Punjab election campaign
-
ప్రియాంకగాంధీ సంచలన వ్యాఖ్యలు
-
ఎన్నారైలకు ఓటు హక్కు.. పంజాబ్ ఎన్నికల వేళ తెరపైకి కొత్త నినాదం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకోవడంతో రాజకీయ పార్టీలు ప్రతీ అంశంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, ఇక్కడున్న వారి కుటుంబ సభ్యుల మద్దతు పొందేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నారై సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తున్నాయి. ఎన్నారై విజన్ పేరిట ఇండియా నుంచి విదేశాలకు వలసలు ఎక్కువగా కొనసాగిన రాష్ట్రాల్లో పంజాబ్, కేరళాలు ముందు వరుసలో ఉంటాయి. పంజాబ్ రాష్టం నుంచి అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో పంజాబీలు ఉపాధి కోసం వలస వెళ్లారు. తర్వాత అక్కడ వ్యాపార రంగాల్లో కూడా రాణించారు. ముఖ్యంగా కెనడా, యుకే, గల్ఫ్ దేశాలలో పంజాబీలు స్థానికంగా ప్రభావం చూపే స్థాయికి చేరుకున్నారను. ఇటీవల ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగించిన ఆందోళనకు మద్దతుగా విదేశాల్లో పలు కార్యక్రమాలు చేపట్టడం, ఆర్థిక అండదండలు అందించడంలో ఎన్నారై పంజాబీలు కీలకంగా వ్యవహారించారు. ఈ ఎన్నికల్లో ప్రవాస పంజాబీలు, వారి కుటుంబ సభ్యుల, బంధువుల ఓట్లు కీలకం కావడంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నారై పాలసీని ప్రకటించింది. ప్రవాస పంజాబీలు స్థానికంగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నారైల సమస్యలు పరిష్కరించేందుకు సింగిల్ విండో ఏర్పాటు చేస్తామని కూడా తెలిపింది. అంతేకాదు ప్రవాస పంజాబీలను ఆకర్షించడం ద్వారా టూరిజం సెక్టార్‌ను డెవలప్‌చేస్తామని కూడా తెలిపింది. ఎన్నారై ఓటుహక్కు ఇండియాలో పారిశ్రామికంగా సహాకారం అందించే విషయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న పాలసీల పట్ల ఎన్నారైలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. దీంతో పాటు చిరకాలంగా ఉన్న ఎన్నారైలకు ఓటు హక్కు డిమాండ్‌పై సానుకూలంగా స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన కొన్ని పాశ్చాత్య దేశాల్లో ప్రవాసంలో ఉన్న వారికి కూడా ఓటు హక్కును కల్పించాయి. మన దేశంలో ఇంకా ఈ సౌకర్యం లేదు. ఈ అంశంపై ఇప్పటికే పార్లమెంటు సభ్యుడు, అంతర్జాతీయ వ్యవహరాల్లో నిపుణుడైన శశిథరూర్ ఆన్లైన్ వేదికగా అనేక డిబెట్లు నిర్వహిస్తున్నారు. దీంతో పోలింగ్ తేదీ దగ్గర పడే సమయానికి ఎన్నారై ఓటింగ్ అంశం మరోసారి బలంగా తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించే విషయంలో రాజ్యంగ పరంగా, దేశభద్రత పరంగా అనేక చిక్కుముళ్లు ఉన్నాయని మరికొందరి వాదన. ఎన్నారై సంక్షేమంలో పంజాబ్ భేష్ - మంద భీమ్‌రెడ్డి (వలస వ్యవహారాల విశ్లేషకులు) వివిధ దేశాల్లో ఉన్న పంజాబీల కోసం ... ఎన్నారై డిపార్టుమెంటు పేరిట ఒక శాఖను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. దీనికి అనుబంధంగా ఒక మంత్రి ఉంటారు. ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పంజాబ్ ఎన్నారై కమీషన్ కూడా ఉంది. ఎన్నారైల కష్టసుఖాలను వినిపించేందుకు ఎన్నారై సభ పేరిట ఒక సొసైటీ కూడా పంజాబ్‌లో ఉంది. ఐజీపీ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఒక ఎస్పీ స్థాయి అధికారి పలువురు ఇతర అధికారులతో పంజాబ్ పోలీస్ ఎన్నారై వింగ్ పనిచేస్తున్నది. ఆరు ఎన్నారై పోలీసు స్టేషన్లు ఉన్నాయి. విదేశీ జైళ్లలో మగ్గుతున్నవారికి న్యాయ సహాయం చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్నారై పెళ్లిళ్ల సమస్యలు పరిష్కరించడం తదితర కార్యక్రమాలను ఈ విభాగం చూస్తుంది. ఏజెంట్లను నియంత్రించడానికి పంజాబ్ ట్రావెల్ ప్రొఫెషనల్స్ రెగులేషన్ యాక్టు-2013ను ప్రవేశపెట్టారు. వివిధ దేశాలలో పంజాబ్ ప్రభుత్వం ఎన్నారై కోఆర్డినేటర్లను నియమించింది. -
వారిని తరిమికొట్టండి..
