కారు‘చౌక’ మోసం!
బషీరాబాద్, న్యూస్‌లైన్: ‘ఎస్ఎమ్ఎస్ కొట్టు.. బహుమతి పట్టు..! కామన్ మ్యాన్ని కూడా కార్లు వరించే కాంటెస్ట్.. మీకు అతి తక్కువ ధరకే కారు కావాలనుకుంటున్నారా? అయితే ఈ నంబర్‌కు ఎసెమ్మెస్ కొట్టండి’ అంటూ ఓ టీవీ చానల్లో వచ్చిన యాడ్‌ని నమ్మిన వ్యక్తి బోల్తాపడ్డాడు. దాదాపు రూ.లక్ష మోసపోయాడు. ఈ సంఘటన బషీరాబాద్‌లో శుక్రవారం వెలుగుచూసింది.
చౌకబేరం..
రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ ప్రాంతానికి చెందిన సురేశ్ బషీరాబాద్‌లో మిఠాయి బండార్ నిర్వహిస్తున్నాడు. రోజూ వచ్చే రూ. 200-300లతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నంతలో హాయిగా బతుకుతున్నాడు. ‘ఎస్ఎమ్ఎస్ కొట్టు.. బహుమతి పట్టు’ అని ఓ హిందీ చానల్లో ఇటీవల యాడ్ వచ్చింది. అత్యాశకు పోయిన సురేశ్ టీవీ స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కు ఎస్ఎమ్ఎస్ పంపాడు. ‘మీకు ఖరీదైన టాటా కారు పొందే అవకాశం వచ్చింది. రూ.25,006 తమ ఖాతాలో వేయాలి’అని ఓ వ్యక్తి ఫోన్ చేసి సురేష్‌కు చెప్పాడు. దీంతో సురేశ్ ఈనెల 15న సదరు మొత్తాన్ని రాజీవ్ రంజన్ పేరిట 33761188005 నంబర్ ఎస్బీఐ ఖాతాలో జమచేశాడు. అదే రోజు సురేష్‌కు మళ్లీ కాల్ వచ్చింది. కారు షోరూమ్‌లో నుంచి కదులుతుంది.
ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు రూ.15,606 ఖాతాలో జమ చేయాలని మళ్లీ చెప్పడంతో సురేశ్ వేశాడు. ఇలా 16వ తేదీన రెండుసార్లు రూ. 52,302, మరుసటి రోజు రూ.7006లను శశిభూషణ్ అనూజ్(అకౌంట్‌నంబర్33106048542), సం తోష్ మహతో(20168041425) ఖాతో లో డబ్బు జమచేశాడు. ఇలా మొత్తం రూ. 99,618 పలు ఖాతాల్లో వేశాడు. కారు మధ్యలోకి వచ్చింది.. ఇంకో రెండు గంటల్లో ఇంటిముందు ఉంటుదని చెప్పగానే సురేశ్ కుటుంబం సంతోషించింది. శుక్రవారం 072776 58717 నంబర్ నుంచి అశుతోష్ అనే వ్యక్తి నుంచి సురేష్‌కు ఫోన్ చేశాడు. తాను టాటా మోటర్స్ ప్రతినిధి అని పరిచ యం చేసుకున్నాడు. కారు కంటే బంపర్ ఆఫర్ తగిలిందని అశుతోష్ సురేష్‌కు చెప్పాడు. రూ. 6,000లు అకౌంట్లో వేస్తే రూ.12,4 లక్షలు ఖాతాలో జమ అవుతుందని చెప్పగానే సురేష్ కంగు తిన్నా డు. మోసపోయానని గ్రహించి శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. రెక్కల కష్టం దోచుకున్నారని సురేష్ లబోదిబోమన్నాడు. విచారణ జరుపుతా మని ఎస్ఐ లకా్ష్మరెడ్డి తెలిపారు.