processors
-
శామ్సంగ్ నుంచి మరో పవర్ ఫుల్ ప్రాసెసర్
మొబైల్ తయారీ సంస్థ శామ్సంగ్ మరో పవర్ ఫుల్ ప్రాసెసర్ ప్రాసెసర్ ను తీసుకొచ్చింది. శామ్సంగ్ నిన్న(జనవరి 12న) నిర్వహించిన "ఎక్సినోస్ ఆన్" కార్యక్రమంలో ‘ఎక్సినోస్ 2100’ చిప్‌సెట్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త చిప్‌సెట్‌ను త్వరలో తీసుకురాబోయే గెలాక్సీ ఎస్ 21 స్మార్ట్‌ఫోన్ లో ఉపయోగించనున్నారు. ఎక్సినోస్ 2100 పవర్ ఫుల్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కి సపోర్ట్ చేసేలా అధునాతన 5-నానోమీటర్ టెక్నాలజీపై తయారు చేసిన మొట్టమొదటి హై-ఎండ్ 5జీ ప్రాసెసర్ అని టెక్ దిగ్గజం తెలిపింది. ఇతర ప్రాసెసర్లతో పోలిస్తే ఇది10 శాతం మెరుగ్గా, వేగంగా పనిచేస్తుందని శామ్సంగ్ పేర్కొంది. అంతేగాక, ఇది 20 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తుందని స్పష్టం చేసింది.(చదవండి: రెడ్మీ మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్) బ్రిటీష్ చిప్ డిజైన్ సంస్థ ఆర్మ్ లిమిటెడ్ కలిసి ఈ కొత్త చిప్‌సెట్‌ను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. శామ్సంగ్ ఎక్సినోస్ 2100 ట్రై-క్లస్టర్ ఆర్కిటెక్చర్‌తో వస్తుంది. దీని మల్టీ-కోర్ పనితీరు గత మోడళ్ల కంటే 30 శాతం మెరుగ్గా ఉందని యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. ఆర్మ్ యొక్క సరికొత్త మాలి-జీ 79 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జిపియు)తో దీనిని రూపొందించారు. ఎక్సినోస్ 2100 గ్రాఫిక్ పనితీరు పరంగా గతంతో పోలిస్తే 40 శాతం మెరుగుపడిందని సంస్థ తెలిపింది. వర్చువల్ రియాలిటీ మెరుగైన పనితీరును అందిస్తుంది అని శామ్సంగ్ పేర్కొంది. "5జీ, అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్, ఆన్-డివైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినట్లు" అని పాల్ విలియమ్సన్ అన్నారు. 200 మెగా పిక్సల్ కెమెరాకు సపోర్ట్: ఎక్సినోస్ 2100 హై-ఎండ్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్‌తో వస్తుంది. దింతో 200 మెగాపిక్సెల్‌ల వరకు ఇమేజ్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. దీన్ని గరిష్టంగా ఆరు ఇమేజ్ సెన్సార్లతో కనెక్ట్ చేయవచ్చు. దీనిలో వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI ) టెక్నాలజీతో అధునాతన ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ దృశ్యాలు, ముఖాలు, వస్తువులను తిరిగి అమర్చవచ్చు. ఎక్సినోస్ 2100 చిప్సెట్ 5G టెక్నాలజీ, ఎమ్ఎమ్ వెవ్ స్పెక్ట్రమ్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఎక్సినోస్ 2100 7.35 జిబిపిఎస్, 5.6 జిబిపిఎస్ వరకు డౌన్‌లింక్ స్పీడ్‌ను అందించగలదని సాంసంగ్ స్పష్టం చేసింది. మార్కెట్ ట్రాకర్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. మొబైల్ ప్రాసెసర్ మార్కెట్లో 2020 మూడవ త్రైమాసికంలో 12శాతం శామ్సంగ్ వాటాతో మూడవ స్థానంలో నిలిచింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 4శాతం తగ్గింది. తైవాన్ మీడియాటెక్ ఇంక్ 31 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలవగా, యుఎస్ ఆధారిత క్వాల్కమ్ 29 శాతం వాటాతో రెండవ స్థానంలో ఉంది. -
ధాన్యం కొనుగోలుకు బల్క్ బయ్యర్లకు అవకాశం!
