public sector units
-
ఎల్ఐసీ ఐపీవోకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి మార్గం సుగమమైంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఎల్ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌కు సెబీ తాజాగా ఓకే చెప్పింది. వెరసి దరఖాస్తు చేసిన నెల రోజుల్లోగా ఒక కంపెనీ ఐపీవోకు అనుమతించి రికార్డు సృష్టించింది. దీంతో బీమా దిగ్గజంలో 5 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వానికి వీలు చిక్కనుంది. ఎల్ఐసీ లిస్టింగ్ ద్వారా ప్రభుత్వం రూ. 63,000 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉన్న సంగతి తెలిసిందే. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి(2021–22) నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 78,000 కోట్లను సాధించేందుకు అవకాశమేర్పడింది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఐపీవో చేపట్టడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు అధికారిక వర్గాలు ఇప్పటికే తెలియజేశాయి. పూర్తి వాటా... ఎల్ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం(దాదాపు 632.5 కోట్ల షేర్లు) వాటా ఉంది. ఐపీవోలో భాగంగా 5 శాతం వాటా(31.6 కోట్ల షేర్లు)ను విక్రయానికి ఉంచనుంది. ఎల్ఐసీ ఉద్యోగులకు, పాలసీదారులకు ఐపీవో ధరలో డిస్కౌంటును ఆఫర్ చేయనుంది. గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ అంతర్గత విలువను మిల్లిమన్ అడ్వయిజర్స్ రూ. 5.4 లక్షల కోట్లుగా మదింపు చేసింది. దీంతో రూ. 16 లక్షల కోట్ల మార్కెట్ విలువను పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఎల్ఐసీ లిస్టయితే అతిపెద్ద ఐపీవోగా రికార్డు నెలకొల్పనుంది. 2021లో రూ. 18,300 కోట్ల సమీకరణకు వచ్చిన పేటీఎమ్ ప్రస్తుతం అతిపెద్ద ఇష్యూగా నమోదైన విషయం విదితమే. అంతక్రితం 2010లో కోల్ ఇండియా రూ. 15,500 కోట్లు, 2008లో రిలయన్స్ పవర్ రూ. 11,700 కోట్లు సమీకరించడం ద్వారా భారీ ఐపీవోలుగా నిలిచాయి. -
ఎయిరిండియాకు ఐటీ సపోర్ట్
న్యూఢిల్లీ: విమానయాన పీఎస్‌యూ.. ఎయిరిండియా ఆస్తులను ప్రత్యేక ప్రయోజన కంపెనీ(ఎస్పీవీ)కి బదిలీ చేయడంలో ఎలాంటి పన్ను విధింపులూ ఉండబోవని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీటీడీ) తాజాగా వెల్లడించింది. ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్పీవీకి ఆస్తుల బదలాయింపు చేపట్టిన సందర్భంలో మూలంవద్దే పన్ను విధింపు(టీడీఎస్) నుంచి ప్రభుత్వం మినహాయింపునిచి్చంది. తద్వారా ఎయిరిండియా డిజిన్వెస్ట్మెంట్కు మరింత మద్దతునిస్తోంది. కంపెనీ విక్రయ ప్రక్రియకంటే ముందుగానే ప్రభుత్వం 2019లో ఎస్పీవీ ఏర్పాటుకు తెరతీసింది. దీనిలో భాగంగా ఎయిరిండియా రుణాలు, కీలకంకాని ఆస్తులను ఎస్పీవీకి బదిలీ చేసేందుకు నిర్ణయించింది. ఎస్పీవీకి స్థిరాస్తుల బదిలీ కారణంగా ఎయిరిండియాకు చేపట్టే చెల్లింపుల విషయంలోనూ టీడీఎస్ కోత ఉండబోదని సీబీడీటీ పేర్కొంది. ఆస్తుల బదిలీ అంశంలో ఎయిరిండియాను విక్రేతగా పరిగణించలేమని తెలియజేసింది. ప్రభుత్వం ఎయిరిండియాతోపాటు అనుబంధ సంస్థ ఏఐ ఎక్స్‌ప్రెస్‌లోగల 100 శాతం వాటాలను విక్రయించే ప్రణాళికల్లో ఉంది. అంతేకాకుండా ఎయిరిండియా శాట్స్ ఎయిర్పోర్ట్ సరీ్వసెస్‌లోనూ 50 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు అనుగుణంగా కొనుగోలుదారులు ఈ నెల 15కల్లా ఫైనాన్షియల్ బిడ్స్‌ను దాఖలు చేయవలసి ఉన్న సంగతి తెలిసిందే. -
భేషుగ్గా పెట్టుబడుల ఉపసంహరణ
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రకటించినట్టుగా ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కేలండర్ సజావుగా కొనసాగుతుందన్న నమ్మకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కనబరిచారు. ఫిక్కీ సభ్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో పెద్ద ఎత్తున నిధులను వెచ్చించడం జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఫిక్కీ ట్వీట్ చేయగా, ఆర్థిక మంత్రి రీట్వీట్ చేశారు. 2021–22లో పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకుంటామని బడ్జెట్లో భాగంగా మంత్రి చెప్పడం గమనార్హం. బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఐడీబీఐ, బీఈఎమ్ఎల్, పవన్‌హన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌తోపాటు.. