pulla
-
అంతుచిక్కని వ్యాధి: యంత్రాంగం అప్రమత్తం
సాక్షి, పశ్చిమగోదావరి: కొమరవోలు, పూళ్లలో కొందరు అస్వస్థతకు గురయ్యారని.. సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగమంతా అప్రమత్తమైందని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు.అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. సీఎస్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ కమిషనర్లు ఏలూరు, పూళ్ల ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చదవండి: వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష) తాగునీరులో ఎలాంటి సమస్య లేదు: అనిల్‌కుమార్ పూళ్ల గ్రామంలోని తాగునీరులో ఎలాంటి సమస్య లేదని వైద్య, ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై విచారణ చేస్తున్నామని.. తాగునీరు, ఆహారం, కూరగాయల శాంపిల్స్ తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 22 మందిలో ఐదుగురు డిశ్చార్జ్ అయ్యారని.. అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలిచ్చారని చెప్పారు. సీఎంకు సాయంత్రం నివేదిక ఇస్తామని అనిల్‌కుమార్ తెలిపారు. చదవండి: గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్: సీఎం జగన్ -
వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వెలుగుచూసిన అంతుచిక్కని వ్యాధి లక్షణాలపై శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కె.భాస్కర్ హుటాహుటిన ఏలూరు బయలుదేరారు. పూళ్లలో నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.(చదవండి: పశ్చిమ గోదావరిలో వింతవ్యాధి కలకలం) అదుపులో పరిస్థితి: ఆళ్ల నాని పశ్చిమగోదావరి: కొమిరేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటివరకు 22 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారని.. గ్రామంలో ‘108’ వాహనాలను ఏడు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. 25 మంది ఏఎన్‌మ్‌లు, ఆశావర్కర్లు ఇంటింటికి సర్వే చేస్తున్నారని, రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ‘‘మొన్నటి వరకు రాజకీయాల కోసం దేవుళ్లను లాగారు. జిల్లాలో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వస్తున్నాయి. ఏదైనా కుట్ర జరిగి ఉండొచ్చని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తాం. ప్రజలెవరూ ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని’’ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.(చదవండి: పరుగులు పెడుతున్న పోలవరం పనులు) -
పశ్చిమ గోదావరిలో వింతవ్యాధి కలకలం
భీమడోలు: వింత వ్యాధి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. బాధితుల సంఖ్య 20కి చేరింది. వింత వ్యాధి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇద్దరు బాధితులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలా పడిపోయిన వారిలో కొందరికి ఫిట్స్ లక్షణాలు ఉన్నాయి. వైద్య అధికారులు అప్రమత్తమై వెంటనే గ్రామంలో 5 వైద్య బృందాలు ఏర్పాటుచేశారు. ఇంటింటికి వెళ్లి అధికారులు సర్వే చేస్తున్నారు. ఆశ వర్కర్లు గ్రామంలోని 6 నీళ్ల ట్యాంక్‌లో వాటర్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. వింత వ్యాధి బాధితులను ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, కలెక్టర్ రేవు ముత్యాలరాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ సునంద పరామర్శించారు. పూళ్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించనున్నారు. గతంలో ఏలూరులో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాధితులంతా ప్రత్యేక చికిత్స పొందుతున్నారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారని వైద్య అధికారులు చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. -
'పూళ్ల'లో అంతుచిక్కని వ్యాధి లక్షణాలు
భీమడోలు: నెల రోజుల క్రితం ఏలూరు నగరాన్ని వణికించిన అంతుచిక్కని వ్యాధి లక్షణాలు రెండు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల గ్రామంలోనూ వెలుగు చూస్తున్నాయి. ఫిట్స్ వచ్చి పడిపోవడం, కళ్లు తిరిగి స్పృహ కోల్పోవడం, నోటి వెంట నురగలు రావడం, వాంతులు, మూతి వంకర్లు తిరగడం వంటి లక్షణాలతో మొత్తం 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరంతా పూళ్ల పంచాయతీ పరిధిలోని పూళ్ల తూర్పు, పడమర హరిజనపేట, రెడ్డినాయుడుపేట, జంగం వీధికి చెందినవారు. ఈ నెల 15న ఒకరు ఇలాంటి లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. 16న మరో ఇద్దరు, ఆది, సోమవారాల్లో మరో 12 మంది ఇదే లక్షణాలతో పూళ్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స పొందారు. బాధితుల్లో ఎక్కువ మంది చేపల పట్టుబడి, ప్యాకింగ్, వ్యవసాయ పనులు చేసుకునే వారే. బాధితులకు పీహెచ్సీ వైద్యులు బి.లీలాప్రసాద్, ఇ.