Professional boxer
-
బీస్ట్‌లా విరుచుకుపడటమే తెలుసు.. 57 ఏళ్ల వయసులోనూ!
వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్.. రెండో రౌండ్.. 12 రౌండ్ల పాటు సాగాల్సిన పోరు.. అప్పటికి రెండు నిమిషాల ముప్పై ఐదు సెకన్ల పోరు మాత్రమే సాగింది. ఓ వైపు మొహమ్మద్ అలీనే ఓడించిన ధీరుడు ట్రెవర్ బెర్బిక్.. మరోవైపు 20 ఏళ్ల యువకుడు. ఎవరు గెలిచి ఉంటారో అంచనా వేయండి. సాధారణంగా బాక్సింగ్ అభిమానులెవరైనా బెర్బిక్ పేరే చెబుతారు. కానీ.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆ 20 ఏళ్ల యంగ్‌స్టర్ తన ఆగమనాన్ని చాటే పంచ్ విసిరాడు. ఆ దెబ్బకు ప్రత్యర్థి నేలకూలాడు. తిరిగి లేచి నిలబడే ఓపిక అతడిలో లేకపోయింది. దీంతో రిఫరీ వచ్చి సదరు యువకుడిని విజేతగా ప్రకటించాడు. అలా తొలిసారి వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌షిప్ గెలిచిన ఆ సింహబలుడు మరెవరో కాదు.. మైక్ టైసన్! అద్భుత విజయాలతో.. అదిరే పంచ్‌లతో ఐరన్ మైక్, కిడ్ డైనమైట్ అని అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకున్న అమెరికా ప్రొఫెషనల్ బాక్సర్. 1966లో న్యూయార్క్ జన్మించిన మైక్ టైసన్.. తండ్రి ప్రేమలేక.. నిరాదరణకు గురికావడంతో వీధి గుండాలతో సావాసం చేశాడు. విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడేవాడు. అలా.. టీనేజ్‌లో ఉండగానే ఏకంగా 38 సార్లు అరెస్టైన టైసన్.. అక్కడి జైలర్ చలవతో బాకింగ్స్ వైపు అడుగులేశాడు. ఆ తర్వాత కస్ డి అమాటో అనే వ్యక్తి మార్గదర్శనంలో తనలోని ప్రతిభకు పదునుపెట్టి చాంపియన్‌గా ఎదిగాడు. బీస్ట్‌లా ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ కెరీర్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాడు. రెండు దశాబ్దాలపాటు బాక్సింగ్ ప్రపంచాన్ని ఏలి.. అందరికీ ఫేవరెట్‌గా మారిపోయాడు. Mike Tyson in his prime, was not a human pic.twitter.com/6uUM3RO3b8 — Weird History (@theuntoIdsecret) February 12, 2024 అయితే, తనలోని చీకటి కోణాన్ని వదల్లేక.. అత్యాచారాలు, వివాహేతర సంబంధాలతో రచ్చకెక్కడం అతడి జీవితంపై మాయని మచ్చల్లా మిగిలిపోయాయి. ఇక బాక్సర్‌గానే నటుడిగానూ పలు అమెరికన్ టీవీ సిరీస్‌లో నటించిన మైక్ టైసన్.. తెలుగు సినిమా లైగర్‌లోనూ మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది!! Mike Tyson in his prime was a beast....like nobody else. pic.twitter.com/qWgNQY4fDo — floridanow1 (@floridanow1) February 16, 2024 ఇక తన కెరీర్లో మొత్తంగా ఆరు వరల్డ్ హెవీ బాక్సింగ్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలిచిన మైక్ టైసన్.. 57 ఏళ్ల వయసులోనూ తనలోని పస తగ్గలేదన్నట్లుగా పంచ్‌లు విసురుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి! Mike Tyson training at 57 years old and he still got it pic.twitter.com/z6XeoneEon — Historic Vids (@historyinmemes) February 16, 2024 -
‘రాననుకున్నారా! రాలేననుకున్నారా!!’
