Protocols
-
షాదాబ్‌లో బిర్యానీ.. ఎంజే మార్కెట్లో ఐస్‌క్రీం..
చార్మినార్: రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారంరాత్రి ఉన్నట్టుండి పాతబస్తీలో సందడి చేశారు. ఎలాంటి ప్రొటోకాల్ సెక్యూరిటీ లేకుండా ఆ ప్రాంతంలో పర్యటించి స్థానికులను ఆశ్చర్యపరిచారు. మదీనాలోని షాదాబ్ హోటల్‌కు వచ్చిన ఆయన ముందుగా ఇరానీ ఛాయ్ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్ కేటీఆర్‌ను గుర్తుపట్టి సార్.. ఆప్ మినిస్టర్ సాబ్ హై.. నా (సార్.. మీరు మినిస్టర్ గారు కదా..) అంటూ ప్రశ్నించే లోపే అందరి దృష్టి ఇటువైపు పడింది. వెంటనే స్పందించిన హోటల్ యాజమాన్యం కేటీఆర్‌ను ఏసీ రూంకు తీసుకెళ్లి అక్కడ బిర్యానీ ఆర్దర్‌ఇచ్చారు. బిర్యానీ రుచిచూసిన అనం తరం ఆయన ఇరానీ ఛాయ్ తాగారు. హోటల్ సిబ్బందితోపా టు పలువురు కస్టమర్లు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నా రు. ఈ సందర్భంగా అక్కడున్నవారిని ఆయన ఆప్యాయంగా పలకరించారు. ‘చికెన్ బిర్యానీ తిన్నారా.. ఇక్కడ భలే ఉంటుంది కదా, బిర్యానీ..’అంటూ ఇద్దరు చిన్నారులతో మంత్రి ముచ్చటించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని కేటీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు మొజంజాహీ మార్కెట్లోని ఐస్‌క్రీం రిఫ్రెష్మెంట్ ఏరియాలోకి వెళ్లి ఐస్‌క్రీం తిన్నారు. ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా తిరుగుతున్న కేటీఆర్ శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా పాతబస్తీలో కాసేపు కాలక్షేపం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలలో తమపార్టీ విజయం తథ్య మని ధీమా వ్య క్తం చేశారు. -
సీఎం ఉద్దవ్ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు
ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నడుమ.. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కొవిడ్-19 ప్రోటోకాల్స్ ఉల్లంఘించినందుకుగానూ బీజేపీ నేత ఆయనపై పోలీసులకు కంప్లయింట్ చేశారు. భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గా.. ఈ మేరకు ముంబై మలబార్ హిల్ పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ కంప్లయింట్ చేశాడు. ఉద్దవ్ థాక్రేకు కరోనా పాజిటివ్ సోకిందని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. బుధవారం నాటి రాజకీయపరిణామాల అనంతరం రాత్రి.. ఆయన సీఎం అధికారిక నివాసం ‘వర్ష’ ఖాళీ చేసి వెళ్లారు. ఆ సమయంలో ఆయనపై పూలు చల్లి.. కార్యకర్తలంతా ‘మీ వెంటే ఉంటాం.. ముందుకు వెళ్లండి’ అంటూ నినాదాలు చేస్తూ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. కొవిడ్ బారిన పడ్డ వ్యక్తి.. ఐసోలేషన్‌లో ఉండకపోవడం, భౌతిక దూరం తదితర కొవిడ్ ప్రోటోకాల్స్‌ను ఉద్దవ్ థాక్రే ఉల్లంఘించారన్నది తజిందర్ పాల్‌సింగ్ ఆరోపణ. ఇక కుటుంబంతో సహా ‘మాతోశ్రీ’కి చేరుకున్న తర్వాత కూడా.. ఆయన వందల మంది మద్దతుదారులతో భేటీ నిర్వహించినట్లు తజిందర్ పాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. #WATCH Maharashtra CM Uddhav Thackeray greets hundreds of Shiv Sena supporters gathered outside his family home 'Matoshree' in Mumbai pic.twitter.com/XBG0uYqYXu — ANI (@ANI) June 22, 2022 -
అలా చేస్తే క్రికెటర్ల కుటుంబసభ్యులనూ వదిలేది లేదు..
