ములుగు జాతీయ రహదారిపై ఉద్రిక్తత
వరంగల్: వరంగల్ లోని ములుగు జాతీయ రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ప్రజులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జాతీయరహదారి దిగ్బంధంలో పాల్గొన్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టినా వినకపోవడంతో లాఠీ చార్జ్ చేశారు. లాఠీచార్జ్ లో 100 మందికి పైగా గాయాలు అయినట్టు సమాచారం. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు బస్సుల అద్దాలు ధ్వంసం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.