'డబ్బు ఇవ్వకుంటే జైలులో గ్యాంగ్ రేపే!'
న్యూయార్క్: తమ కుమారుడు అస్కార్ పిస్టోరియస్ను కొట్టి సామూహిక లైంగిక దాడి చేస్తామని బెదిరించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు విచారణ తీవ్రత తగ్గాలంటే తమకు భారీ మొత్తంలో లంఛం ఇవ్వాలని లేదంటే అతడిని పై విధంగా శిక్షిస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. అయితే, వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు. 2013 జూలై 6న పిస్టోరియస్ తన ప్రేయసిని హత్య చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ కేసు విచారణకు సంబంధించి అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ కేసు వివరాలు పిస్టోరియస్ కుటుంబ ప్రతినిధి అన్నెలైజే బర్గెస్ మీడియాకు చెబుతూ ఈ కేసులో విచారణకు సంబంధించిన కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని బయటపెట్టకుండా ఉండేందుకు భారీ మొత్తంలో తమకు లంఛం ఇవ్వాలని, లేదంటే పిస్టోరియస్పై సామూహిక లైంగిక దాడి చేయిస్తామని, దారుణంగా కొట్టిస్తామని కొందరు హెచ్చరించినట్లు చెప్పారు. అయితే, ఈ బెదిరింపులు పిస్టోరియస్ కజిన్ ఆర్నోల్డస్ మొబైల్ కు వచ్చినట్లు తెలిసింది.