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడులను 2021–22 సంవత్సరంలో ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనలను మంత్రి బడ్జెట్లో ప్రకటించారు. దీనికి తోడు ఎల్ఐసీ నుంచి అతిపెద్ద ఐపీవో రూపంలోనూ భారీగా నిధులు సమకూర్చుకోవాలనుకుంటోంది. ఏ వర్గంపైనా భారం వేయకుండానే.. భారత్‌లోని ఏ వర్గంపైనా భారం మోపలేదన్న విషయాన్ని మంత్రి సీతారామన్ గుర్తు చేశారు. ఆదాయం ఈ ఏడాది నుంచి మెరుగుపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ.. పెట్టుబడుల ఉపసంహరణ మార్గంలోనే కాకుండా, పన్నేతర ఆదాయాన్ని సమకూర్చుకుంటూ అందుకు ఆస్తుల విక్రయాన్ని ప్రస్తావించారు. భారీగా నిధులను వ్యయం వెచ్చించాల్సి ఉండడంతో పన్నేతర ఆదాయ మార్గాలపై బడ్జెట్లో దృష్టి పెట్టినట్టు వివరించారు. ప్రభుత్వం ఒక్కటే పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వచ్చినా కానీ పెరుగుతున్న దేశ ఆకాంక్షలను తీర్చలేదంటూ ప్రైవేటు రంగం కూడా ముఖ్య భూమిక పోషించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ‘‘పన్నులు పెంచకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను ప్రదర్శించిన భిన్నమైన బడ్జెట్ ఇది. ఔత్సాహిక వ్యాపార స్ఫూర్తిని ఇది పెంచుతుంది. పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు ముందుకు రావాలి. బడ్జెట్లో ప్రదర్శించిన స్ఫూర్తిని పరిశ్రమ అర్థం చేసుకుంటుందని భావిస్తున్నాను. పరిశ్రమ రుణ భారాన్ని దించుకుంది. కనుక ఇప్పుడిక విస్తరణపై మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి దిశగా ప్రయాణించేందుకు సిద్ధం కావాలి’’ అని మంత్రి పిలుపునిచ్చారు. 2021–22లో రూ.34.83 లక్షల కోట్లను ప్రభుత్వం వ్యయాల కోసం కేటాయించడం గమనార్హం. త్వరలో మలి జాబితా.. ► నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణకు అనుకూలమైన ప్రభుత్వరంగ సంస్థల మలి జాబితాను వచ్చే కొన్ని వారాల్లో సిద్ధం చేయనున్నట్టు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ తెలిపారు. ప్రతిపాదిత అస్సెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీల ఏర్పాటు బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏల) సమస్యను పరిష్కరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు యూటీఐ మాదిరే ఇవి కూడా తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తాయని అభిప్రాయపడ్డారు. ఒక అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ఒక అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. పెట్టుబడుల ఉపసంహరణపైనా ఆమె ప్రకటన చేశారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు వీలుగా తదుపరి జాబితాను నీతి ఆయోగ్ రూపొందిస్తుందని సీతారామన్ పేర్కొనడం గమనార్హం. ఈ ప్రక్రియ మొదలైందని, కొన్ని వారాల్లోనే జాబితాను సిద్ధం చేస్తామని మోదీ చెప్పారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల మోదీ సర్కారు ఎప్పటికప్పుడు తన అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనకు స్పందిస్తూ.. అన్ని పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో ఈ సంస్కరణలు అజెండాగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. -
పీఎస్‌యూ ఫర్ సేల్...!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ రంగ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22)లో రూ. 1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. గత బడ్జెట్లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 2.10 లక్షల కోట్లతో పోలిస్తే తాజా ప్రతిపాదనలు రూ. 35,000 కోట్లు తక్కువకావడం గమనార్హం! అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థల(సీపీఎస్ఈలు) వాటా విక్రయంపై కోవిడ్–19 ప్రతికూల ప్రభావం చూపడంతో ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ అంచనాలను తాజాగా రూ. 32,000 కోట్లమేర తగ్గించింది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ సీపీఎస్ఈలలో వాటాల విక్రయం, షేర్ల బైబ్యాక్ ద్వారా రూ. 