
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో విచారణను త్వరితగతిన పూర్తిచేసేందుకు వీలుగా కేంద్ర హోంశాఖ లైంగికదాడి సాక్ష్యాల సేకరణ కిట్ల(ఎస్‌ఏఈసీకే)ను కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీటి సాయంతో నేరం జరిగిన చోట రక్తం, వీర్యం నమూనాలను సేకరిస్తారని వెల్లడించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా రూ.79.2 లక్షల వ్యయంతో 3,960 ఎస్‌ఏఈసీకే కిట్లను కొనుగోలు చేస్తారు. తొలిదశలో ఒక్కోరాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి 100 కిట్లను అందజేస్తామనీ, క్రమంగా ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు మూడు కిట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.