Puducherry Chief Minister
-
త్వరలో గృహిణులకు నెలనెలా రూ. 1000
సాక్షి, చెన్నై: ఇంటి యజమానులుగా ఉన్న గృహిణులకు నెలనెలా రూ. 1000 నగదు పంపిణీ చేసే పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నామని పుదుచ్చేరి సీఎం ఎన్‌రంగస్వామి తెలిపారు. అలాగే అదనంగా 16 వేల మంది వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసి కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అభివృద్ధికి రూ. 2000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని రూ. 1,400 కోట్లను కేటాయించేందుకు ఆమోదించినట్లు చెప్పారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. విమానాశ్రయం విస్తరణ పనులపై దృష్టి పెట్టామని, అయితే తమిళనాడు ప్రభుత్వం స్థలం ఇంతవరకు కేటాయించ లేదని తెలిపారు. పుదుచ్చేరి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్త.. ఆర్థికంగా, పారిశ్రామికంగా తమ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. హెల్త్ పార్క్.. సేదార పట్టిలో పారిశ్రామిక వాడ కోసం 800 ఎకరాల స్థలాన్ని కేంద్రానికి అప్పగించామని, అయితే ప్రస్తుతం ఆ స్థలం మళ్లీ రాష్ట్రం గుప్పెట్లోకి చేరిందన్నారు. ఈ స్థలానికి మరో 200 ఎకరాలను కలిపి 1000 ఎకరాల్లో హెల్త్‌పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో కుటుంబ యజమానులుగా ఉన్న గృహిణిలకు రూ. 1000 పథకం గురించి బడ్జెట్లో ప్రకటన చేశామని తెలిపారు. దీనిని త్వరలో ఆచరణలో పెట్టనున్నామని వెల్లడించారు. అదనంగా 16 వేల మందికి వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే 2 వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామని ప్రకటించారు. -
22న బలం నిరూపించుకోండి
సాక్షి ప్రతినిధి, చెన్నై/యానాం: పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 22న బలపరీక్షకు సిద్ధం కావాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించారు. ‘విశ్వాస పరీక్ష అనే ఏకైక ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపాలి. ఈ కార్యక్రమం మొత్తం వీడియో రికార్డింగ్ జరగాలి. బలపరీక్ష 22న సాయంత్రం 5 గంటలలోపు ముగియాలి’అని గవర్నర్ కార్యాలయం ఒక తెలిపింది. అంతకుముందు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. పుదుచ్చేరి గవర్నర్ బంగ్లా రాజ్‌నివాస్‌లో ఆమె చేత మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీప్ బెనర్జీ పదవీ ప్రమాణం చేయించారు. సీఎం నారాయణస్వామి ఆమెకు పుష్పగుచ్ఛమిచ్చి సత్కరించారు. తెలంగాణ, పుదుచ్చేరి అనే కవలపిల్లలను ఎలా చూసుకోవాలో తనకు తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీలోకి వలసలు, రాజీనామాలతో పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. 30 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీలో 15 మంది సభ్యులతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు, మరో నలుగురు రాజీనామాలతో ఆ సంఖ్య 10కి పడిపోయింది. అయితే ముగ్గురు డీఎంకే, ఒక స్వతంత్ర సభ్యుడు అధికార పక్షం వైపు ఉన్నారు. అలాగే, ప్రతిపక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3లతో కలుపుకుని మొత్తం 14 మంది సభ్యుల బలం ఉంది. -
సీఎం, గవర్నర్ మాటల యుద్ధం
పుదుచ్చేరి: పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) కిరణ్ బేడీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీరిద్దరూ పరస్పరం విమర్శస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. కిరణ్‌బేడీ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న సీఎం.. అధికారులకు ఆంక్షలు విధించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవొద్దని, తప్పనిసరైతే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియలో అనవసరంగా కిరణ్‌బేడీ జోక్యం చేసుకుంటున్నారని గతవారం నారాయణస్వామి విమర్శించారు. మంత్రులను, ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడం మానుకోవాలని, అగౌరపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని అసెంబ్లీ వేదికగా ఆమెకు సూచించారు. నారాయణస్వామి వైఖరిని కిరణ్‌బేడీ తప్పుబట్టారు. ‘మీరు కోరుకుంటున్నది రబ్బర్ స్టాంపునా లేదా బాధ్యతాయుతమైన పాలకురాలినా’ అని నారాయణస్వామిని అని ప్రశ్నించారు. పుదుచ్చేరికి న్యాయం, నైతిక నిష్ఠ, మంచి పాలన కావాలని పేర్కొన్నారు. కాగా, కిరణ్ బేడీని పదవి నుంచి తొలగించాలని సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
నేడు పుదుచ్చేరి సీఎంగా నారాయణ ప్రమాణం
పుదుచ్చేరి: కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత వీ నారాయణ స్వామి(69) పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మల్లాడి కృష్ణారావు సహా మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 30 స్థానాల అసెంబ్లీలో కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.