Prop Tiger
-
ఐదు పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు డౌన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద 8 శాతం పెరిగాయి. కానీ, విడిగా చూస్తే హైదరాబాద్ సహా ఐదు మార్కెట్లలో అమ్మకాలు పడిపోగా, కేవలం మూడు పట్టణాల్లో విక్రయాలు గణనీయంగా పెరిగాయి. దీంతో మొత్తంమీద ఎనిమిది మార్కెట్లలో కలసి అమ్మకాలు 8 శాతం పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 3 శాతం తగ్గాయి. ఈ వివరాలను ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ వెల్లడించింది. ఈ ఎనిమిది పెద్ద పట్టణాల్లో ఏప్రిల్–జూన్ కాలంలో 80,250 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 74,320 యూనిట్లుగా ఉన్నాయి. ‘రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్ ఏప్రిల్–జూన్ 2023’ నివేదికను ప్రాప్‌టైగర్ బుధవారం విడుదల చేసింది. ప్రధానంగా ముంబై, పుణె, అహ్మదాబాద్‌లో ఇళ్ల విక్రయాలు పెరగ్గా, హైదరాబాద్‌తోపాటు చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లో తగ్గాయి. ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడం కొనుగోళ్ల పరంగా బలమైన సానుకూల సెంటిమెంట్‌కు దారితీసిందని ఆర్‌ఈఏ ఇండియా గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ పేర్కొన్నారు. ప్రాప్‌టైగర్, హసింగ్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్ ఇవన్నీ కూడా ఆర్‌ఈఏ ఇండియా కిందే ఉన్నాయి. గత రెండేళ్లలో ఇళ్ల అమ్మకాల వృద్ధికి కరోనా సమయంలో నిలిచిన డిమాండ్ తోడు కావడం, ఇల్లు కలిగి ఉండాలనే ఆకాంక్ష, కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధానం ఇవన్నీ కారణాలుగా ప్రాప్‌టైగర్ నివేదిక వివరించింది. పట్టణాల వారీగా విక్రయాలు.. ► హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 7,680 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 7,910 యూనిట్లతో పోలిస్తే 3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ► అహ్మదాబాద్ మార్కెట్లో అమ్మకాలు 17 శాతం పెరిగి 8,450 యూనిట్లుగా ఉన్నాయి. ► బెంగళూరులో విక్రయాల పరంగా 19 శాతం క్షీణత కనిపించింది. 6,790 యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారు. ► చెన్నైలో అమ్మకాలు 5 శాతం తగ్గి 3,050 యూనిట్లుగా ఉన్నాయి. ► కోల్‌కతాలో 40 శాతం తగ్గి 1,940 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఇళ్ల అమ్మకాలు 16 శాతం వృద్ధితో 30,260 యూనిట్లకు చేరాయి. ► పుణెలోనూ 37 శాతం అధికంగా 18,850 యూనిట్లు అమ్ముడుపోయాయి. -
లబోదిబో.. హైదరాబాద్‌లో పెరిగిపోతున్న అమ్ముడు పోని ఇళ్లు
న్యూఢిల్లీ: ప్రాపర్టీ డెవలపర్ల వద్ద అమ్ముడుపోని ఇళ్లు భారీగా ఉండిపోయాయి. సెప్టెంబర్ త్రైమాసికం చివరికి హైదరాబాద్ మార్కెట్లో 99,090 యూనిట్లు మిగిలిపోయాయి. ఇవి అమ్ముడుపోవడానికి 41 నెలల సమయం తీసుకుంటుందని అంచనా. