. హాజరయ్యే ముఖ్యుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, యూకే ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ల తదితరులున్నారు. హోటళ్లకు పెరిగిన గిరాకీ... జీ20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ సహా, గురుగ్రావ్, నోయిడాల్లోని పెద్ద హోటళ్లకు గిరాకీ పెరిగింది. ప్రపంచ నాయకులతో పాటు వారి ప్రతినిధి బృందాలు, భారీ రక్షణ, మీడియా బృందాలు ముందుగానే భారత్ చేరుకుంటుండటంతో టాప్ ఫైవ్ స్టార్ హోటళ్లలో బుకింగ్‌లు పెరిగాయి. సెపె్టంబర్ 6 నుంచి 12 మధ్య అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లు పూర్తిగా బుక్ అయ్యాయని తెలుస్తోంది. హోటల్ గదుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఏరోసిటీలోని హోటల్లో ఉత్తమమైన సూట్ ఒక రాత్రికి రూ.20 లక్షల చొప్పున కోట్ చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్‌కు కూతవేటు దూరంలోని జన్‌పథ్ సమీపంలోని ఒక హోటల్లో ప్రధాన సూట్‌కు ఒక్క రాత్రికి రూ.15 లక్షలకు బుక్ అయిందని అవి వెల్లడించాయి. -
బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం: ఇంటర్వ్యూలో షాకింగ్ ప్రశ్నల దుమారం
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్మరోసారి వార్తల్లో నిలిచారు. బిల్‌గేట్స్ ఆఫీసులో ఉద్యోగం కోసం పిలిచి ఇంటర్వ్యూలో అభ్యంతరకర ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వైరల్‌గా మారింది. (వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్) ఈ నివేదిక ప్రకారం బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసు ఇంటర్వ్యూను థర్డ్ పార్టీ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బిల్ గేట్స్ ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగాలు కోరుతున్న మహిళలను లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు. గేట్స్ వెంచర్స్ కోసం ఇంటర్వ్యూ చేసే ఎక్సటర్న్ సెక్యూరిటీ వారి లైంగిక చరిత్ర, మీకు నచ్చే పోర్న్ చిత్రాలు, చిత్రాలు, వారి ఫోన్లో నగ్న ఫోటోలేమైనా ఉన్నాయా, ఇంతకు ముందు వివాహేతర సంబంధాలున్నాయా అని మహిళల్ని ప్రశ్నించారు. అంతేకాదు డ్రగ్స్ తీసుకుంటారా వంటి ఇతర ప్రశ్నల్ని కేడా అడిగారు. అయితే అదే స్థానాలకు పురుష దరఖాస్తుదారులు అలాంటి వ్యక్తిగత వివరాల గురించి అడగలేదని కూడా నివేదించింది. కొంతమంది మహిళలు తాము ఇంతకుముందు "డాలర్ల కోసం డ్యాన్స్ చేసారా" అని అడిగారని తెలపారని, లైంగికంగా సంక్రమించే వ్యాధికి మీకు సోకిందా అని కూడా ప్రశ్నించారని తెలిపారని వాల్ స్ట్రీట్ పేర్కొంది. అయితే ఈ కథనంపై కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ స్పందించింది. కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ సీఈవో మైక్ లెఫెవర్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. చట్టాలకు లోబడి మాత్రమే ప్రవర్తించామన్నారు. ఇదీ చదవండి: Bhuvan Bam Net Worth 2023: తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా? మరోవైపు గేట్స్ వెంచర్స్ ప్రతినిధి మాట్లాడుతూ కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడగడం గురించి తమకు తెలియదనీ, అయితే ఇది ఈ విధానం ఆమోదయోగ్యం కాదు, తమ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆమె పేర్కొన్నారు. కానీ. పదిహేనేళ్ల స్క్రీనింగ్ ప్రక్రియలో ఇలాంటి సమాచారం ఎపుడూ తమకు అందలేదని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామన్నది స్పష్టం చేయలేదు. (బిజినెస్ టైకూన్ల తొలి జాబ్ ఏదో తెలుసా? మెగా స్టార్ల సక్సెస్ జర్నీ తెలుసా?) కాగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ బిల్ గేట్స్ మిలిండా దంపతులు విడాకులు తీసుకోవడం పెద్ద సంచలనం రేపింది. 2021 ఆగస్టులో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తరువాత ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడనే వార్తలొచ్చాయి. దీంతోపాటు బిల్ గేట్స్ పలువురు మహిళా ఉద్యోగులతో సంబంధాలున్నాయని ఆరోపణలు కూడా జోరుగానే ఉండటం గమనార్హం. -
ఢిల్లీలో ప్రైవేట్ ఆఫీసుల మూసివేత