ముంబై: యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 పార్ట్-2 నేపథ్యంలో బీసీసీఐ కఠిన బయోబబుల్ నిబంధనలను విడుదల చేసింది. శ్రీలంక పర్యటనలో ఎదురైన చేదు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సరికొత్త ప్రొటోకాల్స్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. లంక పర్యటనలో టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడటం, అతనితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది క్రికెటర్లు ఐసొలేషన్‌కు వెళ్లడం, వారిలో చహల్, కృష్ణప్ప గౌతమ్‌కు వైరస్ సోకడం వంటి పరిణామాలు బీసీసీఐపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు స్పష్టమవుతోంది. దీంతో త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 పార్ట్-2 నేపథ్యంలో బయోబబుల్‌ను ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా.. ఉపేక్షించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఫ్రాంఛైజీలు, క్రికెటర్లు సహా వారి కుటుంబ సభ్యులపైనా కఠిన చర్యలను తీసుకుంటామని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఐపీఎల్లో పాల్గొనే విదేశీ క్రికెటర్లకు బీసీసీఐ ఊరట కల్పించింది. లీగ్‌లో పాల్గొనేందుకు వచ్చే వీరిని క్వారంటైన్‌కు తరలించదలచుకోలేదని స్పష్టం చేసింది. అయితే వీరందరూ యుఏఈ విమానం ఎక్కడానికి కనీసం 72 గంటల ముందటి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఐపీఎల్ 2021 ఫేస్ 2తో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకుని ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే, కరోనా సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌లో నిర్వహించాల్సిన ఐపీఎల్‌ను యూఏఈకి తరలించిన సంగతి తెలిసిందే. -
Sri Lanka: కోవిడ్ నిబంధనల ఉల్లంఘన.. 24 గంటల్లో 1,047 మంది అరెస్ట్
కొలంబో(శ్రీలంక): చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పెద్ద, చిన్న అనే తేడాలేకుండా ప్రతి దేశం కోవిడ్‌ను అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా శ్రీలంకలో క్యారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు సోమవారం 1,047 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసు మీడియా ప్రతినిధి డీఐజీ అజిత్ రోహనా వెల్లడించారు. మాతలేలో 160 మందిని, నికవేరటియాలో 119 మందిని, కాండీలో 98 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 31 నుంచి ఇప్పటి వరకు క్యారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు19,102 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. కరోనా కట్టడికి సంబంధించి పర్యవేక్షణ కోసం 23,000 మంది పోలీసు అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇక ఇప్పటి వరకు శ్రీలంకలో 1,83,452 కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. 1,441 మంది కరోనా బాధితులు మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. (చదవండి: Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!) -
సరిహద్దుల్లో అన్ని ప్రొటోకాల్స్ పాటించాలి
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి స్థాపన కోసం సరిహద్దుల నిర్వహణలో పరస్పరం అంగీకరించిన ప్రొటోకాల్స్ అన్నీ పాటించి తీరాలని చైనాకి భారత్ మిలటరీ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎక్కువ బాధ్యత తీసుకోవాలని గట్టిగా చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంబడి వివాదాస్పద ప్రాంతాల్లో చైనా తమ సైన్యాన్ని ఉపసంహరిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు 15 గంటల సేపు సుదీర్ఘంగా సాగాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చెబుతున్న కొత్త సరిహద్దులపై ఆందోళన వ్యక్తం చేసిన భారత సైనిక బృందం, మే 5కి ముందు నాటి పరిస్థితుల్నే కొనసాగించాలని, ఆ నిబంధనలకు అనుగుణంగా పెట్రోలింగ్ నిర్వహించాలని గట్టిగా చెప్పింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు నాలుగో దఫా కమాండర్ స్థాయి చర్చల్లో పురోగతి సాధించినట్టుగా చైనా వెల్లడించింది. రేపు లద్దాఖ్‌కు రాజ్‌నాథ్ వివాదాస్పద ప్రాంతాల్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేలా భారత్, చైనా పరస్పరం అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్‌కు వెళ్లనున్నారు. సరిహద్దుల్లో పరిస్థితుల్ని పర్యవేక్షించనున్నారు. భారత సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలు తూర్పు లద్దాఖ్‌లో చైనా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో త్రివిధ దళాలకు రక్షణ శాఖ బుధవారం ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. రూ.300 కోట్లతో అత్యవసరమైన కార్యకలాపాలకు అవసరమైన ఆయుధాలు కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. ఎన్ని ఆయుధాలు కొనాలన్న దానిపై ఎలాంటి పరిమితి లేదు. అయితే, మొత్తం ఖర్చు మాత్రం రూ.300 కోట్లు దాటకూడదు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