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇలా విక్రయం కాకుండా ఉండిపోయిన ఇళ్ల యూనిట్లు 7.85 లక్షలుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత అమ్మకాల తీరు ఆధారంగా చూస్తే, మిగిలిపోయిన 7.85 లక్షల ఇళ్లు విక్రయం కావడానికి 32 నెలలు పట్టొచ్చని పేర్కొంది. ‘‘ఢిల్లీ–ఎన్సీఆర్ మార్కెట్లో 1,00,770 ఇళ్ల యూనిట్లు ఉండిపోయాయి. ఇక్కడ ఆమ్రపాలి, జైపీ ఇన్ఫ్రాటెక్, యూనిటెక్ వంటి పెద్ద రియల్టీ సంస్థలు దివాలా తీయడంతో మిగిలిన ఇళ్ల యూనిట్లు పూర్తిగా అమ్ముడుపోవడానికి 62 నెలల వరకు సమయం పట్టొచ్చు’’అని ప్రాప్‌టైగర్ తెలిపింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం 2022 జూన్ నాటికి మిగిలిపోయిన ఇళ్లు 7,63,650గా ఉంటే, సెప్టెంబర్ చివరికి 7,85,260 యూనిట్లకు నిల్వలు పెరిగాయి. ఇందులో 21 శాతం ఇళ్లు ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణె నగరాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి. పట్టణాల వారీగా.. ►ఈ ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెప్టెంబర్ కాలంలో 49 శాతం పెరిగి 83,220 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 55,910 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ►కోల్‌కతాలో అతి తక్కువగా ఇళ్ల నిల్వలు ఉన్నాయి. ఇక్కడ 22,530 ఇళ్ల యూనిట్లు మిగిలిపోగా, వీటి విక్రయానికి 24 నెలల సమయం పట్టొచ్చని ప్రాప్ టైగర్ అంచనా వేసింది. ► అహ్మదాబాద్‌లో 65,160 యూనిట్లు ఉండగా, ఇవి పూర్తిగా అమ్ముడుపోవడానికి 30 నెలల సమయం తీసుకోవచ్చు. ►బెంగళూరులో 77,260 యూనిట్లు మిగిలి ఉన్నాయి. వీటి అమ్మకానికి 28 నెలలు తీసుకోవచ్చు. ►చెన్నైలో 32,810 యూనిట్లుగా ఉంటే, వీటి అమ్మకానికి 27 నెలల సమయం తీసుకోవచ్చని అంచనా. ► ఇక ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 2,72,960 యూనిట్ల ఇళ్లు మిగిలిపోయాయి. వీటి అమ్మకానికి 33 నెలల సమయం పడుతుందని అంచనా. ► పుణెలో ఉన్న 1,15,310 మిగులు ఇళ్ల అమ్మకానికి 22 నెలలు సమయం తీసుకుంటుంది. ►అమ్ముడుపోని ఇళ్ల ఇన్వెంటరీ కాలం జూన్–జూలైలో 44 నెలలుగా ఉంటే, జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 32 నెలలకు తగ్గడాన్ని ప్రాప్‌టైగర్ ప్రధానంగా ప్రస్తావించింది. హౌసింగ్ డిమాండ్ పుంజుకోవడం ఇందుకు మద్దతుగా పేర్కొంది. చదవండి👉 లగ్జరీ ఇళ్ల కొనుగోలు కోసం ఎగబడుతున్న భారతీయులు! -
పెరిగిపోతున్న అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య, హైదరాబాద్‌లో ఎన్ని గృహాలు ఉన్నాయంటే!
సాక్షి, హైదరాబాద్: దేశంలో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) పెరిగింది. 2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి ఇన్వెంటరీ 4% మేర పెరిగిందని ప్రాప్‌టైగర్.కామ్ సర్వేలో తేలింది. గతేడాది మార్చి నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 7,05,344 గృహాల ఇన్వెంటరీ ఉండగా..ఈ ఏడాది మార్చి నాటికి 7,35,852కి పెరిగిందని తెలిపింది. ఇన్వెంటరీ అత్యధికంగా ముంబైలో 35% ఉండగా.. పుణేలో 16% మేర ఉన్నాయి. కాగా.. గృహాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గతేడాది ఇన్వెంటరీ విక్రయానికి 47 నెలల సమయం పట్టగా.. ఈ ఏడాది మార్చి ఇన్వెంటరీకి 42 నెలల సమయం పడుతుంది. నగరాల వారీగా అమ్ముడుపోకుండా ఉన్న గృహాల సంఖ్యను చూస్తే.. హైదరాబాద్‌లో 73,651 యూనిట్లున్నాయి. వీటి విక్రయానికి 42 నెలల సమయం పడుతుంది. అహ్మదాబాద్‌లో 62,602 గృహాలు, బెంగళూరులో 66,151, చెన్నైలో 34,059, ఢిల్లీ–ఎన్సీఆర్లో 1,01,404, కోల్‌కతాలో 23,850, ముంబైలో 2,55,814 గృహాల ఇన్వెంటరీ ఉంది. చదవండి: లబోదిబో! హైదరాబాద్‌లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే! -
