Pula Ravinder
-
టీఆర్ఎస్కు పూల రవీందర్ రాజీనామా
సాక్షి, యాదాద్రి: పీఆర్టీయూ సభ్యుల కోరిక మేరకు టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లేనని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రకటించారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద చేపట్టిన మహాధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు అడ్డగించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, తాను వరంగల్, జనగామ ధర్నాల్లో పాల్గొని యాదాద్రి భువనగిరి ధర్నాకు హాజరయ్యానని రవీందర్ అన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించకపోతే హైదరాబాద్‌లో జరిగే మహాధర్నారోజు పీఆర్టీయూ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిద్దామన్నారు. మనకు టీఆర్ఎస్పార్టీ ముఖ్యం కాదని, పీఆర్టీయూ ముఖ్యమన్నారు. పీఆర్టీయూ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాల సమస్యలు పరిష్కారానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం 45శాతం పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్స్, బదిలీల షెడ్యూల్ ప్రకటించి, అన్ని పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలన్నారు. అంతకుముందు భువనగిరి పట్టణంలో ప్రధాన రహదారిలోఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ అనితారామచంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మోటె సత్తయ్య, గౌరవ అధ్యక్షుడు జాలిగామరామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి ముత్యంరాములు, వివిధ మండలాల నుంచి జిల్లా అధ్యక్షులు, కార్యరద్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చదవండి: ‘సాగర్’ లో నేడు టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వరుస విజయాలతో దూసుకుపోతున్న అధికార టీఆర్ఎస్కు షాక్ తగిలింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ ఓటమిపాలైయ్యారు. యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. మొత్తం 18885 ఓట్లు పోలవ్వగా నర్సిరెడ్డికి 8976 ఓట్లు రాగా.. పూల రవీందర్‌కు 6279 ఓట్ల వచ్చాయి. గెలుపునకు కావల్సింది 9014 కావడంతో 38 ఓట్ల దూరంలో నర్సిరెడ్డి నిలిచిపోయారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లలో నర్సిరెడ్డి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. పూల రవీందర్‌కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా, నర్సిరెడ్డికి కాంగ్రెస్, వామపక్షలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. నర్సిరెడ్డి గతంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. -
'వాళ్లంతా కూడా నయీం బాధితులే'
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీంతో నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఖండించారు. మంగళవారం వారు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్లో పేరున్నంత మాత్రాన తప్పుచేసినట్టు కాదన్నారు. ప్రాథమిక సమాచారం మేరకే ఎఫ్ఐఆర్ నమోదవుతుందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో తప్పులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్వి చీప్ పాలిటిక్స్' అని మండిపడ్డారు. నయీమ్ మా ఎమ్మెల్యేలను బెదిరించారని అన్నారు. తమ పార్టీ అయినా వేరే పార్టీ అయినా చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని చెప్పారు. నేతి విద్యాసాగర్‌పై నమోదు అయింది ఎఫ్ఐఆర్ మాత్రమేనని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు అయినంత మాత్రాన దోషి కాదన్నారు. కాంగ్రెస్ నిరసన అనడానికి సిగ్గు ఉండాలని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశావని ప్రశ్నించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మోచేతి నీళ్లు తాగావని కోమటిరెడ్డి బ్రదర్స్‌పై పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తప్పులు చేసి ఉంటే.. చర్యలు తీసుకుకేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా నయీం బాధితులే' అని వెల్లడించారు. నయీం వల్ల లాభం పొందింది ఎవరూ? నష్టం పొందిందెవరో అందరికీ తెలుసునని చెప్పారు. తమ పార్టీకి చెందిన సాంబశివుడు, రాములను హత్యచేసినప్పుడు ఎందుకు స్పందించలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్ సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ అక్రమంగా సంపాదించిన డబ్బులతో పదవులు కొంటున్నాడని ఆరోపించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా వెళ్తామన్నారు. గుండాగిరితో రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. నయీమ్‌కు రాజకీయ, ఆర్థిక సహకారం కోమటిరెడ్డి బ్రదర్స్ అందించారనే అనుమానం