‘రాననుకున్నారా! రాలేననుకున్నారా!!’ అనే సీన్మా డైలాగ్‌ను విజేందర్‌సింగ్ విషయంలో భేషుగ్గా వాడుకోవచ్చు. 2019 తరువాత ఈ ప్రొఫెషనల్ బాక్సర్ మళ్లీ రింగ్‌లోకి దిగుతున్నాడు. రష్యన్ బాక్సర్ లొప్సన్తో తలపడబోతున్నాడు. ఈసారి ప్రత్యేకత షిప్. గోవా మాండవి నదిలో మెజిస్టిక్ ప్రైడ్ క్యాసీనో షిప్ పై భాగంలో ఎల్లుండి జరిగే ఈ బౌట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.... ఇప్పుడిప్పుడే రింగ్‌లో బుడిబుడి అడుగులు వేస్తున్న బాక్సర్లతో పాటు, బాలీవుడ్ సినిమాలలో బాక్సర్ వేషాలు వేయాలనుకునే నటులకు కూడా విజేందర్ రోల్‌మోడల్. యువ నటుడు అక్షయ్ ఒబెరాయ్‌కి ఒక సినిమా కోసం బాక్సర్ ఫిజిక్ కావల్సి వచ్చింది. దీని కోసం లోకల్ ట్రైనర్‌ను సంప్రదిస్తే ‘విజేందర్ సింగ్ డైట్’ సూచించాడు. అక్షరాల ఆ డైట్‌ను పాటించి అద్భుత ఫలితాన్ని సాధించాడు ఆ నటుడు. ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అపురూపమైన విజయాలు సాధించిన ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్‌సింగ్ బెనివాల్ రకరకాల సందర్భాల్లో వ్యక్తిత్వవికాసం, ఫిట్‌నెస్‌కు సంబంధించి చెప్పిన విషయాలు కొన్ని ఆయన మాటల్లోనే... ►నాన్న బస్సు డ్రైవర్(హరియాణాలో) ఆదాయం అంతంత మాత్రమే. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని ఆయనకు ఉండేది. నాకేమో బాక్సింగ్ అంటే ఇష్టం పెరిగింది. బాక్సింగ్‌లో నాకు ఓనమాలు దిద్దించిన తొలి గురువు మా అన్న మనోజ్. ‘మనకెందుకు బాక్సింగ్. బాగా చదువుకో’ అని నాన్న అనేవారు. ‘బాక్సింగ్ వద్దు క్రికెట్ నేర్చుకో’ అని కొందరు సలహా ఇచ్చేవారు. అయితే నేనేమీ లెక్కలు వేసుకోలేదు. బాక్సింగ్‌పై గట్టిగా మనసు పెట్టాను. బాక్సింగ్ సాధన చేస్తున్నప్పుడు గోడలపై కనిపించే ‘నో గట్స్ నో గ్లోరీ’ ‘నో పెయిన్, నో గెయిన్’లాంటి వాక్యాలు ఉత్తేజపరిచేవి. ►కష్టపడేతత్వం, క్రమశిక్షణ...ఇవి ఫిట్‌నెస్‌కు కీలకమైనవి. స్ట్రెచెస్, వామప్స్...ఇలా రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు వర్కవుట్లు చేస్తాను. బాడీ చురుగ్గా లేకపోతే, రోటిన్ బోర్ అనిపిస్తే స్కిప్కింగ్ చేస్తాను. దీన్ని ఎంజాయ్ చేస్తాను. ట్రెడ్మిల్ అనేది నా కోసం కాదు అనుకుంటాను. బహిరంగ ప్రదేశాలలో పరుగెత్తడానిక బాగా ఇష్టపడతాను. బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్లు, సీజనల్ పండ్లు తీసుకుంటాను. లంచ్, డిన్నర్లలో రొట్టే, సబ్జీ, అన్నం, పప్పు, సాయంత్రం పాలు తీసుకుంటాను. రోజూ 4 నుంచి 5 లీటర్ల నీరు తాగు తాను. క్యాంప్‌లో మాత్రం నా డైట్ ప్రత్యేకంగా ఉంటుంది. గుడ్లు, ప్రొటిన్షేక్, చేపలు, చికెన్, బ్రౌన్‌రైస్...మొదలైనవి తీసుకుంటాను. స్వీట్లు తినడం నా బలహీనత, అయితే క్యాంప్‌లో ఉన్నప్పుడు వాటి గురించి కనీసం ఆలోచించను. మంచి ఫిట్‌నెస్‌కు మంచి నిద్ర కావాలి. ప్రతికూల ఆలోచనలను మనసులో నుంచి తీసేసి ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటే శరీరం మన మాట వింటుంది. పంజాబీ సంగీతం విని రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతాను. ►బాక్సర్ శారీరకంగానే కాదు మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. రోజూ 30 నుంచి 50 నిమిషాల పాటు ధ్యానం చేస్తాను. ధ్యానం అనేది మనలోని అహాన్ని చంపేస్తుంది. గెలవగానే గెలుపు