న్యూఢిల్లీ: ఒకేసారి భారీ మొత్తంలో కొనుగోలు చేసేవారికి(బల్క్ బయ్యర్స్, బిగ్ రీటెయిలర్స్, ప్రాసెసర్స్) రైతులు, సహకార సంస్థల నుంచి ధాన్యాన్ని, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అనుమతినివ్వాలని కేంద్రం రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. మూడు నెలల పాటు వారికి ఆ అవకాశం కల్పించాలని కోరింది. తద్వారా వ్యవసాయ మార్కెట్లపై భారం తగ్గుతుందని, అలాగే, వినియోగదారుడికి తగినంత స్థాయిలో ఉత్పత్తులు లభిస్తాయని సూచించింది. అలాగే, వేర్‌హౌజింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీలో రిజిస్టరైన గోదాములను ‘ఈ నామ్’ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్‌కు వీలైన మార్కెట్లుగా ప్రకటించాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ బుధవారం లేఖ రాశారు. అంబేడ్కర్ జయంతిన సెలవు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14ను కేంద్రం సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు సిబ్బంది శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన కార్యాలయాలు మూతపడనున్నాయి. -
ప్రాసెసర్లకు కొత్త అవకాశాలు
రూపు మార్చుకుంటున్న కంప్యూటర్లు ఇంటెల్ ప్రాసెసర్‌తో విస్తృత శ్రేణి.. త్వరలో మరిన్ని ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లలో పీసీలకు తరగని డిమాండ్ సాక్షితో ఇంటెల్ దక్షిణాసియా సేల్స్ ఎండీ దేవయాని ఘోష్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘డెస్క్‌టాప్ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లకు గిరాకీ పడిపోయిందని అంటున్నారు. వాస్తవానికి చూస్తే రోజురోజుకూ విభిన్న మోడళ్లు దేశంలో వచ్చిపడుతూనే ఉన్నాయి. అల్ట్రాబుక్, నెట్‌బుక్, ట్యాబ్లెట్ పీసీ, ఫ్యాబ్లెట్.. ఇలా కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. దేశ జనాభాలో 10-12 శాతం మంది మాత్రమే కంప్యూటర్ వాడుతున్నారు. ఈ లెక్కన ఇక్కడ అవకాశాలు అపారమని ప్రాసెసర్ల తయారీ దిగ్గజం ఇంటెల్ దక్షిణాసియా సేల్స్, మార్కెటింగ్ గ్రూప్ ఎండీ దేవయాని ఘోష్ గురువారం తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్‌ను సందర్శించేందుకు వచ్చిన ఆమె సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. కంప్యూటర్లకు ప్రపంచంలో ఉత్తమ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. మార్కెట్‌కు అనుగుణంగా.. భారత్ వంటి దేశాల్లో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లకు గిరాకీ ఎప్పటికీ తరగదు. అయితే వీటిని వినియోగిస్తున్న కస్టమర్లు ఇప్పుడిప్పుడే ట్యాబ్లెట్ పీసీ, ఫ్యాబ్లెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలాగూ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ ఉపకరణాల మూలంగా మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. మార్కెట్‌కు అనుగుణంగా ప్రాసెసర్లను రూపొందిస్తున్నాం. ఇంటెల్ ప్రాసెసర్‌తో ఇప్పటికే కొన్ని ట్యాబ్లెట్ పీసీ, స్మార్ట్ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. ఈ ఉత్పత్తులకు అపూర్వ స్పందన వస్తోంది. 2014 డిసెంబరుకల్లా మరిన్ని కంపెనీల ఉత్పత్తుల్లో ఇంటెల్ దర్శనమీయనుంది. కంప్యూటర్ అంటే.. సోషల్ వెబ్సైట్లు, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు కంప్యూటర్ అంటే. ఇంటర్నెట్ ఆధారంగా జీవితాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించుకోవడానికి అదో సాధనం. 2020 నాటికి దేశంలో ప్రతీ కుటుంబంలో ఒకరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా నాస్కామ్తో కలిసి నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్‌ను 2012 ఆగ స్టులో ప్రారంభించాం. విద్యార్థులు, రైతులు, గృహిణులు, చిన్న వ్యాపారస్తులకు కంప్యూటర్ వినియోగం, ప్రయోజనాలపై శిక్షణ ఇస్తున్నాం. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 17 లక్షల మందికి శిక్షణ ఇచ్చాం. డిసెంబరుకల్లా ఈ సంఖ్య 20 లక్షలకు చేరుకోనుంది. ఇంటెల్ లెర్న్ ఈజీ స్టెప్స్ పేరుతో ఆన్‌డ్రాయిడ్ అప్లికేషన్ అభివృద్ధి చేశాం. చిన్న చిన్న చిట్కాలతో వ్యక్తులు తమ నైపుణ్యం, సామర్థ్యం ఎలా పెంచుకోవాలో ఈ అప్లికేషన్ తెలియజేస్తుంది.