protests continue
-
నిజాం కాలేజీలో పీక్ స్టేజ్‌కు విద్యార్థినిల ఆందోళన.. మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనల ఘటన ముగియకముందే నిజాం కాలేజీ విద్యార్థులు నిరసనలు దిగారు. నిజాం కాలేజీలో విద్యార్థినిలు ఆందోళన బాటపట్టారు. డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ బిల్డింగ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేస్తున్నారు. కొత్త హాస్టల్ బిల్డింగ్‌ను పీజీ విద్యార్థులకు కేటాయించడంపై నిరసనలు తెలుపుతున్నారు. యూజీ హాస్టల్ పీజీ కెట్ల..? డిగ్రీ వాళ్లు ఉండేదెట్ల..? అంటై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఇక, విద్యార్థినిల ఆందోళనలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషయంపై కేటీఆర్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ చేసి.. సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ మంత్రి సబిత సమాధానమిస్తూ.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. -
టీడీపీ బినామీలు గో బ్యాక్.. వికేంద్రీకరణ ముద్దు అంటూ నినాదాలు
సాక్షి, నిడదవోలు: అమరావతి పాదయాత్రకు తూర్పుగోదావరిలోని నిడదవోలులో నిరసన సెగ తగిలింది. కాగా, నిడదవోలులో పాదయాత్రకు వ్యతిరేకంగా ప్రజలు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రా స్టేట్ ముద్దు అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. టీడీపీ బినామీలు గో బ్యాక్ అంటూ ప్రజా సంఘాల నిరసన తెలిపాయి. వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య చిచ్చు వద్దంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. మూడు రాజధానులకే మా మద్దతు అంటూ ప్రజా సంఘాల నేతలు నినాదాలు చేశారు. -
నిరసన గళం వారిదే
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ వారి గళం దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. కేంద్రం బుజ్జగించినా వినడం లేదు, కరుకు లాఠీ దెబ్బలకి వెరవడం లేదు. 20 రోజులు దాటిపోయింది. ఢిల్లీ వీధుల్లో నిరసనలు హోరెత్తిపోతున్నాయి. ఈ రైతు పోరాటంలో పంజాబ్ రైతులే ఎందుకు ముందున్నారు? వారే ఎందుకు ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు ? హరిత విప్లవం వెల్లువెత్తిన రాష్ట్రం అది. దేశంలో ఆర్థిక సరళీకరణలు ప్రారంభమవడానికి ముందే అర్బన్ ఇండియా పురోగతికి బీజాలు వేసిన రాష్ట్రం అది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు అత్యధికంగా పెట్టే రాష్ట్రంలోనూ పంజాబే ముందుంటుంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో దేశం మొత్తమ్మీద ఎక్కువగా లబ్ధి పొందేది పంజాబ్ రైతులే. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) దేశం మొత్తమ్మీద పండే పంటలో 10శాతాన్ని కొంటే పంజాబ్‌లో పండే పంటలో 90% శాతాన్ని కొనుగోలు చేస్తుంది. కొత్త సాగు చట్టాలు ఒకే దేశం ఒకే మార్కెట్ వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో రాష్ట్రాలు ఎలాంటి సెస్‌లు, పన్నులు విధించడానికి వీల్లేదు. దీంతో మండీ వ్యవస్థ నీరు కారిపోయి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కే ఎసరొస్తుందన్న ఆందోళనలు రైతుల్లో ఉన్నాయి. దేశంలోని వ్యవసాయ ఉత్పాదకతలో 70శాతం పంజాబ్, ఏపీ, కర్ణాటక, యూపీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హరియాణా, మహారాష్ట్రల నుంచి వస్తోంది. ఆ 8 రాష్ట్రాల్లో సాగు భూమి, వ్యవసాయ ఉత్పత్తుల వాటా, వ్యవసాయ రంగంలో పెట్టే పెట్టుబడులు, చేసే ఆదా, ఎరువుల వినియోగం వంటి గణాంకాలన్నీ పంజాబ్ రైతులు ఈ పోరాటాన్ని ఎందుకంత ఉధృతంగా చేస్తున్నారో తేటతెల్లం చేస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న రైతు నిరసనల్లో మహిళలు అంతగా కనిపించడం లేదు. దీనికి కారణం పంజాబ్‌లో భూమిపై హక్కులు కలిగిన మహిళల సంఖ్య చాలా తక్కువ. దేశంలోని మహిళల్లో సగటున 12.9% మంది మాత్రమే భూమిపై యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారు. ఈ అంశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కాస్త మెరుగ్గా ఉన్నాయనే చెప్పాలి. దక్షిణాదిన 15.4% మంది మహిళలకి భూమిపై హక్కులు ఉంటే, ఉత్తరాదిన 9.8 శాతంగా ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం వంటివి సాధించాలంటే మహిళలకు భద్రమైన జీవితం, భూమిపై హక్కులు ఉండాలి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం వ్యవసాయ కూలీల్లో 32% ఉన్న మహిళలు ఉత్పత్తి విషయానికొచ్చేసరికి 55–66శాతం వాటా ఇస్తున్నారు. -
యువతరం కదిలింది
పౌర ఆగ్రహం పొగలు సెగలు కక్కింది. రేపిస్టులపైనా, అక్కరకు రాని చట్టాలపైనా.. పాలకులపైనా, ప్రమాదకరంగా మారిన పర్యావరణంపైనా.. అవినీతిపైనా, అసమానతలపైనా... యువతరం పిడికిలి బిగించి కదం తొక్కింది. భారత్ నుంచి హాంకాంగ్ వరకు.. లెబనాన్ నుంచి చిలీ వరకు నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. పోలీసుల తూటాలు ఆందోళనకారుల గుండెల్లో దిగుతున్నాయి. అయినా జనం రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఇలాంటి ఆందోళనలు భారత్‌కే పరిమితం కాలేదు. పాలకులు తప్పుదారిలో నడిస్తే సరైన దారిలో పెడతామంటూ ప్రపంచ వ్యాప్తంగా నవతరం నినదిస్తోంది. అందుకే 2019ని నిరసనల సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు. ఈ ఏడాది వివిధ దేశాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆందోళనలే ఇవాల్టీ సండే స్పెషల్.. -
వాడ వాడలా సమైక్య ఉద్యమం
-
సీమాంధ్రలో ఆగని ఆందోళనలు
-
మాట్లాడింది నేను కాదు... భగవంతుడి లీల
-
సీమాంధ్రలో కొనసాగుతున్న సమైక్య ఉద్యమం
-
సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
హైదరాబాద్ : సీమాంధ్రలో ఉద్యమ సెగలు ఏమాత్రం చల్లారడం లేదు. రాష్ట్ర విభజనపై ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో సీమాంధ్రుల ఆగ్రహ జ్వాల రోజురోజుకూ ఉధృతమవుతుంది. 11వ రోజు కూడా ర్యాలీలు, ఆందోళనలతో సీమాంధ్ర జిల్లాలు అట్టుడుకుతున్నాయి. మరోపక్క వివిధ సంఘాలు సమ్మెలకు పిలుపునిస్తుండటంతో పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 910 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. చిత్తూరు జిల్లాలోనూ బంద్ కొనసాగుతుంది. పదకొండో రోజు కూడా విద్యా సంస్థలు, దుకాణలు తెరుచుకోవటం లేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో బంద్ జరుగుతుంది. జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతిలో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయంలో జేఏసీ చేపట్టిన నిరసన దీక్షలు 11వ రోజుకు చేరాయి. టీటీడీ ప్రధాన పరిపాలన భవనం వద్ద టీటీడీ ఉద్యోగుల దీక్ష ఆరోరోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం 11వ రోుజకు చేరిన జేఏసీ నిరసన దీక్షలు మరోవైపు సమైక్య వాణిని కాంగ్రెస్ అధిష్ఠానానికి వినిపించేందుకు 12వ తేదీ నుంచి ఢిల్లీలో నిఠాహార దీక్షలు చేపట్టనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్న వెల్లడించారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం అపోహలు విస్మరించి అంతా ఒక్క తాటిపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.