పోలీసుల అదుపులో ఆ ముగ్గురు?
సాక్షి, నిజామాబాద్: ఎట్టకేలకు నిషేధిత క్లోరోహైడ్రేట్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిని హైదరాబాద్‌లో మూడు ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నాయి. నేడో, రేపో విచారించి రిమాండ్‌కు పంపనున్నట్లు సమాచారం. నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ వద్ద గత కొన్ని రోజులుగా గుజరాత్ నుంచి వస్తున్న క్లోరోహైడ్రేట్‌ను పక్కా సమాచారంతో ప్రత్యేక పోలీసులు పట్టుకున్నారు. అనంతరం టాటా ఏసీలో క్లోరోహైడ్రేట్ సంచులను ఎక్కించే క్రమంలో పోలీసులు రావడంతో దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. దీంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
ఉమ్మడి జిల్లాకు చెందినవారే..
నగర శివారులోని మాధవనగర్ వద్ద పట్టుకున్న క్లోరోహైడ్రేట్ వెనుక పెద్ద అక్రమ దందా కొనసాగుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు పట్టుపడిన నిషేధిత పదార్ధాల సరఫరా నిజామాబా ద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ముగ్గురు వ్యక్తు లు కొనసాగిస్తున్న పోలీసులు అనుమానిస్తున్నా రు. స్పెషల్ పోలీసులు రహస్యంగా విచా రణ చేస్తున్నారు. కల్లులో కలిపే ఈ పదార్థం నిజామాబాబాద్ నుంచే ఉత్తర తెలంగాణకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. గుజరాత్ నుంచి జిల్లా కేంద్రానికి తీసుకువస్తుండగా స్పెషల్ పోలీసు లు, స్థానిక పోలీసులతో కలసి వల పన్ని పట్టుకున్నారు. రూ.లక్షలాదిగా విలువ చేసే ఈ నిషేధిత పదార్థాన్ని లారీలో తెస్తూ పోలీసులకు దొ రికిపోయారు. ప్రస్తుతం లారీ డ్రైవర్‌తో పాటు టాటా ఏసీ డ్రైవర్, మరో ఇద్దరిని పోలీసు లు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
రహస్య ప్రాంతంలో విచారణ..
నిషేధిత పదార్థాల అక్రమ సరఫరా చేస్తున్న ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు. వారు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొడ నియోజకవర్గానికి చెందినవారు ఇద్దరు, కామారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు ఉన్నట్లు తెలిసింది. వీరు కొంత కాలంగా గుజరాత్ నుంచి నిషేధిత పదార్థం తెచ్చి ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. కొనేళ్లుగా రూ.కోట్లాదిగా వెనుకేసుకుంటున్నారు. ప్రస్తు తం వీరు ఎక్కడ ఉన్నారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. నగరంలోని ముబారక్‌నగర్‌లో ఓ రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. టాటా ఏసీ డ్రైవర్ వద్ద సమాచారం, ఫోన్ నెంబర్‌తో విచారణ చేపట్టారు. కామారెడ్డికి చెందిన నిందితుడి కుమారుడిని విచారించగా మరికొంత సమాచారం రా బట్టారు. దీంతో పోలీసులు ముగ్గురిని వల పన్ని పట్టుకున్నారు. అనంతరం వీరితో గుజరాత్ నుంచి నిజామాబాద్‌కు క్లోరోహైడ్రేట్ ఎప్పటి నుంచి తెస్తున్నారు, ఏ ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి వ్యక్తులందరిని విచారించి అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రత్యేక పోలీసు బృందం గుజరాత్ వెళ్లి విచారించనుంది.