pupil facing problems
-
లైన్లన్నీ బిజీ
ఉండి/అత్తిలి : నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద, పింఛన్ల కోసం పంచాయతీ కార్యాలయాల వద్ద, ఇప్పుడిదిగో రేషన్ సరుకుల కోసం డిపోల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ నెల నుంచి నగదు రహిత లావాదేవీల ద్వారా మాత్రమే రేషన్ సరుకులు అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో రేషన్ షాపు వద్ద క్యూ లైన్లు చాంతాడంత ఉంటున్నాయి. సర్వర్లు సరిగా పనిచేయకపోవడంతో రోజుకు పదిమందికి కూడా రేషన్ అందే పరిస్థితి లేదు. ఒక ఇంటిలో తండ్రి పింఛను కోసం లైన్లో ఉంటే.. కొడుకు నగదు కోసం బ్యాంకు క్యూ లైన్లో, తల్లి రేషన్ సరుకుల కోసం డిపో వద్ద క్యూలో పడిగాపులు పడాల్సిన దుస్థితి జిల్లాలో ఏర్పడింది. ఆ విధంగా ముందుకు పోవడమంటే ఇదేనేమో! పులిని చూసి నక్కవాతలు పెట్టుకుందన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం చక్కగా సాగిపోయే వ్యవస్థను నిర్వీర్యం చేయనారంభించింది. క్యాష్‌లెస్ అంటూ రేషన్ సరుకులకు వచ్చిన వారితో వేలిముద్రలు వేయించుకుంటూ బ్యాంకు ఖాతా ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. బ్యాంకులకు ఆధార్ అనుసంధానం కాకపోవడం ఒక కారణమైతే, ఆధార్ లింక్ కాకపోవడం మరొక కారణ. అన్ని సక్రమంగా సాగుతున్నాయని అనుకునే సమయంలో సర్వర్ సమస్య తలెత్తుతోంది. దీంతో రోజుల తరబడి లబ్ధిదారులు రేషన్‌దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రతినెలా 5వ తేదీ నాటికి రేషన్ ఇవ్వడం ముగించి 6వ తేదీకి మిగిలిన సరుకు బ్యాలె న్స్ గా చూపించాలి. కాని ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కనీసం 30 శాతం కూడా రేషన్అందించలేకపోయారు. అలాగే మరికొన్ని రేషన్ షాపుల్లో ఒక్కకార్డుకు కూడా రేషన్ ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇది వారు చేసుకున్న పాపం అన్నట్టు ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణం. ప్రజల పరిస్థితి ఇలా ఉంటే రేషన్ డీలర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. క్యాష్‌లెస్ ట్రాన్సక్షన్స్ అంటూ ప్రారంభించిన ప్రభుత్వం అందుకు అనుగుణమైన ఏర్పాట్లు చేయకుండా నాసిరకం యంత్రాలను తమ మొహాన కొట్టి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు దుకాణానికి వచ్చిన ప్రజలు ఒకటికి రెండుసార్లు ఇంటికి వెళ్లయినా వస్తున్నారు. కాని డీలర్ల పరిస్థితి అలా లేదు, ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు సర్వర్ కనెక్ట్ అవుతుందా? అని ఎదురుచూడటమే పెద్ద పనిగా మారిపోయింది. ఇలాగైతే నెల రోజులైనా రేషన్ పంపిణీ పూర్తి కాదని వాపోతున్నారు. -
కుండపోత
బుట్టాయగూడెం : జిల్లాలో ఆదివారం కుండపోత వాన కురిసింది. ఏజెన్సీలోని కొండవాగులు వరదనీటితో పోటెత్తాయి. మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా సాయంత్రం వరకూ వర్షం కురవడంతో మండలంలోని కే.ఆర్.పురం, అల్లి కాలువ, వీరన్న పాలెం, ఇప్పలపాడు సమీపంలోని జల్లేరువాగు, రామారావు పేట, పట్టినపాలెం సమీపంలోని వాగు, కోపల్లి సమీపంలోని కొవ్వాడ వాగులు పొంగిపొర్లాయి. అదేవిధంగా కొమ్ముగూడెం, కంగాలవారిగూడెం, కుమ్మరిగట్టు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లల్లోకి ప్రవేశించింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు నానా అవస్థ పడ్డారు. కొండవాగుల ప్రవాహం కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. తాళ్లచెరువు, బైనేరు వాగు, కొమ్ముగూడెం కాలువ, రెడ్డిగణపవరం కాలువ కళింగలు పొంగాయి. కుమ్మరిగట్టు సమీపంలో కొన్ని ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. జిల్లాలో 12.6 మి.