సబ్సిడీ పెంపుపై కేంద్రానికి నివేదిస్తా
♦ జాతీయ ఆహారభద్రత మిషన్ కన్సల్టెంట్ డాక్టర్ ఉపకార్ సదన్
♦ అల్లీపూర్లో పప్పుదినుసుల పంటల పరిశీలన
ధారూరు: జాతీయ ఆహారభద్రత మి షన్, పప్పు దినుసుల పథకం కింద కేంద్రం రైతులకు అందిస్తున్న 50 శాతం సబ్సిడీని 90 శాతానికి పెంచాలన్న తెలంగాణలోని రైతాంగం సూచనను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానని జాతీయ ఆహారభద్రత మిషన్ కన్సల్టెంట్ డాక్టర్ ఉపకార్ సదన్ అన్నారు. గురువారం ఆయన ధారూరు మండలంలోని అల్లిపూర్ గ్రామంలో సాగుచేసిన కంది, మొక్కజొన్న అంతర పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కేంద్రం రైతులకు అం దిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రా మంలో ఎంతమంది రైతులు, ఎన్ని ఎకరాల్లో పప్పుదినుసులు సాగుచేస్తున్నారని ఆయన ప్రశ్నించా రు. 50 మంది రైతులు 200 ఎకరాల్లో సాగుచేస్తున్నారని రాష్ట్ర కన్సల్టెంట్ ఫయూ మ్ తెలిపారు.
తాము ముందుగా భూసార పరీక్షలు చే యించి వచ్చిన రిపోర్టు ప్రకారం సాగు చేస్తామని, ట్రైకోడటెర్మాతో విత్తనశుద్ధి చేసి విత్తనాలు వేస్తామని రైతులు చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్కతల గోపాల్ మాట్లాడుతూ రైతులకు స్ప్రింక్లర్లు, పైపులను సబ్సిడీపై అందించాలని కోరారు. కందిలో ఏ రకం విత్తనాలను వాడుతున్నారని, దిగుబడిలో ఏమైనా వ్యత్యాసం ఉందా అని ఉపకార్ సదన్ రైతులను అడిగారు. ఆశా రకం విత్తనాలతో దిగుబడి అధికంగా వస్తుందని రైతులు చెప్పారు.
ప్రస్తుతం కొనసాగిస్తున్న పథకం ఇంకా కొనసాగిం చాలా వద్దా అని ఆయన రైతులను ప్రశ్నించగా మూడు సంవత్సరాల నుంచి కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పప్పు దినులసు పండిస్తున్నామని, అలాగే ఈ పథకాన్ని కొనసాగించాలని వారు సూచించారు. భూముల్లో ఎక్కువగా జింక్ లోపం ఉందని రైతులు ఆయన దృష్టికి తేగా జింక్‌ను బాగా వాడాలని, ఒకసారి వేస్తే 3 సంవత్సరాల వరకు పని చేస్తుందని చెప్పారు. ఉపకార్ సదన్ వెంట రాష్ట్ర కన్సల్టెంట్ ఫయూమ్, జిల్లా ఏడీఏ వీరప్ప, వికారాబాద్ ఏడీఏ దివ్యజ్యోతి, ఏఓ ఝాన్సీలక్ష్మి, ఏఈఓ సంజూరాథోడ్,రైతులు పాల్గొన్నారు.