19,499 కోట్లు మాత్రమే సమీకరించింది. రూ. లక్ష కోట్లు: వచ్చే ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1.75 లక్షల కోట్లలో రూ. లక్ష కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ బాటలో సీపీఎస్ఈల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా మరో రూ. 75,000 కోట్లను సమీకరించేందుకు ప్రతిపాదించింది. ఈసారి డిజిన్వెస్ట్‌మెంట్ వ్యూహంలో భాగంగా నాలుగు రంగాలను ఎంపిక చేసినట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. అణు ఇంధనం(ఆటమిక్ ఎనర్జీ), అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర మినరల్స్, బ్యాంకింగ్, బీమా, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లను ప్రస్తావించారు. తాజా ప్రతిపాదనల ప్రకారం వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్రను నామమాత్రం చేయనున్నారు. ఈ రంగాలలో మిగిలిన సీపీఎస్ఈలను ప్రయివేటైజ్ చేయడం లేదా విలీనం లేదా అనుబంధ సంస్థలుగా మార్చడం వంటి అంశాలకు తెరతీయనున్నారు. ఇలాకాకుంటే వీటిని మూసివేస్తారు. వచ్చే ఏడాదిలో బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హంస్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ తదితరాల డిజిన్వెస్ట్‌మెంట్‌ను పూర్తి చేయనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్ సహా మరో రెండు పీఎస్‌యూ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటైజ్ చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పీఎస్‌యూలలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆస్తుల విక్రయయానికి ప్రత్యేక కంపెనీ... వినియోగంలోలేని ఆస్తులు ఆత్మనిర్భర్ భారత్‌కు సహకరించవని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కీలకంకాని ఆస్తుల జాబితాలో ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూల వద్ద గల మిగులు భూములు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. వీటి ప్రత్యక్ష విక్రయం లేదా ఇతర విధానాలలో మానిటైజేషన్‌కు వీలుగా ఒక ప్రత్యేక కంపెనీ(ఎస్పీవీ)ను ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ఎల్ఐసీ లిస్టింగ్‌కు సై రూ. 8–10 లక్షల కోట్ల మార్కెట్ విలువ అంచనా వచ్చే ఏడాది(2021–22)లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఈ బాటలో ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అవసరమైన చట్ట సవరణలను ప్రవేశపెడుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో తాజాగా ఆర్థిక మంత్రి తెలియజేశారు. జీవిత బీమా బ్లూచిప్ కంపెనీ ఎల్ఐసీలో ప్రభుత్వానికి ప్రస్తుతం 100 శాతం వాటా ఉంది. ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో లిస్టయితే రూ. 8–10 లక్షల మార్కెట్ విలువను సాధించగలదని విశ్లేషకుల అంచనా. తద్వారా దేశీయంగా అత్యంత విలువైన కంపెనీగా నిలిచే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. -
లాభం తగ్గింది షేరు ఎగసింది
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గతేడాది ఆఖరి త్రైమాసికం(2013-14, క్యూ4)లో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.3,041 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నమోదు చేసిన రూ.3,299 కోట్లతో పోలిస్తే లాభం 7.83 శాతం తగ్గింది. ప్రధానంగా మొండిబకాయిలపై ప్రొవిజనింగ్ కేటాయింపులు పెరగడం, రానున్న వేతన సవరణ కోసం కొంతమొత్తాన్ని పక్కనబెట్టడం వంటివి లాభాల తగ్గుదలకు దారితీసినట్లు బ్యాంక్ పేర్కొంది. ఇక క్యూ4లో మొత్తం ఆదాయం రూ.36,331 కోట్ల నుంచి రూ. 42,443 కోట్లకు ఎగబాకింది. 17 శాతం వృద్ధి చెందింది. కాగా, బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) జనవరి-మార్చి క్వార్టర్లో 16.4 శాతం వృద్ధితో రూ.12,903 కోట్లకు ఎగసింది. పెరిగిన మొండిబకాయిలు... బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) మార్చి క్వార్టర్ చివరికి 4.95 శాతానికి(రూ.61,605 కోట్లు) పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఈ పరిమాణం 4.75 శాతం(రూ.51,189 కోట్లు)గా ఉంది. అంటే 20.3 శాతం ఎగబాకాయి. నికర ఎన్పీఏలు కూడా 2.10 శాతం(రూ.21,956 కోట్లు) నుంచి 2.57 శాతానికి(రూ.31,096 కోట్లు) ఎగబాకాయి. ఏకంగా 41.6 శాతం అధికమయ్యాయి. ఇదిలావుండగా.. 