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదు కొవ్వూరు : గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఆదివారం 8 గంటల సమయానికి జిల్లాలో 12.6 మి.మీటర్లు సరాసరి వర్షపాతం నమోదైంది. బుట్టాయిగూడెం మండలంలో అత్యధికంగా 57.6 మి.మీటర్లు వర్షం కురిసింది. ఉండ్రాజవరంలో 43.6, కొయ్యలగూడెంలో 23.4, పెరవలిలో 32.8, తణుకులో 37.2, నల్లజర్లలో 28.4, పెనుమంట్రలో 16.8, తాడేపల్లిగూడెంలో 11.0, కుక్కునూరులో 14.2, వీరవాసరంలో 15.2, గోపాలపురంలో 12.2, వేలేరుపాడు లో17.4 మి.మీటర్లు చొప్పున నమోదైంది. ఇక మిగిలిన మండలాల్లో నామమాత్రంగా పది మి.మీటర్లు లోపు వర్షపాతం నమోదైంది. జీలుగుమిల్లి 3.2, నిడదవోలులో 9.0, ఇరగవరంలో 7.2, అత్తిలిలో 5.2, పాలకొల్లులో 5.8, భీమవరంలో 3.2, ఆచంటలో 9.4, పాలకోడేరులో 3.2, ద్వారకా తిరుమలలో 4.2 మి.మీటర్లు చొప్పున నమోదైంది. జిల్లాలో పలు చోట్ల భారీవర్షం పడగా కొన్ని చోట్ల మాత్రం చిరుజల్లులు మాత్రమే పడడం విశేషం. -

డ్రైవింగ్ లైసెన్సులకు బ్రేకులు
తణుకు: వాహనంతో రోడ్డుపై అడుగుపెడితే అడుగడుగునా పోలీసులు, రవాణాశాఖ అధికారుల దాడులు.. డ్రైవింగ్ లైసెన్సుతోపాటు ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకపోతే భారీ జరిమానాలు.. కొద్దికాలంగా జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి. దీంతో వాహనచోదకులు వేలాదిగా డ్రై వింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అర్హతలు ఉండి, పరీక్షలన్నీ పూర్తిచేసినా శాశ్వత లైసెన్సులు జారీ జాప్యం అవుతుండటంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు. వీటి కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎల్ఎల్ఆర్ వచ్చిన 30 రోజుల తర్వాత శాశ్వత లైసెన్సు కోసం అన్ని పరీక్షలు పూర్తయితే అదే రోజున డ్రై వింగ్ లైసెన్సు జారీ చేస్తుంటారు. అయితే మూడు నెలలుగా జిల్లాలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కేవలం డ్రై వింగ్ లైసెన్సులే కాకుండా వాహన రిజిస్ట్రేషన్, ట్రాన్స్ఫర్ చేసుకున్న రిజిస్ట్రేషన్ కార్డులు, లైసెన్సు రెన్యువల్ కార్డులు ఇలా వేల సంఖ్యలో కార్డులు నిలిచిపోవడంతో అటు అధికారులు ఇటు వాహనచోదకులు తలలు పట్టుకుంటున్నారు. రోజుకు వెయ్యి కార్డులు అవసరం జిల్లాలోని ప్రధానంగా ఏలూరులో ఉపరవాణా కార్యాలయంతో పాటు భీమవరం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం, తణుకు, పాలకొల్లు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం యూనిట్ కార్యాలయాల్లో నిత్యం డ్రై వింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఆర్సీలు, లైసెన్సు రెన్యూవల్, ఫిట్నెస్ వంటి సేవలు అందుతుంటాయి. ఈ సేవలన్నీ వాహనదారులకు చేరడానికి కార్డులపై ముద్రించి అందజేయాల్సి ఉంటుంది. మూడు నెలలుగా ఖాళీ కార్డుల సరఫరా లేకపోవడంతో కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. సాధారణంగా నిత్యం జిల్లాలోని అన్ని కార్యాలయాల పరిధిలో సుమారు వెయ్యి కార్డుల వరకు అవసరం అవుతుంటాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు సుమారు 60 నుంచి 70 వేల వరకు డ్రై