-
వారిని తరిమికొట్టండి..
ఆమ్ ఆద్మీ.. పంజాబ్‌కు సంబంధంలేని పార్టీ ► కఠినమైన ప్రభుత్వాలు అధికారంలోకి రాకుంటే దేశంలో సంక్షోభమే.. ► పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోట్కాపురా(ఫరీద్కోట్): ‘‘పంజాబ్ పాకిస్తాన్‌కు సరిహద్దు రాష్ట్రం. పంజాబ్ మీదుగా భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు చిన్న అవకాశం దొరికినా వాడుకునేందుకు పాక్ ఎదురుచూస్తోంది. కఠిన వైఖరి అవలంబించలేని ప్రభుత్వాలు, పంజాబ్‌కు సంబంధంలేని.. విలాసాలకు అలవాటుపడిన పార్టీల ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే పంజాబ్ మాత్రమే కాదు దేశం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఆయన ఆదివారమిక్కడ ఎన్నికల సభలో ప్రసంగించారు. కాంగ్రెస్, ఆప్ పార్టీలపై విరుచుకుపడిన మోదీ శిరోమణి అకాలీదళ్–బీజేపీ కూటమికి మూడోసారి అధికారం కట్టబెట్టాలని పంజాబీలను కోరారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్‌కు సంబంధం లేని పార్టీ. పంజాబ్ ప్రయోజనాలను పణంగా పెట్టి సొంత ప్రపంచాన్ని సృష్టించుకోవాలని కలలుకం టోంది. వారెక్కడి నుంచి వచ్చారో అక్కడికి తరిమికొట్టండి’ అని అన్నారు. దేశభద్రతకు భరోసా కలిగించే ప్రభుత్వం కావాలంటే అకాలీదళ్–బీజేపీ కూటమికి పట్టం కట్టాలని మోదీ కోరారు. కాంగ్రెస్ పార్టీ పంజాబీ సిక్కు యువకులను ఉగ్రవాదులుగా చూపేందుకు ప్రయత్నించిందని ఆరోపిం చారు. ముఖ్యమంత్రి బాదల్‌పై మోదీ ప్రశంసలు కురిపించారు. రైతుల సమస్యల గురించి బాదల్‌కు బాగా తెలుసని, ఆయన రాష్ట్రం, రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, పంటల బీమా పథకాలను ప్రస్తావించి మోదీ రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సైనికుల సాహసాలను ప్రచారం చేయండి: మోదీ న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు ప్రభుత్వం నుంచి శౌర్య పతకాలను అందుకున్న సైనికుల కథనాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని మోదీ యువతకు పిలుపునిచ్చారు. యువత సైనికుల శౌర్య కథనాలను ప్రచారం చేయడం ద్వారా అనేక మంది స్ఫూర్తి పొందుతారని ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో అన్నారు. దేశమంతా రిపబ్లిక్ డే వేడుకల్లో ఉన్నప్పుడు కశ్మీర్లో మంచు కొండలు విరిగిపడి చనిపోయిన సైనికులకు ఆయన నివాళులర్పించారు. జనవరి 30న మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరారు. పరీక్షలంటే ఒత్తిడికి గురికావడం కాదని, పరీక్షల్ని పండుగలా భావించాలని విద్యార్థులకు, వారి కుటుంబాలకు సూచించారు. ప్రతి విద్యార్థి తనకు తాను పోటీ పడుతున్నట్లు భావించి ఇతరులతో పోటీపడాలని.. ఈ అంశంలో మాజీ క్రికెటర్ సచి¯ŒSను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. -
