ప్రాదేశిక ‘పోరుకు’ సిద్ధం
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రాదేశిక తొలి పోరుకు అధికారయంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. జిల్లాలోని 35 జెడ్పీటీసీ, 512 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం జరుగనున్న ఎన్నికల్లో 1734 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఐదు నియోజకవర్గాల పరిధిలోని 35 జెడ్పీటీసీ స్థానాలకు 141 మంది అభ్యర్థులు బరిలో నిలువగా...512 ఎంపీటీసీ స్థానాలకు గాను 1,593 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.సాధారణ ఎన్నికలకు ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ప్రాదేశిక ఎన్నికల్లో అభ్యర్థులు హోరా హోరీ ప్రచారాన్ని నిర్వహించారు. తమ పార్టీల అభ్యర్థుల విజయం కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సాధారణ ఎన్నికల పోటీలో ఉన్న నేతలు విసృతంగా పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రాదేశికంలోని అత్యధిక స్థానాల్లో త్రిముఖ పోటీ కొనసాగుతోంది.
పోటీలో ఉన్న వారు ప్రచారంతో పాటు ఓటర్లను పలు ప్రలోభాలకు గురి చేసేందుకు నానా తంటాలు పడ్డారు. అందువల్లనే పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. 35 జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు 35 స్థానాల్లో పోటీ చేస్తుండగా.... టీడీపీ 28 స్థానాల్లో, బీజెపీ 17, సీపీఎం తొమ్మిది, సీపీఐ మూడు, వైఎస్సార్ సీపీ మూడు, బీఎస్ిపీ ఎనిమిది స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది.
ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే విధంగా 512 ఎంపీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 471 మంది అభ్యర్థులను పోటీలో నిలిపింది. టీఆర్ఎస్ నుంచి 457 మంది, టీడీపీ 309, బీజెపీ 174, సీపీఎం 25, సీపీఐ 23, వైఎస్సార్ సీపీ 4, బీఎస్పీ 10 స్థానాల్లో తలపడుతుంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా 120 బరిలో ఉన్నారు.
1588 పోలింగ్ కేంద్రాలు..
ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన అధికార యంత్రాం గం 35 మండలాల్లో 1588 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఎన్నిక ల్లో 11.55లక్షల మంది ఓటర్లు తమ హ క్కును వినియోగించుకోనున్నారు. పోలిం గ్ నిర్వహణలో భాగంగా 8,735 మంది సిబ్బంది విధుల్లో పాల్గోంటున్నారు.ఇందులో ప్రిసైడింగ్ అదికారులు 1747, సహ య ప్రిసైడింగ్‌అధికారులు1747, పోలింగ్ క్లర్కులు 5,241 మంది ఉన్నారు.ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో 402 పొలింగ్ కేంద్రాలను సమస్యాత్మక,అతి సమస్యాత్మకంగా గుర్తించిన అధికారులు తగిన చర్య లు తీసుకుంటున్నారు.
22 చొట్ల వీడియో కెమెరాలు ఏర్పాటు చేశారు.100 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో వెబ్ కాస్టింగ్ నిర్వహణ చేపడుతున్నారు.అదేవిధంగా 280 సూక్ష్మపరిశీలకులతో నిఘా ఛిను పెం చుతున్నారు.ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పొలీసు శాఖ గట్టి బం దోబస్తును ఏర్పాటు చేసింది.
ఐదారు మం డలాలకు ఒక డీఎస్పీని పర్యవేక్షకుడిగా నియమించిన పొలీసు శాఖ ప్రతీ పోలీసు స్టేషన్‌కు ఒక సీఐని ఇన్చార్జిగా పెట్టారు.35 మండలాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో4,285 పోలీసు ిసిబ్బందితో భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికలు కావడంతో ప్ర త్యేక స్ట్రైకింగ్ ఫోర్స్‌ను రంగంలోకి దింపి తగిన చర్యలను తీసుకుంటున్నారు.