రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
మదనపల్లె రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం రామిగానిపల్లె సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో రిమ్స్‌లో పని చేస్తున్న దంపతులు తీవ్ర గాయాలపాలయ్యారు.
వైఎస్సార్ జిల్లా రిమ్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆవుల విజయచంద్రారెడ్డి(38), ఆయన భార్య ఆశారమణి(36) కారులో బెంగళూరుకు వెళ్తున్నారు. అర్థరాత్రి సమయంలో వారి వాహనం రామిగానిపల్లె వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన లోయలోకి దూసుకెళ్లింది. దీనిని గమనించిన సంబంధిత లారీ డ్రైవర్ అక్కడే తన వాహనాన్ని నిలిపి 108కు ఫోన్ చేయటంతో పాటు గ్రామస్తులను అప్రమత్తం చేశాడు. వారంతా అక్కడికి చేరుకుని జేసీబీ సాయంతో నాలుగు గంటల పాటు శ్రమించి దంపతులను బయటకు తీయగలిగారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ముందుగా మదనపల్లె ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతికి తరలించారు.