రియల్ బూమ్ జోర్దార్, దేశంలోనే కాస్ట్లీ సిటీగా హైదరాబాద్
హైదరాబాద్ లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో దేశంలో అంత్యత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు ముంబై తరువాత ఇళ్లు, ప్లాట్ల ధరలు హైదరాబాద్‌లో ధరలు అధికంగా ఉన్నాయి. వాస్తవానికి కరోనా తరువాత దేశంలో అన్ని రాష్ట్రాల్లో రియాల్టీ రంగం నిలకడగా కొనసాగుతుంటే.. ఒక్క హైదరాబాద్‌లో మాత్రం రాకెట్ వేగంతో దూసుకెళ్తుందని రియల్ ఎస్టేట్ సంస్థ ప్రాప్ టైగర్ చేసిన అధ్యయనంలో తేలింది. సొంతింటి అవసరాన్ని పెంచిన కరోనా దేశంలో కరోనా తరువాత రియల్ రంగం ఏ విధంగా ఉందనే అంశంపై ప్రాప్ టైగర్ సంస్థ సర్వే చేసింది. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకు మూడో త్రైమాసికానికి సంబంధించిన నివేదిక ఆధారంగా రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ అధ్యయనంలో పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత తలెల్తిన ఆర్ధిక మాంధ్యం ఇవేవి చాలవన్నట్లు కరోనా వంటి పరిణామాలతో రియల్ రంగం కుదేలైందని ప్రాప్ టైగర్ సంస్థ తెలిపింది. కానీ కరోనా తరువాత మాత్రం అదుపులోకి వచ్చిందని ప్రాప్ టైగర్ సంస్థ బిజినెస్ హెచ్ రంజన్ సూద్ తెలిపారు. కరోనాతో ప్రతి ఒక్కరికి సొంతింటి అవసరం పెరిగిందన్నారు. అందుకే ధరలు, పెరుగుదలలో దేశంలోని 8 మెట్రో పాలిటన్ నగరాల కంటే హైదరాబాద్ ముందజలో ఉందని అన్నారు. ధరల విషయానికొస్తే దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ఇళ్లు, ఫ్లాట్ల ధరలను ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకు గల మూడో త్రైమాసికాన్ని పరిశీలిస్తే.. నగరం సాధారణ ధర చదరపు అడుగుకు పెరుగుదల శాతం ముంబై రూ.9600 నుంచి రూ.9800 3 హైదరాబాద్ రూ.5800 నుంచి రూ.6000 6 బెంగళూర్ రూ.5400 నుంచి రూ.5600 4 చెన్నై రూ.5300 నుంచి రూ.5500 3 పూణె రూ.5000 నుంచి రూ.5200 4 ఢిల్లీ రూ.4300 నుంచి రూ.4500 5 కోల్ కత్తా రూ.4100 నుంచొ 4300 2 అహ్మదాబాద్ రూ.3300 నుంచి రూ.3500 8 ఆయా ప్రాంతాల ధరల్ని బట్టి హైదరాబాద్‌లో ఇళ్లు, ఫ్లాట్ల ధరల పెరుగుదల కూడా గణనీయంగా ఉంది. ఎనిమిది శాతం పెరుగుదలతో అహ్మదాబాద్ మొదటి స్థానంలో ఉండగా 6శాతం పెరుగుదలతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. చదవండి: రికార్డ్ సేల్స్: అపార్ట్మెంట్లా.. హాట్ కేకులా..! -
డిమాండ్ తగ్గింది, దేశంలో 76% పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని వదలట్లేదు. