వారిని తరిమికొట్టండి..
ఆమ్ ఆద్మీ.. పంజాబ్‌కు సంబంధంలేని పార్టీ
► కఠినమైన ప్రభుత్వాలు అధికారంలోకి రాకుంటే దేశంలో సంక్షోభమే..
► పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ
కోట్కాపురా(ఫరీద్‌కోట్): ‘‘పంజాబ్ పాకిస్తాన్‌కు సరిహద్దు రాష్ట్రం. పంజాబ్ మీదుగా భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు చిన్న అవకాశం దొరికినా వాడుకునేందుకు పాక్ ఎదురుచూస్తోంది. కఠిన వైఖరి అవలంబించలేని ప్రభుత్వాలు, పంజాబ్‌కు సంబంధంలేని.. విలాసాలకు అలవాటుపడిన పార్టీల ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే పంజాబ్ మాత్రమే కాదు దేశం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఆయన ఆదివారమిక్కడ ఎన్నికల సభలో ప్రసంగించారు. కాంగ్రెస్, ఆప్ పార్టీలపై విరుచుకుపడిన మోదీ శిరోమణి అకాలీదళ్–బీజేపీ కూటమికి మూడోసారి అధికారం కట్టబెట్టాలని పంజాబీలను కోరారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్‌కు సంబంధం లేని పార్టీ. పంజాబ్ ప్రయోజనాలను పణంగా పెట్టి సొంత ప్రపంచాన్ని సృష్టించుకోవాలని కలలుకం టోంది. వారెక్కడి నుంచి వచ్చారో అక్కడికి తరిమికొట్టండి’ అని అన్నారు.
దేశభద్రతకు భరోసా కలిగించే ప్రభుత్వం కావాలంటే అకాలీదళ్–బీజేపీ కూటమికి పట్టం కట్టాలని మోదీ కోరారు. కాంగ్రెస్ పార్టీ పంజాబీ సిక్కు యువకులను ఉగ్రవాదులుగా చూపేందుకు ప్రయత్నించిందని ఆరోపిం చారు. ముఖ్యమంత్రి బాదల్‌పై మోదీ ప్రశంసలు కురిపించారు. రైతుల సమస్యల గురించి బాదల్‌కు బాగా తెలుసని, ఆయన రాష్ట్రం, రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, పంటల బీమా పథకాలను ప్రస్తావించి మోదీ రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
సైనికుల సాహసాలను ప్రచారం చేయండి: మోదీ
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు ప్రభుత్వం నుంచి శౌర్య పతకాలను అందుకున్న సైనికుల కథనాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని మోదీ యువతకు పిలుపునిచ్చారు. యువత సైనికుల శౌర్య కథనాలను ప్రచారం చేయడం ద్వారా అనేక మంది స్ఫూర్తి పొందుతారని ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో అన్నారు. దేశమంతా రిపబ్లిక్ డే వేడుకల్లో ఉన్నప్పుడు కశ్మీర్‌లో మంచు కొండలు విరిగిపడి చనిపోయిన సైనికులకు ఆయన నివాళులర్పించారు. జనవరి 30న మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరారు.
పరీక్షలంటే ఒత్తిడికి గురికావడం కాదని, పరీక్షల్ని పండుగలా భావించాలని విద్యార్థులకు, వారి కుటుంబాలకు సూచించారు. ప్రతి విద్యార్థి తనకు తాను పోటీ పడుతున్నట్లు భావించి ఇతరులతో పోటీపడాలని.. ఈ అంశంలో మాజీ క్రికెటర్ సచి¯ŒSను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.