న్యూఢిల్లీ/ముంబై: ఢిల్లీలో కరోనా పడగ విప్పడంతో ప్రైవేటు కార్యాలయాన్ని మూసివేశారు. అత్యవసర ఆఫీసులు మినహాయించి అన్ని ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) మంగళవారం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ప్రైవేటు ఆఫీసుల్లో 50% సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సిబ్బంది అందరికీ ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని కల్పించాలంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఏకంగా 23 శాతం దాటింది. దేశంలో గత 24 గంటల్లో 1,68,063 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64% ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 8.85 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల విజృంభణతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ పరిస్థితులని సమీక్షించడానికి గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లో ఈసారి మకర సంక్రాంతికి గంగానది జలాల్లో పుణ్య స్నానాలు ఆచరించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. లతా మంగేష్కర్‌కు కరోనా ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌కు (92) కరోనా సోకింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బంధువులు చెప్పారు. ‘లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ లత‡ వయసును (92 ఏళ్లు) దృష్టిలో ఉంచుకొని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాలని వైద్యులు మాకు సూచించారు’ అని ఆమె మేనకోడలు రచన చెప్పారు. లత కోలుకోవడానికి వారం రోజులు పడుతుందని వైద్యులు చెప్పినట్టుగా రచన తెలిపారు. లత కరోనా మొదటి వేవ్‌లోనూ వైరస్ బారినపడి కోలుకున్నారు. -
భారీగా కేసులు.. వారందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వండి!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి థర్డ్‌వేవ్ రూపంలో మరోసారి తన పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ప్రమాదకరంగా నమోదవుతున్నాయి. అధిక సంఖ్యలో జనాలు కోవిడ్ బారిన పడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రంలో వీకెండ్ లాక్డౌన్ అమలు చేస్తోంది. అలాగే ప్రస్తుతం 50శాతం సామర్థ్యంతో నడుస్తున్న బార్లు, రెస్టారెంట్లు సోమవారం మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒక జోన్లో రోజుకు ఒకే మార్కెట్‌కు అనుమతి ఇచ్చింది. చదవండి: థర్డ్‌వేవ్ ప్రారంభమైంది.. జనవరి చివరి నాటికి.. తాజాగా కరోనా పాజిటివిటీ రేటు 23శాతానికి పెరిగిన నేపథ్యంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవలు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయాలని ఢిల్లీవిపత్తు నిర్వహణ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులందరికీ వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల నుంచి ప్రైవేటు బ్యాంకులు, అత్యవసర సేవలు అందించే కార్యాలయాలు, బీమా కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, లాయర్లు కార్యాలయాలు, కొరియర్ సేవలకు మినహయింపు ఇచ్చింది. ఈ మేరకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీడీఏంఏ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: పాజిటివ్ వ్యక్తుల్లో ధైర్యం నింపేందుకు.. ఢిల్లీ సర్కార్ వినూత్న కార్యక్రమం మరోవైపు ఢిల్లీలో లాక్డౌన్ ఉండబోదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అదే విధఃగా దేశ రాజధానిలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తగిన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ఢిల్లీ వ్యాప్తంగా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ‘ఎవరూ ఏం మాట్లాడటం లేదు. పాజిటివిటీ రేటు 25శాతం పెరిగింది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని తెలిపారు. పబ్లిక్‌ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని సూచించారు. ప్రస్తుత సమయంలో తీసుకునే జాగ్రత్తలను బట్టి ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం ఉండబోదని, అమలు చేస్తున్న ఆంక్షలన్నింటినీ పరిస్థితులు అదుపులోకి వచ్చాక తీసేస్తామని పేర్కొన్నారు.