కల్యాణి చికిత్స అందించడంతో కోలుకుని ఇళ్లకు వెళ్లారు. సోమవారం రాత్రి తొమ్మిదేళ్ల బాలుడు ఇవే లక్షణాలతో పీహెచ్‌సీకి రాగా.. అతడికి రక్తహీనత ఉండటంతో అంబులెన్స్‌లో ఏలూరులోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసుల విషయాన్ని విషయాన్ని డీఎంహెచ్‌వో కె.సునంద దృష్టికి తీసుకెళ్లగా ఆమె గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించి లక్షణాలపై ఆరా తీశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వ్యక్తితోపాటు పీహెచ్సీలో చికిత్స పొంది కోలుకున్న 14 మంది బాధితుల రక్త నమూనాలను సేకరించారు. బా«ధితులు నివాసం ఉంటున్న కాలనీల్లో తాగునీటి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్‌వో సునంద భరోసా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి ఆరా పూళ్ల గ్రామంలో అంతు చిక్కని వ్యాధి లక్షణాలు వెలుగు చూసిన ఘటనలపై ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. అస్వస్థతకు గురైన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే గ్రామానికి వైద్య బృందాలను పంపుతున్నట్టు ప్రకటించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. గ్రామంలో వెలుగు చూసిన లక్షణాలు, ఇందుకు గల కారణాలపై పూర్తి విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు. -
డిపాజిట్ సొమ్ము చోరీ
భీమడోలు : బ్యాంకులో నగదు డిపాజిట్ వేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి వద్ద రూ.21వేలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన మంగళవారం పూళ్ల ఆంధ్రాబ్యాంకులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పూళ్ల గ్రామానికి చెందిన కూటికుప్పల వాసు, అతని భార్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందారు. వాసు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో దాతలు ఇచ్చిన ఆర్థిక సాయంతో కుటుంబ సభ్యులకు చెందిన రూ.21వేల పెద్ద నోట్లను ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వాసు నిదానంగా నడుస్తూ వచ్చాడు. డిపాజిట్ పత్రం పూరించే తరుణంలో బ్యాంకు సిబ్బందికి నోట్లను చూపించాడు. కొద్దిసేపు సమయం పడుతుందని వారు బదులివ్వడంతో ఆ సొమ్మును జేబులో పెట్టుకున్నాడు. ఇంతలో అక్కడే ఉన్న 15 ఏళ్లలోపు బాలుడు బాధితుడు వాసు జేబులోని నగదును గుట్టుచప్పుడుకాకుండా చోరీ చేశాడు. ఆ తర్వాత కౌంటర్లో డిపాజిట్ పత్రం అందించే తరుణంలో జేబులో నగుదు చూసుకున్న వాసు అవి కనిపించకపోవడంతో భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ వెంకటేశ్వరరావు బ్యాంకుకు చేరుకుని బాధితడి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మేనేజర్ ఎస్.ఎస్.చలపతిరావు సహకరించడంతో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీతమ్మ చెరువులో చోరీ
చింతదిబ్బ (యలమంచిలి) : చింతదిబ్బ పంచాయతీ సీతమ్మచెరువులో సోమవారం అర్ధరాత్రి దొంగలు మూడిళ్ల తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. రెండిళ్లలో ఎటువంటి నగదు, బంగారం లేకపోవడంతో మూడో ఇంటిలో ఉన్న నగదు, బంగారం, టీవీలను తస్కరించారు. ఎస్ఐ పాలవలస అప్పారావు కథనం ప్రకారం.. బొంతు శేఖర్ గల్ఫ్‌లో ఉంటాడు. అతని భార్య నిర్మల సోమవారం రాత్రి భోజనం చేసిన తరువాత పక్కనే వాళ్ల బంధువుల ఇంటిలో పడుకుంది. ఆ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లిన దొంగలు ఇంటిలో ఉన్న కాసున్నర బంగారం, రూ. 5వేలు, ఓ ఎల్సీడీ టీవీ దోచుకెళ్లారు. ఆ సమీపంలో ఉన్న మాదాసు మహాలక్ష్మి, తానేటి శ్రీనుల ఇళ్ల తాళాలనూ పగులకొట్టారు. కానీ ఆ ఇళ్లలో ఎటువంటి నగదు, వస్తువులు లేకపోవడంతో చోరీ జరగలేదు. నిర్మల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మధ్య కాలంలో సీతమ్మచెరువులో దొంగతనం జరగడం ఇదే తొలిసారి. -
అనుమతి లేని పెట్రోల్ బంకు సీజ్
భీమడోలు : పూళ్లలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పెట్రోల్‌బంకును అధికారులు గురువారం సీజ్ చేశారు. రూ.2.30లక్షల విలువ గల పెట్రోలు, డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని పెట్రోల్ బంకులపై పౌరసరఫరా విభాగం, తూనికలు కొలతలు, రెవెన్యూ శాఖల అధికారులు దాడులు నిర్వహించారు. ఏజీపీవో టి.శ్రీరామ్‌ప్రసాద్ నేతృత్వంలో అసిస్టెంట్ లీగల్‌మెట్రాలజీ అధికారి ఎం.వెంకట్రావు, ఏలూరు అగ్నిమాపక కేంద్రం అధికారి పీవీ రామకృష్ణ, ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్ కె.రమేష్‌కుమార్, భీమడోలు ఆర్ఐ మల్లికాలు బంకులను తనిఖీ చేశారు. జాతీయ రహదారిపై పూళ్ల వద్ద గల మురళీకృష్ణ ఫిల్లింగ్‌స్టేషన్‌కు ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో దానిని సీజ్ చేశారు. బంకును యాజమాని సీహెచ్‌కే మోహన్ గత మూడు నెలలుగా నిర్వహిస్తున్నట్టు గుర్తించిన అధికారులు 1,294 లీటర్ల పెట్రోలు, 2,099 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. యాజమానిపై 6(ఏ) కేసు నమోదు చేశారు.