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ2)లో గృహ విక్రయాలు 76 శాతం క్షీణించాయి. జనవరి–మార్చి (క్యూ1)లో 66,176 యూనిట్లు అమ్ముడుపోగా.. క్యూ2 నాటికి 15,968 యూనిట్లకు తగ్గాయని హౌసింగ్ బ్రోకరేజ్ కంపెనీ ప్రాప్‌టైగర్ ‘రియల్ ఇన్సైట్’ రిపోర్ట్ తెలిపింది. గతేడాది క్యూ2తో పోలిస్తే 16 శాతం తగ్గుదల కనిపించిందని పేర్కొంది. త్రైమాసికం ప్రాతిపదికన దేశంలోని అన్ని ప్రధాన నగరాలల్లో హౌసింగ్ సేల్స్ తగ్గగా.. వార్షిక లెక్కన మాత్రం కొన్ని నగరాలల్లో వృద్ధి నమోదయిందని ప్రాప్‌టైగర్ గ్రూప్ సీఈఓ ధ్రవ్ అగర్వాల్ తెలిపారు. హైదరాబాద్‌లో 2021 క్యూ1లో 7,721 గృహాలు అమ్ముడుపోగా.. క్యూ2 నాటికి 2,429 యూనిట్లకు, అలాగే అహ్మదాబాద్‌లో 4,687 నుంచి 1,282లకు, బెంగళూరులో 7,431 నుంచి 1,591లకు , ఢిల్లీ–ఎన్సీఆర్లో 6,188 నుంచి 2,828లకు, చెన్నైలో 4,468 నుంచి 709లకు, కోల్‌కతాలో 3,382 నుంచి 1,253లకు, ముంబైలో 18,574 నుంచి 3,381లకు, పుణేలో 13,725 నుంచి 2,495 యూనిట్లకు పడిపోయాయి. ఈ ఏడాది క్యూ2లో చాలా వరకు రాష్ట్రాలు వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించడం, ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో గృహాల సరఫరా, డిమాండ్ రెండింట్లోనూ ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ పరిమితులను ఎత్తివేయటం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటంతో జూన్ ప్రారంభం నుంచి విక్రయాలలో కదలిక మొదలైందని ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. -
గృహమస్తు! ఊపందుకున్న క్రయవిక్రయాలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ఇళ్ల క్రయ విక్రయాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు నెలవుగా మారిన మహానగర పరిధిలో సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు వేతన జీవులు, మధ్యతరగతి వర్గంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన సగటు జీవులు సైతం ముందుంటున్నారు. ఈ పరిణామంతో నగర శివార్లలో స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రముఖ స్థిరాస్తి అంచనా సంస్థ ప్రాప్ టైగర్ తాజా అధ్యయనంలోనూ ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో నగరంలో ఇళ్లు ,ఫ్లాట్ల అమ్మకాల్లో వృద్ధి 38 శాతం మేర నమోదైనట్లు ఈ అధ్యయనంలో తేలింది. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో అమ్మకాలు 5 శాతం క్షీణించగా.. ఆయా సిటీలతో పోలిస్తే గ్రేటర్లో పరిస్థితి ఆశాజనకంగా ఉన్నట్లు స్పష్టమైంది. కల.. నెరవేరుతోందిలా.. ♦ ప్రధానంగా మహేశ్వరం, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో ఇళ్ల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఔటర్‌రింగ్ రోడ్డు లోపలున్న 190 గ్రామాలు, 10కిపైగా ఉన్న నగరపాలక సంస్థల పరిధిలో స్వతంత్ర గృహాలు, విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ♦ జనవరి-మార్చి మధ్యకాలంలో ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లను పరిశీలిస్తే.. సుమారు 7,721 గృహాల కొనుగోళ్లు జరిగినట్లు ప్రాప్ టైగర్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది జనవరి– మార్చి మధ్యకాలంలో కేవలం 5,554 అమ్మకాలే జరిగినట్లు ఈ నివేదిక తెలిపింది. కొనుగోళ్లు తగ్గలేదు: ప్రస్తుతం సిమెంటు, స్టీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ తదితర నిర్మాణరంగ మెటీరియల్ ధరలు 30 శాతం పెరిగాయి. దీంతో ఇళ్ల ధరలు సైతం అనివార్యంగా 15-20 శాతం పెరిగాయి. అయినా ఇళ్ల నిర్మాణాలు, కొనుగోళ్లు తగ్గడంలేదు.- రాంరెడ్డి, క్రెడాయ్ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు మధ్యతరగతికి అందుబాటులో: మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో నిర్మిస్తున్న స్వతంత్ర గృహాలకు ఇటీవల కాలంలో డిమాండ్ బాగా పెరిగింది. ధరలు మధ్యతరగతికి అందుబాటులో ఉన్నాయి. – వి.ప్రవీణ్‌రెడ్డి, మైత్రీ కన్స్ట్రక్షన్స్ ఎండీ -