ప్రొటోకాల్‌పై అసెంబ్లీలో సీఎంను నిలదీస్తా
బోనకల్ ఖమ్మం : కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులను విస్మరించి ప్రొటోకాల్ లేని వ్యక్తులు అధికారిక కార్యక్రమాలను ఎలా ప్రారంభిస్తారని, దీనిపై అసెంబ్లీలో సీఎంను నిలదీస్తానన్నారు. మండలంలోని సీతానగరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన సీతానగరం పంచాయతీని ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీడీఓ, ఎంపీటీసీలు ప్రారంభించాల్సి ఉందన్నారు. కానీ వారిని పక్కనపెట్టి నిబంధనలకు విరుద్ధంగా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా పనిచేసిన కొండబాలకు ఈ విషయంలో కనీస పరిజ్ఞానం లేకపోవడం దురదృష్ట కరమన్నారు. ప్రొటోకాల్‌పై తాను కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ప్రత్యేకాధికారి రమణ, కార్యదర్శి లక్ష్మి, ఎంపీడీఓ విద్యాలతలను జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీపీ చిట్టుమోదు నాగేశ్వరావు, జెడ్పీటీసీ బాణోతు కొండ, ఎంపీటీసీ కర్లకుంట ముత్తయ్య, మాజీ సర్పంచ్ మాలెంపాటి వాణీ తదితరులు పాల్గొన్నారు. -
చింతమనేని వర్సెస్ ముళ్లపూడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో కుంపట్లు పెరిగిపోతున్నాయి. ఆధి పత్య పోరుతో నాయకులు రోడ్డెక్కడం పరిపాటిగా మారిపోయింది. మద్యం షాపుల గొడవతో ఎడమొహం పెడమొహంగా మారిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మధ్య తాజాగా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. ఈ పంచాయితీ సీఎం చంద్రబాబునాయుడి వ ద్దకు చేరింది. వీరి గొడవకు పంచాయతీరాజ్ డీఈ ఒకరు సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల పెదవేగి మండలం ముండూరులో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ గ్రామానికి చెందిన సొసైటీ మాజీ అ ధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ తండ్రికి జిల్లా పరిషత్ చైర్మన్‌తో బంధుత్వం ఉంది. మరోవైపు ప్రొటోకాల్ కూడా ఉండటం తో ఆ శిలాఫలకాలపై జెడ్పీ చైర్మన్ పేరు వేయించారు. అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జెడ్పీ చైర్మన్ పేరు వేస్తే తాను రానని చెప్పడంతో అతని పేరు ఉన్న చోట పెయింటింగ్ వేశారు. అదేచోట స్థానిక ఎంపీటీసీ పేరు వేయాలని చింతమనేని అడగ్గా ముండూరు నాయకులు ససేమి రా అన్నారు. చింతమనేని రానని చెప్పడంతో గ్రామ సర్పంచ్ పేరుతో శిలాఫ లకం తయారు చేసి వారే ప్రారంభోత్సవాలు చేసేశారు. ఈ విషయం జెడ్పీ చైర్మన్ దృష్టికి వెళ్లింది. కలెక్టర్‌కు ఫిర్యాదు ప్రొటోకాల్ ప్రకారం తన పేరు వేయకుండా ఎందుకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ జెడ్పీ చైర్మన్ బాపిరాజు పంచాయతీరాజ్ ఎస్ఈని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో దెందులూరు నియోజకవర్గంలో జరిగిన అన్ని ప్రారంభోత్సవాల వివరాలు, ఫొటోలు కావాలని అడిగారు. ఫొటోలు తెప్పించుకుని తనపేరు ఎక్కడా లేకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. విషయాన్ని కలెక్టర్ భాస్కర్ దృష్టికి తీసుకువెళ్లారు. దెందులూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి తన పేరు వేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ చెప్పినట్టు సమాచారం. అధికారులపై చర్య తీసుకుంటారు గాని, విప్‌పై చర్యలు ఏ ముంటాయని ప్రశ్నించిన బాపిరాజు అసలు మీరు ఇచ్చిన చనువు వల్లే ఇలా జరుగుతుందని కలెక్టర్‌పై నిష్టూరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పంచాయతీరాజ్ అధికారులపై ఆగ్రహం విషయం తెలిసిన జిల్లా ఇన్చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు జెడ్పీ చైర్మన్‌కు ఫోన్ చేసి తనను కలవాలని, కూర్చొని వివా దం పరిష్కరించుకుందామని చెప్పారు. అందుకు సుముఖంగా లేని జెడ్పీ చైర్మన్ బాపిరాజు శుక్రవారం రాత్రి అమరావతిలో సీఎం చంద్రబాబు, లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తన ఆధీనంలో ఉన్న విభాగాల్లో పనిచేస్తూ ప్రొటోకాల్ ప్రకారం తన పేరు వేయకపోయినా తన దృష్టికి తీసుకురాకపోవడంతో ఏలూరు పంచాయతీరాజ్ డీఈపై జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన సెలవుపై వెళ్లారు. -
ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదు: మోదీ
ఢిల్లీ: కేరళలో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్‌గా తీసుకున్నారు. నావికాదళ, వాయుసేనలను సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొనాలని సూచించారు. దుర్ఘటన వార్త వినగానే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు. హుటాహుటిన కేరళకు పయనమయ్యారు. కేరళలో తాను పర్యటిస్తున్న సమయంలో ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని మోదీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అగ్నిప్రమాద బాధితులను, వారి కుటుంబాలను మోదీ పరామర్శించనున్నారు. కాలిన గాయాలకు చికిత్స అందించడానికి నైపుణ్యం ఉన్న డాక్టర్ల బృందాన్ని కూడా మోదీ తనతో కేరళకు తీసుకు వెళ్తున్నారు. కేరళ ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని రకాల సహాయసహకారాలు అందించాల్సిందిగా కేబినెట్ సెక్రటరీ ప్రదీప్ సిన్హాను ఆదేశించారు. కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్‌లో పుట్టింగళ్ దేవీ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 100 మందికిపైగా మృతి చెందారు. ఎక్కువ శాతం కాలిన గాయాలతో ఉన్న క్షతగాత్రులు ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. -
మహిళా మంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పంద్రాగస్టు వేడుకలు జిల్లాలోని ఇద్దరు మంత్రుల మధ్య దూరం పెంచనున్నాయా.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నేరుగా వీరిద్దరి మధ్య ఎటువంటి వివాదం లేకపోయినా ప్రోటోకాల్ బాధ్యతల అప్పగింత అగాధం పెంచుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జెండా వందనం చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అప్పగించడంపై గనులు, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కోస్తా జిల్లాల్లో ఏకైక దళిత మహిళా మంత్రిగా చంద్రబాబు కేబినెట్లో స్థానం సంపాదించిన సుజాతను పక్కనపెట్టి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన మాణిక్యాలరావుకు ప్రోటోకాల్ హోదా కట్టబెట్టడం వివాదాస్పదమవుతోంది. హైదరాబాద్‌లో మూడురోజుల కిందట జరిగిన కేబినెట్ భేటీలో స్వయంగా మంత్రి సుజాత ఈ విషయాన్ని ప్రస్తావించినా.. చివరకు మాణిక్యాలరావుకే జెండా వందనం చేసే బాధ్యతను అప్పగించడంపై ఆమె కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే జిల్లా కేంద్రంలో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనకూడదని మంత్రి సుజాత నిర్ణయించుకున్నట్టు సమాచారం. తొలుత జిల్లాలో ఉండకుండా ఆ రోజు హైదరాబాద్ వెళ్లాలని భావించిన ఆమె మనసు మార్చుకుని కర్నూలులో జరిగే రాష్ట్ర వేడుకల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ‘కృష్ణా’లో ఇలా ఎందుకు జరగలేదు? స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రభుత్వం తరఫున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం కోసం సహజంగా ఏ మంత్రి అయినా ఎదురుచూస్తారు. జిల్లాలో టీడీపీకి చెందిన ఏకైక మహిళా దళిత మంత్రిగా ఈసారి తనకే ఆ అవకాశం వస్తుందని సుజాత భావిం చారు. కానీ.. పొరుగున ఉన్న కృష్ణాజిల్లాలో అధికార పార్టీ రాజకీయాల్లో చోటుచేసుకున్న కుల సమీకరణల వల్ల ఆమెకు ఇక్కడ అవకాశం దక్కలేదని అంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి చెందిన వారు ఇద్దరే ఉన్నారు. ఒకరు మన జిల్లాకు చెందిన మాణిక్యాలరావు కాగా, మరొకరు కృష్ణాజిల్లాకు చెందిన కామినేని శ్రీనివాస్. వీరిద్దరిలో కచ్చితంగా ఎవరో ఒకరికి జెండా వందనం చేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు భావించారు. అయితే కృష్ణా జిల్లాలో టీడీపీకి చెందిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పక్కనపెట్టి కామినేని శ్రీనివాస్‌కు ప్రొటోకాల్ హోదా ఇచ్చే ధైర్యం చేయలేకపోయిన చంద్రబాబు మన జిల్లాకు వచ్చేసరికి దళిత వర్గానికి చెందిన సుజాతను తప్పించి మాణిక్యాలరావుకు అవకాశం ఇచ్చారని దళిత, బహుజన సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం దళిత మహిళ కాబట్టే పీతల సుజాతపై చిన్నచూపు చూశారని ఆయా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.