కలుగుతుందని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌తో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. నయీంతో కాంగ్రెస్ నేతలు లబ్ధిపొందారని ఆయన విమర్శించారు. గత ముఖ్యమంత్రులు కూడా నయీంతో అంటకాగారని విమర్శించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ డిమాండ్ మునగాల (నల్గొండ జిల్లా): నానాటికీ ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని, ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేసేందుకు ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా మునగాలలో ఎంఈఓ జగన్మోహాన్‌రావు పదవీ విరమణ అభినందన సభలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేసే సమయంలో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని చందంపేట, రాజాపేట, పిఏపల్లి, డిండి, తుర్కపల్లి మండలాల్లో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్నందున అధనంగా విద్యావాలంటీర్లను ఏర్పాటు చేసి విద్యార్ధులకు విద్యాబోధన అందించే విధంగా ప్రభుత్వం కృషిచేయాలని కోరారు. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్‌కు సంబంధించిన జీఓపై సీఎం సంతకం పూర్తయినప్పటీకీ క్యాబినెట్ ఆమోదం లభించకపోవడంతో జరిగే జాప్యం వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్టియు రాష్ట్రశాఖ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయినప్పటకీ ఎన్నికలకు ముందు కేసిఆర్ ఇచ్చిన హామీ మేరకు హెల్త్‌కార్డులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీకి అనుకూలంగా 9నెలలకు సంబంధించిన ఏరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు సంబంధించిన కరువుభత్యం జీఓపై సీఎం సంతకం పూర్తయిన క్యాబినెట్ ఆమోదం చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఏద్దేవా చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ నిరంతర సమగ్ర మూల్యాంకన విద్యా విధానాన్ని గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఇది సక్రమంగా అమలు జరగాలంటే పాఠశాలలో ప్రయోగశాలలు, గ్రంధాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
పనిభారంతో ఉద్యోగుల్లో ఒత్తిడి
ఖమ్మం : సామాజిక అంశంపై పోరాటం చేసిన ఘనత తెలంగాణ ప్రజలకు, ఉద్యోగులకే దక్కిందని, తెలంగాణ ఉద్యమానికే ఇది సొంతమని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం అదనపు సంచాలకులు పసుపులేటి వెంకటేశ్వర్లు పదవీ విరమణ సభ ఆదివారం డీఈఓ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. ప్రస్తుతం పాఠశాలలు పెరిగినా ఉద్యోగుల సంఖ్య పెంచకపోవడంతో పనిభారంతో వారు ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. ప్రభుత్వం భర్తీ చేస్తున్న లక్ష ఉద్యోగాలతో అన్ని శాఖల ఉద్యోగులకు ఊరట కలుగుతుందని అన్నారు. పనిభారం ఉన్నా సహచర ఉద్యోగులను నొప్పించకుండా పని చేయించుకున్న ఘనత వెంకటేశ్వర్లుకే దక్కిందని అన్నారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు విఠల్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో అలసిపోయిన నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాల భర్తీతో ఊరట కలుగుతుందని అన్నారు. చిన్న ఉద్యోగిగా చేరిన వెంకటేశ్వర్లు ఉన్నత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉన్నారని అన్నారు. సన్మాన గ్రహిత పసుపులేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబంలో పుట్టి తాను పెద్దల సహాయంతో ఉద్యోగంలో చేరానని అన్నారు. అందరి అభిమానంతో పని చేసి ఉద్యోగ విరమణ పొందడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్ఈఆర్టీ ప్రొఫెసర్ వేణయ్య, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు జంగయ్య, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి వెంకటనర్సయ్య, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ వేణుమనోహర్, డీఈఓ కార్యాలయ ఉద్యోగులు కిషోర్, హరిందర్, రాయుడు, సత్యనారాయణ, నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు బంధువులు విఠల్, ముదిగొండ ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ మందడపు నాగేశ్వరరావు(బుల్లెట్‌బాబు), మేకల సంగయ్య, ఆకుల గాంధీ, శెట్టి రంగారావు పాల్గొన్నారు. అనంతరం పసుపులేటి వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించారు. -
ఆ టీచర్లను తెలంగాణలోనే ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ఏపీలో కలి పేసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల టీచర్లను తెలంగాణలోనే ఉంచాలని పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ డిమాండ్ చేశారు. సచివాలయంలో వారు గురువారం కమలనాథన్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. అనంతరం వారు ఏపీ సీఎస్ కృష్ణారావును కూడా కలిశారు.