వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం!
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే అంటూ చేపట్టిన పులివెందుల సమన్వయకర్త వైఎస్ అవినాష్ రెడ్డి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు శిబిరానికి చేరుకున్నారు. భారీ ఎత్తున్న పోలీసులు అవినాష్ రెడ్డి శిబిరం వద్ద మోహరించారు. ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
సమన్యాయం జరిగేంత వరకు సమైక్యంగా ఉంచాలంటూ అవినాష్ రెడ్డి చేపట్టిన దీక్ష ఆదివారానికి ఏడో రోజుకు చేరుకుంది. అవినాష్ రెడ్డి ఆరోగ్యం క్షీణించి.. ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలోని నీటి సమస్యలు, హైదరాబాద్ అంశం పరిష్కారమయ్యేంత వరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.