ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ డిమాండ్
మునగాల (నల్గొండ జిల్లా): నానాటికీ ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని, ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేసేందుకు ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా మునగాలలో ఎంఈఓ జగన్మోహాన్‌రావు పదవీ విరమణ అభినందన సభలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేసే సమయంలో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని చందంపేట, రాజాపేట, పిఏపల్లి, డిండి, తుర్కపల్లి మండలాల్లో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్నందున అధనంగా విద్యావాలంటీర్లను ఏర్పాటు చేసి విద్యార్ధులకు విద్యాబోధన అందించే విధంగా ప్రభుత్వం కృషిచేయాలని కోరారు.
ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్‌కు సంబంధించిన జీఓపై సీఎం సంతకం పూర్తయినప్పటీకీ క్యాబినెట్ ఆమోదం లభించకపోవడంతో జరిగే జాప్యం వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్‌టియు రాష్ట్రశాఖ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయినప్పటకీ ఎన్నికలకు ముందు కేసిఆర్ ఇచ్చిన హామీ మేరకు హెల్త్‌కార్డులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీకి అనుకూలంగా 9నెలలకు సంబంధించిన ఏరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఉపాధ్యాయులకు సంబంధించిన కరువుభత్యం జీఓపై సీఎం సంతకం పూర్తయిన క్యాబినెట్ ఆమోదం చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఏద్దేవా చేశారు. పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ నిరంతర సమగ్ర మూల్యాంకన విద్యా విధానాన్ని గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఇది సక్రమంగా అమలు జరగాలంటే పాఠశాలలో ప్రయోగశాలలు, గ్రంధాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి
Published Sun, Aug 2 2015 1:58 PM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM
Advertisement