Puducherry CM Rangaswamy
-
పుదుచ్చేరి సీఎంకు మళ్లీ కొత్త చిక్కులు
అధికార పగ్గాలు చేపట్టిన పుదుచ్చేరి సీఎం రంగస్వామి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సభలో బీజేపీ సభ్యుల బలం పెరగడంతో సంకటంలో పడ్డారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, రెండు మంత్రి పదవుల కోసం బీజేపీ పట్టుబడుతుండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో 30 నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్–10, బీజేపీ–6, డీఎంకే–6, కాంగ్రెస్–2, స్వతంత్రులు ఆరుగురు గెలిచారు. బీజేపీ–ఎన్ఆర్ కాంగ్రెస్ కూట మి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఆయన కరోనాతో ఆస్పత్రిలో చేరడంతో ఎల్జీ తమిళిసై పరిపాలన చేపట్టా రు. ఆస్పత్రి నుంచి సీఎం రాగానే 23 రోజుల అనంతరం బుధవారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ సభ్యులు ఆరుగు రు, నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిపి అసెంబ్లీలో బీజేపీ బలం తొమ్మిదికి చేరింది. దీనికితోడు ముగ్గు రు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన చేరారు. అనంతరం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ నిర్మల్‌కుమార్, సీనియర్ నేత నమశ్శివాయంతో భేటీ కావడం, ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఆశీస్సులు అందుకోవడం చర్చకు దారి తీసింది. బీజేపీ బలం 12కు చేరిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, రెండు మంత్రి పదవుల్ని తమకు కట్టబెట్టాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న దృష్ట్యా డిప్యూటీ సీఎం పదవిని ఇస్తే తనను డమ్మీని చేస్తారని సీఎం రంగస్వామి ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అలాగే తన పార్టీలోనూ ముఖ్య నేతలు పదవుల్ని ఆశిస్తుండంతో సీఎంకు శిరోభారం తప్పడం లేదు. ఈ క్రమంలో సీఎం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు ఎన్ఆర్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పదవుల విషయంలో బీజేపీ నుంచి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైన పక్షంలో డీఎంకే, తటస్థంగా ఉన్న మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలిసింది. చదవండి: ‘మా వల్లే సంపన్నులై.. మాకే ఓటు వేయరా?’: మంత్రి ఫొటో మోదీది.. బాధ్యత రాష్ట్రాల పైనా? -
పుదుచ్చేరి సీఎం రంగస్వామికి కరోనా పాజిటివ్
పుదుచ్చేరి:పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి కరోనా బారినపడ్డారు. ఈనెల 7వ తేదీ సాయంత్రం పదవీ ప్రమాణం చేసిన వెంటనే ఆయన విధుల్లో చేరారు. తాజాగా జ్వరం రావడంతో ఆయన కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకుని.. పాజిటివ్‌గా తేలడంతో సోమవారం చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనతో సఖ్యతగా మెలిగిన ఎమ్మెల్యేలకు కూడా సోమవారం కరోనా పరీక్షలు చేశారు. ఈ కారణంగా ఈనెల 14వ తేదీన జరగాల్సిన మంత్రుల పదవీ ప్రమాణం కార్యక్రమం వాయిదాపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కరోనా కష్టకాలంలో పనిచేయాల్సి ఉన్నందున సీఎం ఆశీస్సులతో ఆదేరోజున ఉప ముఖ్యమంత్రి సహా నలుగురు మంత్రులు పదవీ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. అలాగే, అరియలూరు జిల్లాకు చెందిన రాష్ట్రమంత్రి శివశంకర్‌కు కరోనా సోకడంతో హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. చదవండి: రంగస్వామి రికార్డు.. పుదుచ్చేరి సీఎంగా నాలుగో సారి కేంద్రం చేసింది క్రూరమైన నేరం: సిసోడియా -
మౌనంగా రంగస్వామి!