అనిశ్చితిలో రియల్టీ
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్టీ రంగం గడ్డు పరిస్థితుల్లో కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో గృహాల అమ్మకాలు, ప్రారంభాలు రెండింట్లోనూ క్షీణత నమోదైంది. జులై – సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రాజెక్ట్‌ల లాచింగ్స్ 45 శాతం, అమ్మకాల్లో 25 శాతం తగ్గాయని ప్రాప్ టైగర్ నివేదిక తెలిపింది. ఇదే ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చినా సరే ప్రారంభాల్లో 32 శాతం, విక్రయాల్లో 23 శాతం క్షీణత నమోదైందని పేర్కొంది. 6 నెలల కాలంతో పోల్చినా క్షీణతే.. 2018–19 ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 170,715 గృహాలు విక్రయం కాగా.. 2019–20 ఆర్ధిక సంవత్సరం నాటికి 151,764 మాత్రమే అమ్ముడుపోయాయి. ఇక, గత ఫైనాన్షియల్ ఇయర్ తొలి అర్ధ వార్షికంలో కొత్తగా 137,146 యూనిట్లు లాంచింగ్స్ కాగా.. ఈ ఆర్ధికం నాటికి 83,662 యూనిట్లకు పడిపోయాయి. అంటే 6 నెలల కాలానికి చూసినా అమ్మకాల్లో 11 శాతం, లాంచింగ్స్‌లో 39 శాతం క్షీణత కనిపించింది. ముంబై, పుణె నగరాల్లో జోష్.. 2018–19 ఆర్ధిక సంవత్సరం జులై – సెప్టెంబర్‌లో 61,679 గృహాలు ప్రారంభం కాగా.. 2019–20 ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో 33,883 యూనిట్లు మాత్రమే లాంచింగ్స్ అయ్యాయి. ఇందులో 41 శాతం గృహాలు రూ.45 లక్షల లోపు ధర ఉండే అఫడబుల్ గృహాలే. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అత్యధికంగా యూనిట్లు ప్రారంభమైంది పుణేలోనే. ఇక్కడ 10,425 గృహాలు లాంచింగ్స్ అయ్యాయి. ఆ తర్వాత ముంబైలో 8,132 యూనిట్లు స్టార్ట్ అయ్యాయి. 2018–19 ఆర్ధికం జులై – సెప్టెంబర్ కాలంలో 65,799 గృహాలు అమ్ముడుపోగా.. 2019–20 నాటికి 88,078 యూనిట్లకు తగ్గాయి. ముంబైలో అత్యధికంగా 21,985 గృహాలు అమ్ముడుపోగా, పుణెలో 13,644 యూనిట్లు విక్రయమయ్యాయి. హైదరాబాద్‌లో ధరలు 15 శాతం జంప్.. గతేడాదితో పోలిస్తే దేశంలో ఇన్వెంటరీ గృహాలు 13 శాతం తగ్గాయి. ప్రస్తుతం తొమ్మిది ప్రధాన నగరాల్లో ఇన్వెంటరీ 778,627లుగా ఉంది. గుర్గావ్, చెన్నై మినహా అన్ని నగరాల్లో స్థిరాస్తి ధరల్లో వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్ ధరల్లో 15 శాతం వృద్ధి కనిపించింది. -
ప్రాప్‌టైగర్‌లో హౌసింగ్‌డాట్‌కామ్ విలీనం
55 మిలియన్ డాలర్ల సమీకరణలో కొత్త సంస్థ న్యూఢిల్లీ: ఆన్లైన్ రియల్ ఎస్టేట్ సర్వీసుల రంగంలో మరో కన్సాలిడేషన్ డీల్‌కు తెరతీస్తూ ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్, హౌసింగ్‌డాట్‌కామ్ సంస్థలు విలీనం కానున్నాయి. తద్వారా దేశీయంగా అతి పెద్ద ఆన్లైన్ రియల్టీ సేవల సంస్థ ఆవిర్భవించనుంది. ఇది వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం 55 మిలియన్ డాలర్లు సమీకరించనుంది. ప్రాప్టైగర్డాట్కామ్కు న్యూస్ కార్ప్ సంస్థ, హౌసింగ్‌డాట్‌కామ్‌కు సాఫ్ట్‌బ్యాంక్ దన్ను ఉన్న సంగతి తెలిసిందే. డీల్ ప్రకారం విలీనానంతరం సంయుక్త సంస్థలో ఆస్ట్రేలియాకి చెందిన ఆర్‌ఈఏ గ్రూప్ 50 మిలియన్ డాలర్లు, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ 5 మి. డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ప్రాప్‌టైగర్ సహవ్యవస్థాపకుడు ధృవ్ అగర్వాలా ..