ఎర్రకాలువ నీటి మళ్లింపునకు ప్రతిపాదనలు
ఏలూరు (మెట్రో) : జంగారెడ్డిగూడెం పట్టణ ప్ర జల దాహార్తిని తీర్చడానికి ఎర్రకాలువ ప్రాజెక్ట్ నుంచి నీటిని మళ్లించి మంచినీటి పథకాన్ని అమలు చేసే ందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 26 సమస్యలపై ప్రజలు ఫోన్లో తెలపగా ఆయన స్పందించారు. చింతలపూడి మండలం రేచర్లకు చెందిన మద్దిపాటి శ్రీను ఫోన్లో మాట్లాడుతూ పశువు దాణా ఖర్చుతో కూడుకోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పగా రూ.10 లక్షల విలువైన దాణా తయారీ పరిశ్రమ స్థాపనకు అనుమతిస్తామని కలెక్టర్ సమాధానమిచ్చారు. ఏలూరుకు చెందిన పైడేటి రఘు మాట్లాడుతూ కన్యకాపరమేశ్వరి సత్రం వద్ద భారతి పాఠశాలలో మరుగుదొడ్డి సదుపాయం లేక చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణానికి విద్యాశాఖకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తక్షణమే మరుగుదొడ్ల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఏజేసీ షరీఫ్, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్షీ్మశ్వరి, మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక, ఉద్యాన శాఖ ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి, ఎల్డీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాబార్డ్ ఏజీఎం రామప్రభు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనకు సహకరించాలి
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం నెలకొల్పాలని, సకాలంలో అనుమతులు ఇస్తేనే పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. కలెక్టరేట్లో పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు వచ్చిన 81 దరఖాస్తులను ఎందుకు పెం డింగ్‌లో పెట్టారని ప్రశ్నించారు. సింగిల్ విండో విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
పనులు వేగిరపర్చాలి
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లలో భవనాల నిర్మాణ పనులను వేగిరపర్చాలని నాబార్డు, ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో నాబార్డు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి నెలాఖరుకు పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.