కాంగ్రెస్‌ది గతించిన చరిత్ర
► ఆ పార్టీని నమ్మకండి ► పంజాబ్ ఎన్నికల ప్రచారంలో మోదీ జలంధర్(పంజాబ్): కాంగ్రెస్ అధికారం కోసం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీది గతించిన చరిత్ర అని, దాన్ని నమ్మకూడదని పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోదీ శుక్రవారమిక్కడ బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ‘కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ. అది ఒడ్డుకు చేర్చదు. అందులో ఎక్కకూడదు. అదొక చిత్రమైన పార్టీ. అధికార దాహంతో పశ్చిమ బెంగాల్లో మనుగడ కోసం వామపక్షాలతో జట్టుకట్టింది. తనకు ఇచ్చిన సీట్లకు ఒప్పుకుంది. యూపీలో గతంలో ఎస్పీని దుయ్యబట్టి ఇప్పుడు అధికారం కోసం పొత్తుకు వెళ్లింది.. ఎస్పీలోని అంతర్గత గొడవతో కాగ్రెస్‌కు ఒక అవకాశం కనిపించింది. రాజకీయ అవకాశవాదం కాంగ్రెస్ ప్రత్యేకత’ అని అన్నారు. ఎరువుల రంగంలో అవినీతి అరికట్టామని, మాజీ సైనికులకు ఒక ర్యాంకు–ఒక పింఛను హామీని సాకారం చేశామని తెలిపారు. నోట్ల రద్దుపై గత మూడు నెలలుగా తాను దాడులకు ఎదుర్కొంటున్నానన్నారు. ‘నేను మోదీని. ఇలాంటి దాడులకు తలొగ్గను’ అని స్పష్టం చేశారు. గత 70 ఏళ్లలో అక్రమ సంపదను కూడగట్టిన వారు నోట్ల రద్దు నిర్ణయాన్ని జీర్ణించుకోలేక తనను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక మంత్రి ఇంట్లో రూ. 150 కోట్ల డబ్బును సీజ్ చేశారని, అయినా కాంగ్రెస్ అతన్ని పదవి నుంచి తప్పించలేదని ఆక్షేపించారు. దేశాన్ని నల్లధన రహితం చేయడానికి అవినీతిపై తాను ప్రారంభించిన ఉద్యమం రాజకీ యాలకు అతీతమైందని వ్యాఖ్యానించారు. హరియాణా, పంజాబ్‌ల మధ్య నలుగుతున్న సట్లేజ్ యమునా కాలువ వివాదాన్ని ప్రస్తావిస్తూ.. సాగు కోసం నీటిని వాడుకునే హక్కు పంజాబ్‌కు ఉందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ లోకి ప్రవహిస్తూ వ్యర్థంగా వెళ్లిపోతున్న సింధు జలాలను పంజాబ్‌కు తీసుకొస్తామని చెప్పారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ నేత రాహుల్‌పై ప్రధాని విరుచుకుపడ్డారు. రాష్ట్ర యువత ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు రాజకీయాలను దారుణంగా దిగజారుస్తున్నారని, అలాం టి వారికి బుద్ధి చెప్పడానికి అసెంబ్లీ ఎన్నికలు మంచి మార్గని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం శిరోమణి అకాలీ దళ్– బీజేపీ కూటమికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.