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి సీఎం రంగస్వామి మౌనం ఎన్ఆర్ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను రేపింది. నామినేషన్‌కు శుక్రవారం ఒక్క రోజే సమయం ఉండడంతో సీటు ఆశిస్తున్న వారు సందిగ్ధంలో పడ్డారు. గురువారం అయినా, జాబితా విడుదల అయ్యేనా అన్న ఎదురు చూపుల్లో పడ్డారు. పుదుచ్చేరి కాంగ్రెస్‌ను చీల్చి ఎన్ఆర్ కాంగ్రెస్‌ను రంగస్వామి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2011 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆవిర్భవించిన ఎన్ఆర్ కాంగ్రెస్ తన సత్తాను చాటుకుంది. అన్నాడీఎంకేతో కలిసి పయనం సాగించి ముప్పై నియోజకర్గాల్ని కల్గిన పుదుచ్చేరిలో అధికార పగ్గాల్ని రంగస్వామి చేపట్టారు. అయితే, తమకు కావాల్సిన మెజారిటీ రావడంతో అన్నాడీఎంకేను పక్కన పడేశారు. ఇప్పుడు అదే ఆయన్ను వెంటాడుతున్నది. అన్నాడీఎంకే హ్యాండివ్వడంతో, బీజేపీతో కలసి పయనం సాగించేందుకు నిర్ణయించి వెనక్కు తగ్గారు. చివరకు ప్రజాసంక్షేమ కూటమి అని ఆలోచించి మనస్సు మార్చుకున్నారు.ప్రస్తుతం ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రంగస్వామికి తప్పలేదు. ఇన్నాళ్లు పొత్తు ప్రయత్నాలకే సమయాన్ని ఎక్కువగా రంగస్వామి వెచ్చించడంతో ప్రచార ఆర్భాటాలు, అభ్యర్థుల ఎంపిక ఎక్కడ వేసిన గంగొళి అక్కడే అన్న చందంగా పడి ఉన్నాయి. ఇక్కడ ఓట్ల వేటలో కాంగ్రెస్-డీఎంకే కూటమి, అన్నాడీఎంకే, ప్రజా సంక్షేమ కూటమి, బీజేపీ కూటమిలు దూసుకెళుతుంటే, ఇంత వరకు అభ్యర్థుల జాబితా వెలువడక పోవడంతో ఎన్ఆర్ కాంగ్రెస్‌లో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుంది. ఇక, గురువారం కూడా జాబితా వెలువడని పక్షంలో రంగస్వామి నిర్ణయం ఏమిటో అన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో ఉత్సాహంగా అందరి కన్నా ముందుగా ఎన్నికల్లో దూసుకెళ్లిన రంగస్వామి , ఈ సారి మౌనంగా ఉండడంతో పుదుచ్చేరి రాాజకీయాల్లో చర్చ బయలు దేరింది. అయితే, రంగస్వామి మౌనం వెనుక కారణాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి పదవుల కోసం తనను ఉక్కిరి బిక్కిరి చేసిన వాళ్లు, మళ్లీ సీటు ఆశిస్తుండడం, మంత్రులు కొందరు మళ్లీ రేసులో దిగేందుకు సిద్ధ పడటం వెరసి రంగస్వామి ఆచీతూచీ అడుగులు వేయడానికి సిద్ధమయ్యార ని చెబుతున్నారు. పలువురు మాజీలకు సీట్లు ఇవ్వకూడదని రంగస్వామి నిర్ణయించి ఉన్నారని, అలాగే,మరి కొందరికి చెక్ పెట్టే విధంగా, సరికొత్త అభ్యర్థులతో రేసులో దిగేందుకు కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారని చెబుతున్నారు. అయితే, మాజీలకు సీట్లు నిరాకరించ బడ్డ పక్షంలో ఎన్నికల వేళ చివరిక్షణంలో ఎన్ఆర్ కాంగ్రెస్‌లో ఎలాంటి ప్రకంపనలు బయలు దేరుతాయో అన్నది వేచి చూడాల్సిందే.