మైకంలో ‘నేనే గొప్ప’ అనే భ్రాంతి తప్ప ఏదీ కనిపించదు. నేను గెలిచినప్పుడు ‘గెలిచాను. ఓకే. దీన్ని నా మనసు నుంచి తీసేస్తున్నాను’ అనుకుంటాను. ఓడినప్పుడు ‘ఓడిపోయాను. దీన్ని నా మనసు నుంచి తీసేస్తున్నాను’ అనుకుంటాను. ‘నీ హృదయం యవ్వనమయమైతే వయసు అనేది సంఖ్య మాత్రమే అవుతుంది’ గురుదాస్ మాన్ పాటను తరచుగా గుర్తు చేసుకుంటాను. ►నేను నెంబర్‌వన్‌గా ఉండవచ్చు, ఉండక పోవచ్చు. కానీ ఎంత కష్టపడ్డామన్నదే నాకు ముఖ్యం. కలలు కనడం ఎంత మాత్రం తప్పు కాదు. అయితే అవి గాలిమేడలు కాకూడదు. ఎప్పుడూ వాస్తవం అనే పునాది మీదే మన పాదాలు ఉండాలి. ‘రాత్రికే రాత్రి విజయం నా సొంతం కావాలి’ అనుకునేవారు ఫీల్డ్‌లో నిలవ లేరు. స్టెప్–బై–స్టెప్ మాత్రమే ఏదైనా సాధించగలం. -
నేడు విజేందర్ డబ్ల్యుబీవో టైటిల్ బౌట్
తొలిసారిగా భారత్‌లో బరిలోకి న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన అనంతరం విజేందర్ సింగ్ తొలిసారిగా స్వదేశంలో బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటిదాకా తలపడిన ఆరు బౌట్లలో ఓటమనేది లేకుండా దూసుకెళుతున్న ఈ స్టార్ నేడు (శనివారం) జరిగే డబ్ల్యుబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ బెల్ట్ కోసం పోటీపడనున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ హోప్ తన ప్రత్యర్థి. ‘ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఆరేళ్ల అనంతరం ఢిల్లీలో పోటీకి దిగుతున్నాను. చివరిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నాను. నా శిక్షణ చాలా కఠినంగానే సాగింది. హోప్‌పై విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇందులో నెగ్గితే డబ్ల్యుబీవో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-15లో ఉంటాను. దీంతో ప్రపంచ టైటిళ్ల కోసం పోటీపడే అర్హత దక్కుతుంది’ అని 30 ఏళ్ల విజేందర్ తెలిపారు. త్యాగరాజ స్టేడియంలో జరిగే ఈ ఫైట్‌ను తిలకించేందుకు క్రీడా ప్రముఖులతో పాటు రాజకీయ, సినీ రంగానికి చెందినవారు కూడా హాజరుకానున్నారు. అలాగే ఈ ఫైట్‌కు ముందు మరో ఏడు ఇతర బౌట్స్ జరుగుతాయి. రా. గం. 7.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రొ బాక్సింగ్‌ను అభివృద్ధి చేస్తా..
విజేందర్ సింగ్ న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారి సత్తా చూపిస్తున్న విజేందర్ సింగ్ భారత్‌లోనూ ఈ తరహా ఆటను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాడు. దీంట్లో భాగంగా కేంద్ర క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్‌ను శుక్రవారం విజేందర్ కలిశాడు. ‘నా ప్రొఫెషనల్ కెరీర్‌కు ఎంతగానో మద్దతు ఇచ్చిన మంత్రిగారికి కృతజ్ఞతలు తెలిపాను. భవిష్యత్‌లోనూ నాకు ఇలాగే తోడ్పడుతానని చెప్పారు. అలాగే భారత్‌లోనూ ప్రొ బాక్సింగ్‌ను అభివృద్ధి చేసే ప్రణాళికల గురించి చర్చించాను. ఈ విషయంలో ఆయన చాలా సానుకూలంగా స్పందించడం సంతోషాన్నిచ్చింది. అమెచ్యూర్ కెరీర్లో ఉన్న బాక్సర్లు ముందుకు వచ్చి ప్రొగా మారితే వారి భవిష్యత్ బాగుంటుంది. ఈ విషయంలో వారికి నా మద్దతు ఉంటుంది. అలాగే భారత్‌లో అమెచ్యూర్ బాక్సింగ్ పరిస్థితి గురించి నా ఆందోళన మంత్రికి తెలిపాను. రియో ఒలింపిక్స్‌కు వారు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు’ అని విజేందర్ తెలిపాడు.