వింగ్ లైసెన్సులు, ఆర్సీలు నిలిచిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా కార్యాలయాల్లో ఉన్న స్టాకు ప్రకారం ఖాళీ కార్డులను అందజేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో కార్డులు నిండుకోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పట్టుబడితే జరిమానాలు ఒకవైపు వాహన సవరణ చట్టంలో నిబంధనలు కఠినతరంగా ఉండటంతో వాహనదారుల వద్ద సంబంధిత పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం డ్రై వింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా నిర్ణీత సమయంలో కార్డులు చేతికి అందకపోవడంతో రోడ్డుపైకి రావాలంటేనే వాహనచోదకులు భయపడుతున్నారు. మరోవైపు పోలీసు, రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడతూ జరిమానాలు విధిస్తున్నారు. కార్డుల సరఫరాను పునరుద్ధరించడంలో రవాణాశాఖ ఉన్నతాధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి కేవలం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కార్డుల సరఫరా నిలిచిపోయింది. పాత కాంట్రాక్టర్ గడువు పూర్తికావడంతో కొత్త కాంట్రాక్టర్ బాధ్యతలు తీసుకోవడంలో జాప్యం కావడంతోనే సమస్య తలెత్తింది. కార్డులు జిల్లాకు రావడానికి మరో 20 రోజులు సమయం పడుతుంది. – జె.రమేష్‌కుమార్, ఇన్చార్జి డీటీసీ, ఏలూరు -
జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తణుకు : కొద్దిరోజులుగా భానుడి భుగభుగలకు జిల్లాకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆగస్ట్‌లో భారీ వర్షాలు కురవాల్సి ఉండగా ఎన్నడూ లేనట్టుగా వాతావరణం నడి వేసవిని తలపిస్తోంది. రెండు వారాలుగా భానుడు ఉగ్రరూపం దాల్చుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కాలంలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో వారంతా తల్లడిల్లుతున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక జూలై నెలలో వర్షాలు కురిసినప్పటికీ ఆగస్ట్ రెండో వారం నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. సాధారణంగా ఆగస్ట్‌లో వర్షాలు పడతాయని, వాతావరణం చల్లబడుతుందని ఆశించిన ప్రజలకు సూరీడు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు ఉదయం నుంచి వీస్తున్న వడగాడ్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోహిణీ కార్తె ముగిశాక జూన్ రెండో వారంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ తర్వాతి రోజుల్లో భారీ వర్షాలు కురిశాయి. గత నెల నెలాఖరు, ఈ నెల మొదటి రెండు రోజుల్లో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రెండు వారాలుగా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతూ వచ్చాయి. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాడ్పులతో పాటు ఉక్కపోత కూడా తోడయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 35 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతల నమోదు నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు జిల్లాలో 35 డిగ్రీలపైగా నమోదవుతున్నాయి. ఏలూరులో గురు, శుక్రవారాల్లో 35 డిగ్రీల పైగా నమోదు కాగా ప్రధాన పట్టణాలన్నింటిలో దాదాపు అదే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతకు నిత్యం రద్దీగా ఉండే రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు వేడి ఉంటోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.