2013-14 క్యూ4లో మొండిబకాయిలపై ప్రొవిజనింగ్ కేటాయింపులు రూ.5,884 కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.3,974 కోట్లు మాత్రమే. అంటే 40.05 శాతం పెరిగినట్లు లెక్క. ఇక 2013-14 పూర్తి ఏడాదికి బ్యాంక్ మొత్తం ప్రొవిజనింగ్ కేటాయింపులు రూ.7,587 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది రూ.4,461 కోట్లతో పోలిస్తే 70.06 శాతం పెరగడం గమనార్హం. కాగా, క్యూ4లో బ్యాంక్ రూ.1,397 కోట్ల బకాయిలను రికవరీ చేసుకోగా, రూ.1,148 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఇక క్యూ4లో తాజాగా రూ.13,766 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయి. పూర్తి ఏడాదికి ఇలా... 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 23 శాతం దిగజారి రూ.10,891 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాదిలో నికర లాభం రూ.14,105 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ.1,19,655 కోట్ల నుంచి రూ.1,36,351 కోట్లకు పెరిగింది. 14 శాతం వృద్ధి నమోదైంది. ఇక కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కూడా బ్యాంక్ గతేడాది నికర లాభం 21 శాతం క్షీణించింది. రూ.17,916 కోట్ల నుంచి రూ.14,174 కోట్లకు తగ్గింది. ఇతర ముఖ్యాంశాలివీ... పూర్త ఏడాదికి బ్యాంక్ రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.30 చొప్పున(గతంలో ఇచ్చిన రూ.15 మధ్యంతర డివిడెండ్‌తో కలిపి) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చి చివరినాటికి నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 3.17 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలాఖరుకు ఎన్ఐఎం 3.34 శాతంగా ఉంది. క్యూ4లో ఫీజుల రూపంలో ఆదాయం 15.34 శాతం వృద్ధితో రూ.4,467 కోట్లకు పెరిగింది. వడ్డీయేతర ఆదాయం 18.73 శాతం ఎగసి రూ.6,586 కోట్లకు చేరింది. గతేడాది క్యాపిటల్ అడిక్వసీ రేషియో 12.44 శాతం కాగా, ఇందులో టైర్-1 క్యాపిటల్ 9.72 శాతంగా ఉంది. మొత్తం వ్యాపారం(డిపాజిట్లు-రుణాలు) 2013-14లో రూ.26,39,531 కోట్లకు పెరిగింది. 2012-13లో రూ.22,81,297 కోట్లతో పోలిస్తే 3,58,234 కోట్లు ఎగసింది. గడిచిన ఏడాది కాలంలో కొత్తగా 1,053 బ్రాంచ్‌లను ఎస్బీఐ ఏర్పాట చేసింది. దీంతో మార్చినాటికి మొత్తం శాఖల సంఖ్య 15,869కి చేరింది. దూసుకెళ్లిన షేరు... ఫలితాలు విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గా ఉండటంతో షేరు ధర దూసుకెళ్లింది. బ్రోకరేజి నిపుణులు క్యూ4లో బ్యాంక్ నికర లాభం రూ.2,824 కోట్లుగా అంచనావేశారు. అంతేకాకుండా క్యూ3తో పోలిస్తే క్యూ4లో(సీక్వెన్షియల్‌గా మొండిబకాయిలు మెరుగుపడటం కూడా మార్కెట్ వర్గాలను మెప్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో ఒకానొకదశలో 10 శాతంపైగా ఎగబాకింది. రూ.2,775 గరిష్టాన్ని తాకింది. చివరకు 9.69 శాతం(రూ.243) లాభంతో రూ.2,755 వద్ద స్థిరపడింది. ఎగవేతదారుగా కింగ్‌ఫిషర్ విజయ్ మాల్యా! కావాలనే రుణాన్ని ఎగ్గొట్టిన ఎగవేతదారుగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటరు విజయ్ మాల్యా పేరును ప్రకటించడంపై ఎస్బీఐ దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమ వాదనలు పటిష్టంగా ఉండేలా వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు నుంచి తీసుకున్న అప్పును రుణ గ్రహీత దారి మళ్లించారని, చె ల్లించే సామర్థ్యం ఉన్నా చెల్లించడం లేదని నిరూపించాల్సి ఉంటుంది. ఈ రెండు విషయాలను రుజువు చేయగలిగితే.. మాల్యాను ఎగవేతదారుగా ప్రకటించడానికి వీలు చిక్కుతుందని ఎస్బీఐ వర్గాలు చెప్పాయి. మరోవైపు, మాల్యా వ్యక్తిగత ఆస్తులను కూడా జప్తు చేసుకునే విషయాన్ని బ్యాంక్ పరిశీలిస్తోన్నట్లు వివరించాయి. ఎగవేతదారుగా బ్యాంకు డిక్లేర్ చేసిన వ్యక్తి... వివిధ కంపెనీల్లో తనకున్న డెరైక్టర్ హోదాలను కోల్పోతారు. అలాగే, భవిష్యత్‌లో మళ్లీ రుణం తీసుకోవడానికి అవకాశం ఉండదు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఎస్బీఐ రూ. 1,600 కోట్ల మేర రుణం ఇచ్చిన సంగతి తెలిసిందే.