నిరసన హోరు
సాక్షి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా వైఎసార్కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించారు. కడపలో నగర సమన్వయకర్త అంజాద్‌బాషా, అధికారప్రతినిధి అఫ్జల్ఖాన్, హఫీజుల్లా, పాకాసురేష్ ఆధ్వర్యంలో ఏడురోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించి సమైక్య నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగే శక్తి జగన్‌కు మాత్రమే ఉందన్నారు. పులివెందులలో మున్సిపల్ మాజీ చైర్మన్ రుక్మిణీదేవి, మునిసిపాలిటీ పరిశీలకుడు వరప్రసాద్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.
పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. పాతబస్టాండ్ సమీపంలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి పూల అంగళ్ల వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలు చేశారు. మైదుకూరులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుడు గంగాధర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలు చేశారు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్లో మానవహారంగా ఏర్పడి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించారు. రాజకీయపార్టీల అధ్యక్షుల్లో వైఎస్ జగన్ ఒక్కడే నిజమైన సమైక్యవాది అని రాచమల్లు అన్నారు.
కమలాపురంలో రైతువిభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబటూరు బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. సమైక్యనినాదాలు చేశారు. రైల్వేకోడూరులో డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి, పట్టణ కన్వీనర్ రమేష్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థులు కూడా తరలివచ్చారు. వైఎస్సార్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలు చేశారు. బద్వేలులో సమైక్యాంధ్రకు మద్దతుగా మానవహారం నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో మునిసిపల్ మాజీ చైర్మన్ మునెయ్య ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.