కొత్త సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తారు. మరోవైపు హౌసింగ్‌డాట్‌కామ్ ప్రస్తుత సీఈవో జేసన్ కొఠారి పక్కకు వైదొలగనున్నారు. విలీన కంపెనీ బోర్డులో ఆర్‌ఈఏ, సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధులకు చోటు దక్కనుంది. కార్యకలాపాల విస్తరణకు నిధులు.. భారత ఇంటర్నెట్ రంగంలో ఇతరత్రా వ్యాపార అవకాశాలపై ఆయన దృష్టి పెట్టనున్నట్లు ఇరు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. రెండు సంస్థల షేర్హోల్డర్లు.. కొత్త కంపెనీలో వాటాదారులుగా ఉంటారని అగర్వాలా పేర్కొన్నారు. తాజాగా సమీకరిస్తున్న 55 మి.డాలర్ల నిధులను.. కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీ, బ్రాండింగ్‌లపై వెచ్చించనున్నట్లు చెప్పారు. రెండు సంస్థల కథ.. 2011లో ప్రారంభమైన ప్రాప్‌టైగర్ 1.5 బిలియన్ డాలర్ల విలువ చేసే లావాదేవీలు పూర్తి చేసింది. 2015లో మకాన్‌డాట్‌కామ్‌ను కొనుగోలు చేసింది. మరోవైపు ఆన్లైన్లో గృహాల క్రయ, విక్రయ లావాదేవీలకు తోడ్పాటునిచ్చే హౌసింగ్‌డాట్‌కామ్ వెబ్‌సైట్‌కు ప్రతి నెలా దాదాపు 40 లక్షల విజిట్స్ ఉంటున్నాయని అంచనా. బాధ్యతారాహిత్య కారణాలపై 2015 జులైలో సహవ్యవస్థాపకుడు రాహుల్ యాదవ్‌ను సీఈవోగా తొలగించిన హౌసింగ్‌డాట్‌కామ్ బోర్డు.. నవంబర్‌లో ఆ హోదాలో జేసన్ కొఠారీని నియమించింది. -
ప్రాప్‌టైగర్ చేతికి మకాన్‌డాట్‌కామ్
న్యూఢిల్లీ : దేశీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్థానం పటిష్టం చేసుకునే దిశగా రియల్ ఎస్టేట్ పోర్టల్ ప్రాప్‌టైగర్ పోటీ సంస్థ మకాన్‌డాట్‌కామ్‌ను కొనుగోలు చేసింది. అయితే దీనికోసం ఎంత వెచ్చించినదీ ప్రాప్‌టైగర్ సహ వ్యవస్థాపకుడు ధృవ్ అగర్వాలా వెల్లడించలేదు. ఇందుకోసం కొత్తగా నిధులేమీ సమీకరించలేదని తెలిపారు. రీసేల్ మార్కెట్లో గట్టి పట్టు ఉన్నందున మకాన్‌డాట్‌కామ్‌ను కొన్నట్లు ఆయన వివరించారు. ఈ రెండు పోర్టల్స్ ఇకపై కూడా వేర్వేరుగానే కొనసాగుతాయని ప్రాప్‌టైగర్ మాతృ సంస్థ ఎలార టెక్నాలజీస్ పేర్కొంది. డిజిటల్ మీడియాలో కార్యకలాపాలు విస్తరించే వ్యూహంలో భాగంగా మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ సారథ్యంలోని న్యూస్‌కార్ప్ గతేడాది నవంబర్‌లో రూ. 185 కోట్లతో ప్రాప్‌టైగర్‌లో 25% వాటాలు కొనుగోలు చేసింది. ప్రాప్‌టైగర్ ఇటీవలే బెంగళూరుకు చెందిన అవుట్ ఆఫ్ బాక్స్ ఇంట రాక్షన్ సంస్థను కొనుగోలు చేసింది. 2011 నుంచి ఇప్పటిదాకా దాదాపు 1.2 బిలి యన్ డాలర్ల విలువచేసే 12,000 గృహాల కొనుగోలు ప్రాప్‌టైగర్ ద్వారా జరిగిందని అగర్వాలా తెలిపారు. ప్రాప్టైగర్కి దేశవ్యాప్తంగా ఎనిమిది కార్యాలయాలు, 500 మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు మకాన్ డాట్కామ్కి 50 నగరాల్లో 2,00,000 పైచిలుకు ప్రాపర్టీ లిస్టింగ్స్ ఉన్నాయి.